Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
బెల్లీ ఫ్యాట్ ను టార్గెట్ చేసి, ఫాస్ట్ గా ఫ్యాట్ బర్న్ చేసే హోం రెమెడీస్ ..
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచలో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువే..బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట ఉదరంలో కొవ్వు చేరి, పొట్ట చుట్టూ ఉబ్బుగా కనిపిస్తుంది. ఒకరకంగా దీన్ని చిరుబొజ్జ అని పిలుస్తారు. మరీ పెద్దగా ఉంటే బాన పొట్ట అని కూడా పిలవచ్చు. బొజ్జ ఉన్నప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకున్నా చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది. వాస్తవానికి , బెల్లీ ఫ్యాట్ ను కరిగించికోవడం కొద్దిగా కష్టంమైన పనే. బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి చాలా మంది చాలా తక్కువ బోజనం చేస్తూ, వారికి వారు పనిష్మెంట్ ఇచ్చుకుంటారు. ఇలా చేయడం శరీర ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా మరికొన్ని ప్రమాధకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతుంది. బెల్లీ ఫ్యాట్ ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గించుకోవడానికి నేచురల్ హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.
బెల్లీ ఫ్యాట్ కు వివిధ కారణాలున్నాయి: జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దక సమస్యలు. రాత్రుల్లో నిద్రించడానికి ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడం, జెనెటిక్స్, వ్యాయామాలు చేయకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి.
బెల్లీ ఫ్యాట్ ను కరిగించే హోం రెమెడీస్: పొట్ట ఉదరంలో బెల్లీ కరిగించుకోవడానికి చాలా మంది తప్పడు పద్దతులను అనుసరిస్తుంటారు. అలా కాకుండా తెలివిగా కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం వల్ల డిఫరెన్స్ ను మీరు ఫీలవుతారు. హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల పూర్తిగా ప్రయోజనాలను పొందుతారు. అలాంటి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా..

తేనె:
హాట్ వాటర్ లో కొద్దిగా తేనె, నిమ్మరసం మిక్స్ చేసి నిద్రలేచిన వెంటనే తాగాలి. ఈ రెమెడీని రెగ్యులర్ గా ఫాలోఅయితే ఖచ్చితంగా మీరు మార్పు గమనిస్తారు.

హాట్ వాటర్:
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక లీటర్ హాట్ వాటర్ ను తాగడం వల్ల శరీరం మొత్తం శుభ్రపడుతుంది. శరీరంలో టాక్సిన్స్ అనేటి ఉండవు. కొవ్వు ఏమాత్రం పెరగదు.

టమోటోలు:
టమోటోలను పచ్చివి అలాగే తినడం వల్ల వీటిలో ఉండే లికోపిన్, అసిడిక్ నేచురల్ వల్ల కొవ్వు కరుగుతుంది, దాంతో పొట్టలో కొవ్వు చేరదు.

అల్లం:
అల్లంను వేడినీటిలో వేసి మరిగించి, దీనికి తేనె, పెప్పర్ మిక్స్ చేసి, మరో 5నిముషాలు మరిగించి తాగడం వల్ల పొట్టబాగంలో కొవ్వు ఎఫెక్టివ్ గా కరుగుతుంది,. అల్లం మరియు మిరియాలు జోడించడం వల్ల మెటబాలిక్ రేట్ పెరుగుతుంది.

పుదీనా:
ఒక కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు పెప్పర్, తేనె మిక్స్ చేయాలి. 5 నిముషాలు ఉడికించి, తర్వాత వడగట్టి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే టమ్మీ కరిగిపోతుంది,. పుదీనా పొట్ట ఉదరంను స్మూత్ చేస్తుంది.తేనె మరియు పెప్పర్ ఫ్యాట్ ను కరిగిస్తుంది మరియు మెటబాలిజం రేటును పెంచుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ రెగ్యులర్ డైట్ లో ఒక బాగం చేసుకోవాలి. ఇది పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. దాంతో ఆకలి తగ్గుతుంది. టమ్మీ కరుతుంది, బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

కరివేపాకు:
కరివేపాకు శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. దాంతో ఆటోమాటిక్ గా టమ్మీ వద్ద ఉండే కొవ్వు కరగడం ప్రారంభమౌతుంది.

యాలకలు:
యాలకు గ్రేట్ మెటబాలిజం బూస్టర్ గా పనిచేస్తుంది. ఇది అమేజింగ్ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ . బరువు తగ్గించడంలో యాలకలు గ్రేట్ గా సహాయపడుతాయి.

