Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
వెయిట్ తగ్గడానికి సహాయపడే హెల్తీ ఫ్రూట్స్ ...
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు వారి ఆరోగ్యం గురించి చాలా ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు విషయంలో. బరువు తగ్గడం అనేది దినచర్యలో ఒక భాగం అయిపోయింది. అయితే బరువు తగ్గాలనే భావన మనస్సులో ఉండటంతో ప్రతి రోజూ క్రాస్ డైటింగ్, వ్యాయామాలు చేయకపోవడం వంటివి మరిన్ని అదనపు కిలోల బరువును పెంచుకుంటారు. కానీ బరువు తగ్గాలనే పట్టుదల మీలో ఉన్నట్లైతే అందుకు చాలా కఠినమైన డైట్ మరియు హెల్తీ డైట్ ను ఫాలో చేయడం వల్ల హెల్తీగా బరువు తగ్గవచ్చు . బరువు తగ్గించడం ఫ్రూట్ డైట్ కంటే మరొకటి పనిచేయదంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.
మన రోజూ అవసరమైన పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరగడంతో పాటు, బరువు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ కు బదులు వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అన్ని పండ్లలోనూ విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, జబ్బుల బారీన పడకుండా మనల్ని కాపాడటానికి ప్రధాన పాత్రపోషిస్తాయి.

బరువు తగ్గడం కోసం మనం తీసుకొనే ఆహారం సరైన క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో లోక్యాలరీ ఫుడ్ తీసుకోవడం ముఖ్యం. కాబట్టి, ఈ విషయంలో(లోక్యాలరీ విషయంలో)పండ్లు చాలా ముఖ్యమైన, ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది. చాలా వరకూ పండ్లు అన్ని లోక్యాలరీలను కలిగి ఉండి, బరువును పెరగనియ్యకుండా సహాయపడుతాయి. మరి బరువు తగ్గించేందుకు ప్రభావంతంగా పనిచేసే పండ్లు 10 రకాలు మీకోసం...

యాపిల్స్: పిల్స్ లో కేలరీలు తక్కువ. పీచు అధికం. తిన్నది బాగా జీర్ణం చేస్తుంది. దీనిలోని పెక్టిన్ మీకు కడుపు నిండినట్లు భావించేలా చేస్తుంది. ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్ ప్రభావంతో సమానం. యాపిల్స్ లో లోఫాట్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల శరీరాన్ని నాజూగ్గా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

పుచ్చకాయ: వాటర్ మెలోన్, ఇది పూర్తిగా ఫ్యాట్ ఫ్రీ ఫ్రూట్. వాటర్ మెలోన్ లో విటిమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటుంది . ఇది బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి మరియు శరీరానికి తగినంత శక్తిని అంధించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో అధిక శాతంలో నీరు ఉండటం వల్ల ఆహారాన్ని తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది.

బెరీ పండ్లు సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి సులభంగా తగ్గించుకోవచ్చు. జీర్ణశక్తిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఫ్యాట్ కరిగిస్తుంది, బరువు తగ్గేలా చేస్తుంది.

జామ: జామకాయలో అద్భుతమైన ఆరోగ్య గుణాలున్నాయి. ఇది మెటబాలిజం రేటును పెంచుతంది. వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గించడానికి ప్రోత్సహిస్తుంది. . ముఖ్యంగా జామకాయలో ఉండే ప్రోటీన్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉండే ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అదనపు బరువును తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
