Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
7 డేస్ లో టమ్మీ ఫ్యాట్ ను బర్న్ చేసే బెస్ట్ ఇండియన్ ఫుడ్స్ ..!!
ఉబ్బుగా (ఎత్తుగా) ఉన్న పొట్ట లేదా ఎక్సెస్ ఫ్యాట్ తో ఉన్న పొట్టను చూస్తే ఎవ్వరూ ఇష్టపడరు. అంతే కాదు, పొట్ట వద్ద చేరిన ఎక్సెస్ ఫ్యాట్ మనకు తెలియకుండానే పొట్ట చుట్టూ అంటే నడుము చుట్టూ చేరడం వల్ల నడుము చుట్టుకొలత కూడా పెరుగుతుంది. అది ఎప్పుడు గుర్తిస్తామంటే? మనకు దుస్తులు టైట్ అయినప్పుడు ఈ విషయాన్ని గుర్తిస్తాము. అంతరకూ ఈ విషయాన్ని మనం కూడా గుర్తించము. టమ్మీ ఫ్యాట్ ను ఇష్టపడని వారు, త్వరగా చిరు బొజ్జను కరిగించుకోవాలని కోరుకునే వారి కోసం కొన్ని ప్రత్యేకమైన ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఫుడ్స్ చిరుబొజ్జను చాలా ఎఫెక్టివ్ గా కరిగిస్తాయి.
టమ్మీ(పొట్ట)చుట్టు కొవ్వు చేరితే చూడటానికి అసహ్యంగా కనిపించడం మాత్రమే కాదు, ఇది మనలోని నమ్మకాన్ని తగ్గించేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మనం చేయాల్సిదల్లా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. జీర్ణ సమస్యలు, బ్యాక్ పెయిన్, ఓబేసిటి, హార్ట్ సమస్యలు, మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
మీ ఫ్రెండ్స్ ద్వారా లేదా డైటీషియన్స్, వ్యాయామ నిపుణుల ద్వారా టమ్మీ ఫ్యాట్ కరిగించుకోవడానికి కొన్ని పద్దతులను లేదా మార్గాలను తెలుసుకుని ఉంటారు. వాటిని ఫాలో అయిన తర్వాత కూడా టమ్మీ ఫ్యాట్ కరిగించుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వారికోసం 10 ఇండియన్ సూపర్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో పరిచయం చేయడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే నేచురల్ గానే టమ్మీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు...అవేంటో తెలుసుకుందాం..

1. దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. పౌడర్ గా తయారుచేసుకుని టీలో కలుపుకోవడం లేదా ఆహారాల్లో జోడించడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ వెల్స్ ను తగ్గిస్తుంది. దాంతో టమ్మీ చుట్టూ ఏర్పడ్డ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

2. రాగులు:
రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. టమ్మీ ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రాగులతో తయారుచేసే వంటలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల అతి తక్కువ కాలంలోనే బరువు తగ్గించుకోగలుగుతారు.

3. మస్టర్డ్ ఆయిల్ :
నూనెల్లో వివిధ రకాల నూనెలున్నాయి. వీటిలో ఆవనూనె టమ్మీ ఫ్యాట్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆవనూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ ఫ్యాట్ ను త్వరగా బర్న్ చేయడానికి, కొలెస్ట్రాల్ కరగించడానికి సహాయపడుతుంది.

4. కీరకాయ:
కీరకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ, కీరదోసకాయ బరువు తగ్గించడానికి సహాయడటంతో పాటు, ఫ్యాట్ ను ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది.

5. గార్లిక్ :
టమ్మీ ఫ్యాట్ కరిగించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ , ఫ్యాట్ ను ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది. దాంతో ప్రాణాంత వ్యాధులైన క్యాన్సర్, హార్ట్ సమస్యలను నివారించుకోవచ్చు.

6. తేనె:
ఫ్యాట్ కరిగించడానికి, ఊబకాయం తగ్గించడానికి తేనె గ్రేట్ గా సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. టమ్మీ ఫ్యాట్ కరిగించుకోవడానికి సహాయపడుతుంది.

7. కరివేపాకు:
కరివేపాకు ఫ్యాట్ ను కరిగించడం మాత్రమే కాదు, టమ్మీ చుట్టూ ఏర్పడ్డ టాక్సిన్స్ , బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

8. పసుపు:
ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. ఫ్యాట్ బర్న్ చేయడంలో పసుపు ఒక నేచురల్ పదార్థం. పసుపులో ఉండే కుర్కుమిన్ కంటెంట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది.

9. పచ్చిమిర్చి:
పచ్చిమిర్చిలో క్యాప్ససిన్ అనే కంటెంట్ ఉండటం వల్ల ఇది, క్యాలరీలను బర్న్ చేస్తుంది. పచ్చిమిర్చిని రెగ్యులర్ డైట్ లో చేర్చినప్పుడు , బాడీలో మెటబాలిజం రేటును పెంచుతుంది. దాంతో ఫ్యాట్ కరిగే ప్రొసెస్ కూడా పెరుగుతుంది.

10. పెసరపప్పు:
పెసరపప్పు ఫ్యాట్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు నిర్ధారించారు. ఇవి శరీరంలో కొవ్వు చేరకుండా చేస్తుంది. పెసరపప్పులో ఉండే ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, మరియు ఐరన్ లు ఫ్యాట్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
