Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
వార్నింగ్: నిర్లక్ష్యం చేయకూడని డయాబెటిక్ లక్షణాలు
డయాబెటీస్.. !! ప్రతి ఒక్కరినీ భూతంలా వెంటాడుతున్న సైలెంట్ కిల్లర్. బ్లడ్ లో హై షుగర్ లెవెల్స్ ఉండటాన్ని డయాబెటిస్ వ్యాధిగా పిలుస్తారు. 2014 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 387 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇంత వేగంగా వస్తున్న డయాబెటిస్ చాలా ప్రమాదకరంగా మారింది.
షుగర్ పేషంట్స్ ఖచ్చితంగా తినకూడని వెజిటేబుల్స్
మూడు రకాల డయాబెటిస్ ప్రస్తుతం ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ దీన్నే జ్యువెనైల్ డయాబెటిస్ అని పిలుస్తారు. సరైన మొత్తంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేనప్పుడు ఈ టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. ఇది ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా, వైరల్ ఇల్ నెస్, ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ డ్యామేజ్ అయినా, విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఈ డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
టైప్ 2 డయాబెటిస్. ఇలా చాలా సాధారణంగా వచ్చేది. ఇక్కడ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయకపోవడం, లేదా ఇన్సులిన్ ని కణాలు సరైన స్థాయిలో ఉపయోగించకపోవడం వల్ల వస్తుంది. ఒబేసిటీ, ఫ్యామిలీ హిస్టరీ, ఏజింగ్, హైబ్లడ్ ప్రెజర్ వంటివి టైప్ 2 డయాబెటిస్ కి కారణమవుతాయి.
మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు
గెస్టేషనల్ డయాబెటిస్ అనేది మూడోది. ఇది ప్రెగ్నెన్సీ తర్వాత లేదా ప్రెగ్నెన్సీ సమయంలో వస్తుంది. 25 ఏళ్లు దాటిన మహిళలకు వచ్చే అవకాశాలుంటాయి. దీనికి ఒబేసిటీ, ఫ్యామిలీ హిస్టరీ ప్రధాన కారణాలు. డయాబెటిస్ ని సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇది ఈజీగా డవలప్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది అసలు లక్షణాలను కూడా గుర్తించలేకపోతారు.
కాబట్టి డయాబెటిస్ ను మొదట్లోనే గుర్తించే కొన్ని లక్షణాలున్నాయి. వాటి గురించి అవగాహన కల్పించుకోవడం మంచిది.
అవేంటో ఇప్పుడు చూద్దాం..

తరచుగా యూరినేషన్
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ కి ప్రాధమిక లక్షణం యూరినేషన్. తరచుగా యూరిన్ కి వెళ్లడం అది కూడా ఎక్కువ మొత్తంలో వెళ్లడం అనేది డయాబెటిస్ కి సంకేతంగా గుర్తించాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా యూరిన్ కి వెళ్తున్నారంటే.. ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

దాహం
విపరీతమైన దాహం అనేది డయాబెటిస్ లక్షణాల్లో చాలా ముఖ్యమైనది. తరచుగా యూరినేషన్ కి వెళ్లడం వల్ల శరీరం డీహైడ్రేట్ కి లోనై ఎక్కువ దాహంగా అనిపిస్తూ ఉంటుంది. హైబ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే దాహం ఎక్కువగా ఉండటానికి కారణమవుతుంది. ఇలాంటి ఫీలలింగ్ కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

ఆకలి
ఎక్కువగా ఆకలిగా ఉండటం, ఏదో తింటూ ఉంటే డయాబెటిస్ లక్షణాలని గుర్తించండి. సాధారణంగా కంటే.. ఎక్కువ ఆకలిగా ఉండటం, ఎక్కువగా తినడం జరుగుతుంటే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

గాయాలు
ఏ చిన్న గాయమైనా త్వరగా మానకపోతే.. డయాబెటిస్ డేంజర్ ని గుర్తించాలి.
గాయాలు తగిలిన ప్రాంతానికి బ్లడ్ ఫ్లో తగ్గి, ఆక్సిజన్ సరిగా అందక.. అది మానకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఒక్కసారి డయాబెటిస్ చెక్ చేయించుకోవడం మంచిది.

ఇన్ఫెక్షన్స్
హైబ్లడ్ షుగర్ కారణంగా.. ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. డయాబెటిక్ పేషంట్స్ కి ఎక్కువగా చర్మం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి.
ఇలాంటి సమస్యలు తరచుగా కనిపిస్తూ ఉంటే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

బరువు తగ్గడం
ఒబేసిటీ డయాబెటిస్ కారణమవుతూనే.. ఎలాంటి ప్రయత్నం లేకుండా బరువు తగ్గినా.. డయాబెటిస్ రిస్క్ పొంచి ఉందని గుర్తించాలి. ఎక్కువ దాహం, ఎక్కువగా యూరిన్ కి వెళ్లడం కారణంగా.. బరువు ఈజీగా తగ్గిపోతారు. దీనివల్ల క్యాలరీలు శరీరానికి అందవు.

అలసట
అలసట డయాబెటిక్ కి ప్రాధమిక లక్షణం. హైబ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కారణంగా శరీరం ఇన్సులిన్ పొందడానికి సరిగ్గా రెస్పాండ్ అవదు. దీని కారణంగా అలసట, వీక్ నెస్ వంటివి వేధిస్తాయి. అలాగే నిద్రలేమి సమస్య కూడా కనిపిస్తుంది.

జలదరించడం, తిమ్మిరి
చేతులు, వేళ్లు, కాళ్లు, పాదం ఎక్కువగా జలదరించడం, తిమ్మిరి పడుతూ ఉంటే.. డయాబెటిస్ కి వార్నింగ్ సిగ్నల్ అని గుర్తించండి. ఎక్కువగా పాదాలు, చేతులు, కాళ్లు నొప్పులుగా ఉంటే.. అలర్ట్ అవడం మంచిది.

చర్మం పొడిబారడం
డయాబెటిస్ కారణంగా బ్లడ్ సర్కులేషన్ తగ్గుతుంది. స్వెట్ గ్లాండ్స్ ఫంక్షన్స్ నిలిచిపోతాయి. దీని కారణంగా చర్మం పొడిబారి దురద పెడుతూ ఉంటుంది. ఎక్కువగా కాళ్ల కింది భాగంలో ఈ సమస్య ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకండి.

చూపు
ఆకస్మాత్తుగా మీ చూపులో తేడా కనిపించిందంటే జాగ్రత్త వహించాలి. బ్లర్ గా కనిపిస్తున్నా.. దేన్నీ ఫోకస్ చేయలేకపోతున్నా.. శరీరంలో హైబ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కారణమని గుర్తించాలి. దీనికారణంగా శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోయి.. కంటిచూపు మందగిస్తుంది.
చూశారుగా ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్ అవడం మంచిది. డయాబెటిస్ చెక్ చేసుకుని.. సరైన నియమాలు పాటించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడచ్చు.



Click it and Unblock the Notifications
