Latest Updates
-
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే!
పండుగ తర్వాత బరువు తగ్గించుకోడం ఎలా
పండగలు వస్తే చాలా ఇంట్లో హడావిడి అంతా..ఇంతా కాదు. పండగతో పాటు ఆనందాన్ని కూడా మోసుకొస్తుంది. ఇంటి నిండా బంధువులు, రంగు రంగుల దుస్తులు, అందమైన అలంకరణలు, నోరూరించే పిండి వంటలు, ఆకర్షించే నైవేద్యాలు..ఇలా ఇల్లంతా పండగే అన్నట్లు ఉంటుంది. ఈ హడావిడిలో బంధువులు, మిత్రులందరితో కలిసి రోజూ కంటే కాస్త ఎక్కువగానే లాగించేస్తుంటాము. ఇక పండగ కోసం తయారుచేసే పిండి వంటలు,నైవేద్యాలు ఉండనే ఉంటాయి. వాటిని వేస్ట్ చేయడానికి ఇష్టపడని వారు, నలుగురితో కలిసి మరికొందరు వీటినీ తీసుకుంటూ ఉంటారు. దాంతే బరువు పెరగడం సహజంగా జరిగేదే..ఇలా జరకుండా ఉండాలంటే..పండగ సమయంలో కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
అయితే అలాంటివి తీసుకోకపోయినా, కంగారు పడాల్సిన అవసరం లేదు. పండగను ముగయగానే దినచర్యలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే పండక్కి తీసుకున్న అదనపు ఆహారం వల్ల బరువు పెరగకుండా...శరీరానికి వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ జరగకుండా కాపడుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో చూద్దాం...

పంచదారకు దూరంగా..
పండగల సమయంలో తీసుకొనే ఆహార పదార్థాల్లో స్వీట్లు ముందువరసలో ఉంటాయి. రోజుకి ఒకటి, రెండు అంటూ ఎలాంటి పరిమితి పెట్టుకోకుండా నచ్చినన్ని స్వీట్లు తినే సందర్బం పండగలే మరి. అందుకే పండగ ముగిసిన వెంటనే స్వీట్స్ కు దూరంగా ఉండాలి. అలా ఉండాలంటే, పండగలప్పుడు తయారుచేసి, మిగిలిని ఉన్న స్వీట్స్ ను ఎవరికైనా ఇచ్చేయడం...కాఫీ, టీలలో పంచదార వేసుకోకుండా ఉండటం లేదా పూర్తిగా తగ్గించేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో చేరిన చక్కెరలను తగ్గించుకోవచ్చు. అలాగే విషతుల్యాలను కూడా తొలగించుకోవచ్చు.

నీళ్లే పరమాఔధి:
పండగ తరవ్ాత బరువు పెరగకుండా కాపాడుకోవడంతో పాటు, ఆ సమయంలో శరీరంలో చేరిన విషతుల్యాలను బయటకు పంపించడంపై కూడా ద్రుష్టి సారించాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ఒకేఒక్క మందు వీలైనంత ఎక్కువ నీరు తాగడమే . కేవలం నీరు మాత్రమే కాదు, కొబ్బరి నీళ్లు, కూరగాయలు, పండ్లరసాలు, వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఉదయాన్నే గ్లాసు గోరువెచ్చని నీరు, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల కూడా శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. ఇంకా ఆహారాం తినడానికి అరగంట ముందు ఖచ్చితంగా రెండు గ్లాసుల నీరు తాగే అలవాటు చేసుకోవాలి.

తాజాగా
పండగ పూర్తి అయిన తర్వాత ఇప్పటి వరకూ నూనెతో తయారుచేసిన, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయి ఉంటారు. అయితే ఇప్పుడు ఆ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా డైలీ డైట్ లో చేర్చుకోవాలి . ఆకుకూరలు, వెజిటేబుల్ ముక్కలను సలాడ్స్ చేసుకొని తినడం, కూరగాయ ముక్కల్ని ఉడకబెట్టి తినడం, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా బరువు పెరగడం మాత్రమే కాదు, కాస్తో, కూస్తో బరువు తగ్గొచ్చు కూడా. అియతే దీంతో పాటు మీ వంటకాల్లో నూనె వాడకాన్ని కూడా వీలైనంత తగ్గించడమూ అవసరమే..

ప్రోటీన్, పోషకాలు నిండుగా..
పండగ సమయంలో తీసుకొనే ఆహారపదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని పోషకాలు, ప్రోటీన్ల శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అందుకే ఆ లోటును ఇప్పుడు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. బీన్స్, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు వంటి ఆహారపదార్థాల్లో ప్రోటీన్ అధిక మోతాదులో లభిస్తుంది. వీటితో పాటు శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, ఇతర పోషకాలు, అందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

వ్యాయామం మరచిపోకండి:
డైట్ విషయంలో ఎన్ని మార్పులు చేసుకున్నా, ఎక్కువగా తీసుకున్న క్యాలరీలు శరీరంలో కొవ్వు రూపంలో చేరిపోయి..బరువు పెరగకుండా జాగ్రత్తపడాలంటే వ్యాయామం తప్పనిసరి. దీనికోసం ముందు 20 నిమిషాలతో ప్రారంభించి మీ వర్కౌట్ ని నలభై నిమిషాలకు పెంచవచ్చు. సులువుగా ఉండే వాకింగ్, జాగింగ్, వంటివి లేదా స్కిప్పింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, ఏరోబిక్స్, ఇతర ఎక్సర్ సైజుల్లో మీకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఏదైనా అతిగా చేయడం వల్ల ముప్పు వాటిల్లుతుందన్న విషయం గుర్తుంచుకొని, మీ వ్యాయామం గంటకు మించకుండా జాగ్రత్తపడాలి.



Click it and Unblock the Notifications