Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
ఒకే ఒక్క డ్రింక్ తో ఎఫెక్టివ్ గా బాడీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు...
అధిక బరువుతో బాధపడుతున్నారా..?వెంటనే శరీర బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా?కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గడం లేదు అని బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. బరువు తగ్గించే నేచురల్ ఔషదాలు ఎన్నో మన ఇంట్లోనే ఉన్నాయి. వాటిలో శరీర బరువును అవును బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ 'B', 'C', 'E' మరియు 'పప్పైన్' అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్ జీర్ణ వ్యవస్థలో ఉండే ఆహార పదార్థాలను విచ్చిన్నం చేసి, అధిక క్యాలోరీల రూపంలో మరియు కార్బోహైడ్రేట్ల రూపంలోకి మార్చుటకు సహాయపడుతుంది. అంతేకాకుండా బొప్పాయి పండు, జీర్ణక్రియలలో సహాయపడి, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
బొప్పాయిపండు మరియు మిరియాల కలయిక జీవక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా, పేగు లోపలి గోడల పనితీరును అధికం చేసి శరీర బరువును తగ్గిస్తుంది. బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది, దాంతో ఫ్యాట్ పార్టికల్స్ కరగడానికి సులభమౌతుంది, జీవక్రియను అభివృద్ధి చేసి మరియు జీర్ణాశయ సమస్యలను దూరం చేస్తుంది.

బరువు తగ్గించుకోవడానికి బొప్పాయి పండును ఏవిధంగా తగ్గించుకోవాలి?
బొప్పాయి పండు శరీర బరువును తగ్గించటమేకాక, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు రక్తంలోని టాక్సిన్స్ ను తొలగించి, పేగు కదలికలను సాధారణ స్థాయికి తీసుకువస్తాయి. బొప్పాయి పండుకు ఒక చిటికెడు మిరియాలను పొడిని కలపటం వలన బొప్పాయి పండు రుచి పెరగటమేకాకుండా, శరీర బరువు కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

బొప్పాయిపండును ఒక స్లైస్ తీసుకొని, పైన పొరను తొలగించి ముక్కలుగా కట్ చేసుకొని, ఇపుడు రుచికోసం దీనికి కొద్దిగా నీటిని, ఉప్పు , పెప్పర్ పొడిని కలపాలి.దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు లేదా నేరుగా , బొప్పాయి ముక్కల మీద మిరియాల పొడి, ఉప్పు చిలకరించి తినవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న బొప్పాయిపండును లేదా జ్యూస్ ను వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల అనూహ్యమైన ఫలితాలను మీరే గమనిస్తారు.

త్వరగా బరువు తగ్గించుకోటానికి బొప్పాయిని తినండి
మీకు బొప్పాయి పండు తినటం ఇష్టమా? అయితే ఒక బొప్పాయి పండును ఒకటి రెండు స్లైస్ లను చిన్న ముక్కలుటా కట్ చేసుకుని నేరుగా తినడం వల్ల మంచి ఫలిత ఉంటుంది. అంతేకాకుండా, ఫాట్ ను కలిగి ఉండే ఇతర ఆహార పదార్థాల ద్వారా తీసుకోవటం వలన బొప్పాయి పండు సరైన ఫలితాలను ఇస్తుందని అధ్యయనాలలో పేర్కొనబడింది.

బొప్పాయి పండుతో తయారు చేసిన స్మూతీస్ మంచి రుచిగా ఉండటంతో పాటు, వివిధ రకాల పోషక విలువలు కలిగి ఉంటుంది. బొప్పాయి స్మూతీస్ తయారు చేయటం సులభమే. బాగా పండిన బొప్పాయి పండును ముక్కలుగా కట్ చేసి, మిక్సీ జార్ లో వేసి, సరిపడా పాలు, కొద్దిగా తేనె వేసి గ్రైట్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాసులోకి తీసుకొని, మరికొందిగా పాలు మిక్స్ చేసి తీసుకోవాలి. బొప్పాయి స్మూతీ చిక్కగా మరియు టేస్టీగా ఉంటుంది. కేవలం బొప్పాయి మాత్రమే ఇష్టపడని వారు అందులో అరటి, సపోటా వంటివి మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ పోషకాలను పొందవచ్చు. టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.

మీరు తినే ఫ్రూట్ సలాడ్ లలో కూడా బొప్పాయి పండును కలుపుకోండి. ఇతర పండ్లతో పాటుగా మిరియాల పొడిని కలపటం వలన సలాడ్ రుచితో పాటూ, పోషక విలువలు కూడా పెరుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications