Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
48 గంటల్లో బెల్లీ ఫ్యాట్ దూరం చేసే సూపర్ పవర్ ఫుడ్స్
వెయిట్ లాస్ విషయానికి వస్తే.. ప్రొటీన్ అనేది చాలా ముఖ్యమైన మైక్రోనూట్రియంట్. ఎందుకంటే.. మీ డైట్ లో ఎక్కువ ప్రొటీన్ ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల 48 గంటల్లో బరువు తగ్గడానికి ఎక్కువ అవకాశాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
తృణధాన్యాలు, వీట్, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ప్రొటీన్స్ కలిగిన ఆహారాలను డైలీ మీల్ లో చేర్చుకోవడం కంపల్సరీ. వీటిలో కేవలం ప్రొటీన్ మాత్రమ కాదు.. ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి చాలా అవసరమైనది.
ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల బెల్లీ చుట్టూ ఉండే ఫ్యాట్ కరిగిపోతుంది. 2 రోజులపాటు ఈ ఆహారాలను తీసుకునే మోతాదు పెంచడం వల్ల.. మీరు బరువు తగ్గడంలో తేడా గమనించవచ్చు.
ఈ ఆహారాలు డైట్ లో చేర్చుకుంటూనే.. ఎక్కువ లీటర్ల ఫ్లూయిడ్స్ ని కూడా మీ డైట్ లో చేర్చుకుంటే.. మంచిది. ఎందుకంటే.. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం, డైజెషన్ కి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి.. ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి.
అలాగే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్టనిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంటే.. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలు, బరువు పెరగడానికి కారణమయ్యే ఆహారాలు తీసుకోకుండా.. ఈ ఆహారాలు అరికడతాయి.
కాబట్టి 48 గంటల్లో బరువు తగ్గాలని మీరు టార్గెట్ పెట్టుకుంటే.. వెంటనే ఈ 8 ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి. ఆ ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..

తృణధాన్యాలు
తృణధాన్యాలు శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి. ఎప్పుడైతే.. తృణధాన్యాలను డైట్ లో చేర్చుకుంటారో అప్పుడు మెటబాలిజం పెరుగుతుంది. అలాగే.. చాలా శక్తిని పొందగలుగుతారు.

సౌర్కాట్
బ్యాక్టీరియా మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ డైట్ లో ఈ హెల్తీ ఫుడ్ చేర్చుకోవడం వల్ల.. ఆటోమెటిగా మీ పొట్టలో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.

బ్రౌన్ రైస్
వైట్ కంటే బ్రౌన్ రైస్ లో విటమిన్ ఈ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి చాలా పర్ఫెక్ట్ ఫుడ్. మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటే.. వైట్ రైస్ కి బదులు, బ్రౌన్ రైస్ తీసుకోవడం మొదలుపెట్టండి.

ఓట్స్
ఓట్స్ కూడా బరువును చాలా వేగంగా తగ్గిస్తాయి. ఒక బౌల్ ఓట్స్ ని బ్రేక్ ఫాస్ట్ కి తీసుకుని, ఒక ఫ్రూట్ కూడా తీసుకోవడం వల్ల.. బరువు తగ్గడంలో వండర్స్ జరుగుతాయి.

బార్లీ
బార్లీలో 96 క్యాలరీలు, 22 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా హెల్తీ ఫుడ్. కాబట్టి దీని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే.. 48 గంటల్లో బెల్లీ ఫ్యాట్ కరగడం సులభమే కదా.

ఆల్మండ్స్
గుప్పెడు నానబెట్టిన బాదాం, స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా తేలికైన పని. ఈ డైట్ ని ఉదయాన్నే పరగడపున తీసుకోవడం వల్ల పోషకాలు మెండుగా అందుతాయి. ఆరోగ్యానికి మంచిది.

క్వినోయి
క్వినోయిలో ఎక్కువ ప్రొటీన్స్, ఐరన్, మెగ్నీషియం, బి విటమిన్స్, ఫైబర్ ఉంటాయి. ఈ ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం చాలా తేలికవుతుంది.

చికెన్
చికెన్, ఫిష్, లీన్ మీట్స్ హెల్తీనే కాదు బరువు తగ్గడానికి ఎక్సలెంట్ సోర్స్. ఉడకబెట్టిన చికెన్, ఫిష్ ని త్రీ మీల్స్ లో రెండురోజులపాటు చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎనర్జీతోపాటు, బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
