Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
చెరకు రసం బరువు కోల్పోడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
చెరకు రసం బరువు కోల్పోడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
మండే వేసవి వచ్చిందంటే చెరకు రసంతో సేదతీరాలని కోరుకాని వారెవరు ఉంటారు? కానీ మీకు తెలుసా, చెరకు రసం బరువు కోల్పోడానికి కూడా సహాయపడుతుందని? అవును, మీరు చదివింది నిజమే!
చెరకు రసంలో తక్కువ కెలోరీలు ఉంటాయి పైగా కొలెస్ట్రాల్ ఉండదు. చెరకు రసం తక్షణ శక్తిని అందించడమే కాక జీవక్రియ మరియు జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. ఈ వ్యాసం ద్వారా చెరకు రసం మీరు బరువు తగ్గించుకోవడానికి ఏ విధంగా సహకరిస్తుందో తెలియజేస్తుంది.

ప్రసిద్ధమైన ఈ వేసవి పానీయాన్ని పిన్నలు మరియు పెద్దలు కూడా ఇష్టపడతారు. దీనిలో రుచితో పాటుగా పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. చెరకు రసం మీ దాహార్తిని తీర్చి, తక్షణ శక్తిని అందించి, వేసవి వేడి వలన ఉత్పన్నమయ్యే
నీరసాన్ని, బద్దకాన్ని వదిలిస్తుంది.
వేసవిలో వేడి మూలంగా మన శరీరం స్వేదం చిందిస్తుంది. స్వేదంతో పాటు నీటిని మరియు ఎలెక్ట్రోలైట్లను కూడా శరీరం కోల్పోతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. చెరకు రసం తాగటం మూలన శరీరంలో నీటి స్థాయి పెరగటమే కాక వేసవి నెలల్లో మధ్యాహ్నం పూట వేడి వలన కలిగే చికాకు, చీదర కూడా తగ్గుతుంది.
చెరకు రసంను సరైన సమయంలో, సరైన పరిమాణంలో తీసుకుంటే మీ బరువు కోల్పోవడానికి ఉపయోగపడుగుంది. 100 గ్రాముల చెరకు రసంలో 270 కెలోరీలు ఉంటాయి.
చెరకు రసం తాగడం, బరువు కోల్పోవడానికి ఏ విధంగా ప్రయోజనకరమో తెలుసుకుందాం!

1. చెరకు రసంలో కొవ్వులుండవు:
చెరకు రసంలో సహజ చెక్కెరలు ఉంటాయి కానీ కొవ్వులుండవని మీకు తెలుసా? కనుక చెరకు రసం తాగితే అధిక కెలోరీలు మన శరీరంలోకి చేరుతాయని భయపడనవసరం లేదు. చెరకు రసంలో బయట నుండి చక్కెర కలపాల్సిన అవసరం లేదు. బరువు తగ్గాలనుకునేవారు చెరకు రసం తాగాలి. చెరకు రసం వలన ఒనగూడే ప్రయోజనాలలో అది ఒకటి.

2. పీచు పదార్థాలు కలిగి ఉంటుంది:
చెరకు రసంలో పీచు పదార్థాలు మెండుగా ఉంటాయి. ఒక సెర్వింగ్ లో పదమూడు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. కనుక మీరు చెరకు రసం తాగితే దైనందిన పీచుపదార్థాల అవసరాల్లో 52% దొరికినట్టే! పీచు పదార్థాలు బరువు తగ్గడానికి సహకరించడమే కాక, మీ పొట్ట నిండిన భావన కలుగజేస్తాయి.పదేపదే మీకు ఏమైనా తినాలనే కోరిక కలగదు.

3. చెడు కొలెస్ట్రాల్ తగుస్తుంది:
సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ కలిగిన ఆహారపదార్ధాలు మీ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అధిక మొత్తంలో చెడు కొలెస్ట్రాల్ మీ శరీరంలో ఉన్నప్పుడు ఊబకాయం మరియు అధిక బరువు సమస్యలు ఎదురవుతాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయి కూడా పడిపోతుంది. చెరకు రసంలో కొలెస్ట్రాల్ ఉండదు పైగా ఇది చెడు కొలెస్ట్రాల్ తోనూ పోరాడుతుంది. దీని వలన మీ శరీరం బరువును కోల్పోతుంది.

4. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
చెరకు రసం కలిగించే మరొక ప్రయోజనం, జీర్ణవ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఆరోగ్యవంతమైన జీర్ణవ్యవస్థ బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. చెరకు రసం ప్రేగులలో ఆహారం కదలికలను పెంచి, మలబద్దకం తగ్గిస్తుంది. ఎసిడిటీ, గుండెల్లో మంట తగ్గించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

5. నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది:
కొంతమంది శరీరంలో ఉండే నొప్పుల వలన బరువు తగ్గలేరని మీకు తెలుసా? నొప్పులు, వాపుల వలన ఎంత కఠినమైన ఆహారప్రణాళికను అనుసరించినా, ఎంత శారీరక శ్రమతో కూడిన వ్యాయామాలు చేసినా కూడా బరువు త్వరగా తగ్గలేరు. ఇటువంటి వారు చెరకు రసం తాగితే మంచిది, ఎందుకంటే చెరకు రసంకు నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. దీనివలన అదనపు బరువు తొలగిపోతుంది. దీనితో పాటు వ్యాయామం చేయడం పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి.

6. జీవక్రియను వేగవంతం చేస్తుంది:
జీవక్రియ ద్వారా మనం తీసుకునే ఆహారం శక్తిగా మారుతుంది. కండరాలు అధికంగా ఉన్నవారు కూర్చుని ఉన్నప్పటికిని కెలోరీలు కరుగుతాయి. చెరకు రసం శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు నెట్టి, వివిధ వ్యవస్థలను శుభ్రం చేసి, పనితీరును మెరుగుపరిచి, జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీవక్రియ వేగవంతమైనప్పుడు కొవ్వులు త్వరగా కరుగుతాయి.

7. శక్తిని పెంపొందిస్తుంది:
చెరకు రసంలో మనం శరీరం పనిచేయడానికి అవసరమైన శక్తిను ఉత్పత్తి చేసే గ్లూకోజ్ ఉంటుంది. వ్యాయామం చేసేవారి శరీరానికి ఇది తక్షణ శక్తి అందిస్తుంది. వీరు స్పోర్ట్స్ డ్రింక్స్ తాగటం కన్నా చెరకు రసం తాగడం మిన్న ఎందుకంటే ఇది శక్తిని అందించడమే కాక శరీర పాటుత్వాన్ని మరియు ప్రతికూల పరిస్థితులు తట్టుకునే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. చెరకు రసంలోని క్షారగుణం, శరీరంలోని ఆమ్ల తత్వాన్ని సమతులం చేస్తుంది. శరీరంలో క్షార వాతావరణం బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది.
చెరకు రసం తాగడానికి సరైన సమయం ఏది?
చెరకు రసం వెయ్యి ఏళ్ల పూర్వం నుండి వాడుకలో ఉంది. దీనిని మధ్యాహ్నం పూట 100 నుండి 200 మి. లి. తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications