Latest Updates
-
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ!
Eggs in Winter: చలికాలంలో రోజూ గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
గుడ్డు పోషకాల గని. బరువు తగ్గడానికి, కండరాలను నిర్మించడానికి గుడ్డు తప్పక తీసుకోవాల్సిన పోషకం. చలికాలంలో చాలా మంది రోగాల బారిన పడతారు. గుడ్డు తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చలికాలంలో రోజుకో గుడ్డు తినడం వల్ల ఇమ్యూ
Eatin Eggs: గుడ్డు పోషకాల గని. బరువు తగ్గడానికి, కండరాలను నిర్మించడానికి గుడ్డు తప్పక తీసుకోవాల్సిన పోషకం. చలికాలంలో చాలా మంది రోగాల బారిన పడతారు. గుడ్డు తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చలికాలంలో రోజుకో గుడ్డు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి రోగాలను ఎదుర్కోవచ్చు.

చలికాలంలో గుడ్డు ఎందుకు తినాలంటే..
చలికాలంలో గుడ్డు తినడం వల్ల ఒంటికి వెచ్చదనం వస్తుంది. గుడ్లలో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. అవయవాలను రక్షిస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. చలికాలంలో గుడ్డును ఎందుకు తినాలో ఇక్కడు కొన్ని కారణాలు ఉన్నాయి.

1. జింక్
గుడ్లలో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది.

2. విటమిన్ డి
విటమిన్ డి లేదా సూర్యరశ్మి విటమిన్ యొక్క అరుదైన ఆహార వనరుల్లో గుడ్లు ఒకటి. రోగనిరోధక శక్తి పెంపొందించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బలమైన రోగనిరోధక శక్తి శరీరాన్ని అంటువ్యాధుల నుండి కాపాడుతుంది. వాటితో పోరాడే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. విటమిన్ బి6, బి12
రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో విటమిన్ బి6, బి12 కీలక పాత్ర పోషిస్తాయి.

4. బరువు తగ్గడం
గుడ్లు బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారం. కీటో డైట్‌లోనూ గుడ్లు ప్రధాన ఆహారం. కొందరు గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తినాలని, పచ్చ సొన తినొద్దని చెబుతుంటారు. అందులో ఏమాత్రం నిజం లేదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ గుడ్డు మొత్తాన్ని తినవచ్చని వివరిస్తున్నారు.

5. గుడ్లు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి
గుడ్లు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. మొత్తం ఆరోగ్యానికి మేలు చేసే కొలెస్ట్రాల్ గుడ్డు వల్ల వస్తుంది. అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ స్థాయిలు గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుడ్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవు. అలాగే అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.

6. గుడ్లు కడుపును నింపేస్తాయి
గుడ్లు కడుపును ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలిగిస్తాయి. ఆకలి కాకుండా చూస్తాయి. గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

7. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి
మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం విటమిన్లు మరియు ఖనిజాలు గుడ్లలో ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల కారణంగా మీ మెదడు కణాలు, జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ, జీవక్రియ అన్నీ సరిగ్గా పని చేస్తూనే ఉంటాయి.
అల్పాహారంలో గుడ్డు..
సంతృప్తికరమైన ఆహారాల జాబితాలో గుడ్డు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆహారాలు తీసుకున్న తర్వాత రోజంతా పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. గుడ్లలో అతి తక్కువ కేలరీలు ఉంటాయి. తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ శాతంలో ప్రోటీన్ ఉంటుంది. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కోడి గుడ్డులో 9 రకాల అమైనో ఆమ్లాలు, ఐరన్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ, సి, విటమిన్ బి 12 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
భ్రమలు వద్దు..
గుడ్డు తినడం వలల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆహారం నుండి పొందిన కొలెస్ట్రాల్ కు శరీరానికి సంబంధించిన కొలెస్ట్రాల్ తో సంబంధం లేదు. కాబట్టి గుడ్డులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, అది మన శరీరం ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు. ఒకవేళ ఒంట్లో అధిక కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం గుడ్డులోని తెల్లని సొన తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications