Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
బరువు తగ్గడానికి మద్యహ్నాంలోపు చేయాల్సిన 7 క్రేజీ పనులు..
మన శరీరం బరువు తగ్గడానికి రోజులో ఒక్కో సమయంలో ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. సాయంత్రం కంటే ఉదయం చేసే వర్కౌట్స్ వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. అదే విధంగా మద్యహ్నాం కంటే, భోజనానికి ముందు చేసే బరువు తగ్గించే చిట్కాలు, వర్కౌట్స్ వల్ల ఎక్కువ ప్రయోజనకరం.
అందుకు కారణం, ఆ సమయంలో బాడీలో మెటబాలిజం రేటు ఎక్కువగా ఉంటుంది . ఇంకా హార్మోనుల ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి . ఉదయం, సాయంత్రం కంటే రోజులో ఒక్కో సమయంలో క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి.
మద్యహ్నానంలో చాలా లేజీగా ఫీలవుతూ, అనారోగ్యకరమైన ఆహారాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతుంటాము. ఉదయం మరియు మద్యహ్నానికి ముందు మన శరీరం చాలా యాక్టివ్ గా ఉంటుంది మరియు మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉంటుంది . ఇది బరువు తగ్గించుకోవడానికి మంచి సమయం.
మద్యహ్నానానికి ముందు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. సింపుల్ టిప్స్ అయినా, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . మద్యహ్నాం పైన మరియు సాయంత్ర సమయంలో ఎక్కువగా అసలట చెందడం వల్ల క్యాలరీలను కరిగించుకోవడం కష్టమవుతుంది.
బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు, బ్రేక్ ఫాస్ట్ తర్వాత భోజనానికి ( మద్యహ్నానానికి) ముందు ఏం చేయాలో తెలుసుకుందాం..

చిన్న కునుకు తియ్యాలి:
డే టైమ్ లో చిన్న కునుకు తియ్యడం వల్ల, ఒత్తిడి తగ్గుతుంది, దాంతో తక్కువగా తింటారు. బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ పెరగకుండా కంట్రోల్ చేయడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

ఎండలోకి వెళ్లాలి:
ఎండ నుండి వెలువడే యూవీ కిరణాలు మన మనస్సు మీద ప్రభావం చూపుతుందన్న విషయం మీకు తెలుసా?ఇంట్లో నుండి బయట వచ్చినప్పుడు శరీరానికి కొద్దిగా ఎండ తగిలితే చాలు సంతోషంగా ఫీలవుతారు . పగలు శరీరం మీద పడే ఎండ వల్ల మెటబాలిజం రేటు పెరుగతుంది . దాంతో క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి:
ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. మజిల్ మాస్ ఏర్పడుతుంది. ఇది ఎక్కువ క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది . బరువు తగ్గడానికి హెల్ఫ్ అవుతుంది. గుడ్డు, పెరుగు, పల్స్ వంటివి తీసుకోవాలి.

నీళ్ళు తాగాలి:
బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఒక గ్లాసు నీళ్ళు లేదా నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది పొట్టఉబ్బరం తగ్గిస్తుంది . మెటబాలిజంను పెంచుతుంది.

10 నిముషాలు ఫిజికల్ యాక్టివిటి:
భోజనానికి 10 నిముషాల ముందు నడక, జాగింగ్, లేదా సింపుల్ గా స్ట్రెచెస్ చేయడం వల్ల మీరు సాయంత్రంలో చేసే వ్యాయామానికి సమానం. మార్నింగ్ వర్కౌట్స్ మెటబాలిజిం రేటు పెంచుతుంది, అనారోగ్యకరమైన ఆహారాల జోలికి పోకుండా చేస్తుంది. వేగంగా బరువు తగ్గిస్తుంది.

హెల్తీ స్నాక్స్:
స్నాక్స్ తినాలనుకున్నప్పుడు, డ్రైడ్ ఫిగ్స్, ఆప్రికాట్, డేట్స్ మరియు బాదం, వాల్ నట్స్ వంటివి తినాలి. భోజనానికి ముందు వీటిని తినడం వల్ల భోజనం తర్వాత డిజర్ట్ తినాలనే ఆలోచన మీకుకుండదు. డ్రైడ్ ఫ్రూట్స్ అనారోగ్యకరమైన స్వీట్స్ తినకుండా చేస్తుంది.

చిన్న చిన్న పనులు చేయాలి:
బరువు తగ్గించుకొనే క్రమంలో , ఎక్సలేటర్స్ ఉపయోగించకుండా స్టెప్స్ ఎక్కడం, కాఫీకి షుగర్ వేసుకోకుండా తాగడం, ఇంటిపనులు స్వయంగా చక్కబెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మద్యహ్నానంలో ఒకే చోట కూర్చోకుండా మద్యమద్యలో లేచి తిరగడం వంటివి చేయాలి.



Click it and Unblock the Notifications