Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
శరీరంలో కొవ్వుకి కారణమయ్యే ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే..!
నడుము, తొడలు, పిరుదుల చుట్టూ.. ఫ్యాట్ పేరుకున్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. లావుగా మారిన విషయం ఈ భాగాల్లో పేరుకున్న ఫ్యాట్ ని చూస్తేనే అర్థమవుతుంది. ప్యాంట్స్ పట్టనప్పుడు మీ నడుము, తొడలు లావయ్యాయన్న విషయం అర్థం అవుతుంది.
ఒకవేళ మీ శరీరంలో ఫ్యాట్ పేరుకోకూడదని అని మీరు భావిస్తే.. ఇప్పటి నుంచే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫుడ్ లో మార్పులు అంటే.. తినాల్సిన డైట్ కాదు.. డైట్ లో ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకోడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటికి దూరంగా ఉంటే.. శరీరంలో ఫ్యాట్ పేరుకోకుండా.. జాగ్రత్త పడవచ్చు. అయితే ఈ ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
ఈ ఆహారాలకు దూరంగా ఉంటూనే.. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల.. మీ శరీరంలోకి ఫ్యాట్ వచ్చే అవకాశాలే ఉండవు. మరి మీరు నో చెప్పాల్సిన ఆహారాలేంటో చూద్దామా..

డీప్ ఫ్రై
డీప్ ఫ్రై ఫుడ్స్ లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. శ్యాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా పేరుకోవడానికే కాకుండా.. శరీరానికి చాలా చెడు చేస్తాయి. కాబట్టి వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

ఫ్రోజెన్ ఫుడ్స్
ఫ్రోజెన్ ఫుడ్స్ లో ప్రిజర్వేటివ్స్, శ్యాచురేటెడ్ ఫ్యాట్, ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి.. శరీరంలో ఫ్యాట్ ఏర్పడానికి కారణమవుతాయి.

మైక్రోవేవ్ పాప్ కార్న్
మైక్రోవేవ్ పాప్ కార్న్ లో శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్యాట్ డెవలప్ అవడానికి కారణమవుతుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్
ప్రాసెస్డ్ ఫుడ్స్ లో తక్కువ పోషకాలుంటాయి. వీటిల్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది.. శరీరంలో ఫ్యాట్ ఏర్పడటానికి కారణమవుతుంది.

చిప్స్
చిప్స్ అంటే.. ఇష్టపడని వాళ్లు ఉండరు. కానీ.. వీటిల్లో సోడియం, ఆయిల్, శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇవన్నీ.. శరీరంలో ఫ్యాట్ ఏర్పడటానికి కారణమవుతాయి.

వెన్న
బట్టర్ లో ఎక్కువ మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్యాట్ పేరుకోవడానికి కారణమవుతుంది.

చీజ్
చీజ్ లో.. ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. అలాగే.. హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఉంటుంది.

క్రీమ్
విప్ప్డ్ క్రీమ్.. ఇది.. కాఫీ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో షుగర్, ఫ్యాట్ రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. శరీరానికి హాని చేస్తాయి.

షుగర్
షుగర్ ఎక్కువగా ఉండే.. పేస్ట్రీలు, క్యాండీస్ ని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. వీటిల్లో షుగర్ తో పాటు, ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్యాట్ పేరుకోవడానికి కారణమవుతాయి.

సోడా
సోడా ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ఇవన్నీ కొలెస్ట్రాల్, శరీరంలో ఫ్యాట్ పేరుకోవడానికి కారణమవుతాయి.



Click it and Unblock the Notifications