దాల్చిన చెక్క:
ఫ్యాట్ బర్నర్ గా దాల్చిన చెక్క గ్రేట్ గా సహాయపడుతుంది,. అరటీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ను నీటిలోమిక్స్ చేసి 5 నిముషాలు మరిగించి తర్వాత వడగట్టి, బ్రేక్ ఫాస్ట్ కు ముందే గోరువెచ్చగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బెడ్ టైమ్ లో కూడా తాగవచ్చు.

నిమ్మరసం:
నిమ్మరసంను రెగ్యులర్ గా తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. కొద్దిగా నిమ్మరసంను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి , కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి:
ప్రతి రోజూ ఉదయం పరగడపున రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తిని, లెమన్ వాటర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది.

బాదం:
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. బాదం రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రోజంతా పొట్ట ఫుల్ గా ఉన్న భావన కలిగిస్తుంది, దాంతో ఎక్కువ ఆకలి కాదు. జంక్ ఫుడ్స్ తీసుకోకుండా ఉంటారు. దాంతో అదనపు కొవ్వు చేరకుండా, బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది.

కీరదోసకాయ:
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ 96శాతం ఉంటుంది. క్యాలరీలు తక్కువ . అందుచేత రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఫ్లాట్ టమ్మీని ఫాస్ట్ గా పొందవచ్చు.

బీన్స్ :
బీన్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బెల్లీఫ్యాట్ కరిగిపోతుంది. బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ పొట్టను ఫుల్ గా ఉంచుతుంది . శరీరానికి చాలా తక్కువ క్యాలరీ అందుతాయి. దాంతో ఫ్యాట్ చేరకుండా ఉంటుంది.

వాటర్ మెలోన్:
వాటర్ మెలోన్ లో 82శాతం వాంటర్ కంటెంట్ ఉంటుంది. వాటర్ మెలోన్ లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం.

ఓట్స్ :
ఓట్స్ ను రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రోజంతా ఆకలి కాకుండా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువగా అందుతాయి.

ఆపిల్స్ :
రెగ్యులర్ డైట్ లో ఆపిల్ చేర్చుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులను నివారించడం మాత్రమే కాదు, ఇది బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది

ఫిష్ ఆయిల్:
టమ్మీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఫిష్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఫిష్ ఆయిల్ టమ్మీ ఫ్యాట్ ను టార్గెట్ చేస్తుంది ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

పీనట్ బట్టర్:
పీనట్ బట్టర్ ఆకలి తగ్గిస్తుంది, మెటబాలిజం రేటు పెంచుతుంది. ఇందులోఉండే నియాసిన్ టమ్మీ బ్లోటింగ్ ను నివారిస్తుంది.

. గ్రీన్ టీ:
గ్రీన్ టీ డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ కరిగిస్తుంది. రెగ్యులర్ గా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది. టమ్మీ ఫ్లాట్ గా మారుతుంది.

పెరుగు:
అధిక బరువు ఉండే వారు రెగ్యులర్ డైట్ లో పెరుగు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ప్లెయిన్ గా ఉండే పెరుగు తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.

బాటిల్ గార్డ్ జ్యూస్ :
సొరకాయ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడం తో పాటు , టమ్మీ ఫ్యాట్ ను ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది.

పార్ల్సే జ్యూస్ :
పార్ల్సే జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల బాడీ డిటాక్సిఫై అవుతుంది, క్యాలరీస్ బర్న్ చేస్తుంది. కిడ్నీఆరోగ్యానికి ఎక్సలెంట్ హెర్బ్.

అరటి పండ్లు:
అరటి పండ్లలో పొటాసియం అధికంగా ఉంటుంది, మల్టీ విటమిన్ కలది. ఇది త్వరగా పొట్ట ఫిల్ చేస్తుంది. ఇతర ఆహారాల మీద కోరిక తగ్గిస్తుంది. టమ్మీ ఫ్యాట్ మెల్ట్ చేస్తుంది.

వాటర్:
రోజుకు సరిపడా నీరు తాగాలి. బరువు తగ్గడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక రోజుకు కనీసం 8 గ్లాసుల నీరైనా తాగాల్సిందే . ఇది ఫ్యాట్ ను ఫ్లష్ చేయడం మాత్రమే కాదు చర్మానికి మంచి షైనింగ్ గ్లో అందిస్తుంది. హెయిర్ హెల్తీగా పెరుగుతుంది. మొత్తం బాడీ రేడియంట్ గా మెరిసిపోతుంది.



Click it and Unblock the Notifications











