Latest Updates
-
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే
పొట్టలోని కొవ్వును కరిగించే అరటిపండు!
రెండు నెలల్లో ఉన్న మీ స్నేహితురాలి పెళ్ళికి మీ అందమైన నాభి కన్పించేలా లెహెంగా వేసుకోవాలనుకుంటున్నారా? కానీ షాపింగ్ కి వెళ్ళి కొత్త బట్టలు ప్రయత్నించినప్పుడు కానీ తెలీదు, మీ పొట్ట కొంచెం ముందుకు పొడుచుకు వచ్చిందని!
మనలో చాలామందికి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఉంటాయి, కదూ? పొట్టలో కొవ్వు చేరటం చాలా సాధారణం. దాన్ని వదిలించుకోవడం కూడా అంతే కష్టం!
ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పొట్ట రావడం పురుషుల కన్నా స్త్రీలలో అధికం. ఎందుకంటే, హార్మోనల్ సమస్య వల్ల. ఇందాక అనుకున్నట్టు, అధికపొట్ట వలన ఆ వ్యక్తి అందవికారంగా కన్పిస్తాడు. అంతేకాక అనారోగ్యానికి కారణం కూడా.

బొడ్డు చుట్టూ అధికకొవ్వు పేరుకుంటే, దాని వల్ల స్థూలకాయం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, నడుంనొప్పి, మోకాలి నెప్పి, హృద్రోగాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఆరోగ్యమైన కొవ్వు కొంతవరకు మంచిదే కానీ, ఎక్కువైతేనే బానపొట్టలా కన్పించి, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.
కొవ్వును కరిగించుకోవాల్సిన ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోడానికి ఇక్కడ చదవండి.

చెడ్డ ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత, గర్భం, ప్రసవం, అధికంగా తాగటం వంటి కారణాల వలన పొట్టలో కొవ్వు పెరుగుతుంది.
చాలామంది లిపోసక్షన్ మరియు ఇతర కాస్మెటిక్ సర్జరీలను ఆశ్రయిస్తారు కానీ అవి అధిక ఖర్చు, దుష్ప్రభావాలతో కూడి ఉంటాయి.
అధికపొట్టను సహజంగా తగ్గించే అరటిపండు పానీయం ఇదిగో.

కావాల్సిన వస్తువులు:
మధ్యతరహా అరటిపండు -1
అవిసె గింజలు- ఒక చెంచాడు
అల్లం పౌడర్- 2 చెంచాలు
పెరుగు- సగం కప్పు
ఈ పానీయం అధికపొట్టను కరిగించి చాలామందికి అద్భుతంలా పనిచేసింది. క్రమం తప్పకుండా, సరిగ్గా వాడితే ఫలితం ఉంటుంది.

ఈ చిట్కాను పాటిస్తూ, సరియైన ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ, 45 నిమిషాలు ప్రతిరోజూ వ్యాయామాలు కూడా చేయాలి.
పొట్టకి సంబంధించిన వ్యాయామాలు చేయటం మంచిది.
అరటిపండు, అవిసెగింజలు, అల్లంల మిశ్రమం అనేక పోషకాలను ఒకేసారి అందించి లోపలినుంచే అధిక కొవ్వుతో పోరాడే శక్తినిస్తుంది.
పెరుగులోని ప్రొటీన్, అవిసె గింజలు మీ పొట్టలోపల పేరుకున్న కొవ్వు కణాలను కరిగిస్తుంది.

అరటిపండులోని పొటాషియం మీ కణశ్వాసక్రియను పెంచి, కడుపులో కొవ్వును కరిగించేందుకు సాయపడుతుంది. అల్లం కూడా మీ శ్వాసక్రియ రేటును పెంచుతుంది.
తయారీ విధానం:
- అన్ని దినుసులను సూచించిన విధంగా మిక్సర్ లో వేయండి.
- రసం వచ్చేవరకు తిప్పండి.
- ఈ పానీయాన్ని ప్రతిరోజూ పొద్దున్నే ఉపాహారం ముందుగా, వ్యాయమం అయిన వెంటనే తీసుకోండి.
- కావాలంటే వైద్యునితో సంప్రదించి బ్రేక్ ఫాస్ట్ బదులు ఇదే తాగండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
