Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వర్కవుట్స్ అందుకోసమేనా...
వరుణ్ తేజ్ తన తొలి చిత్రం నుండి ఇప్పటి గద్దల కొండ గణేష్ చిత్రం వరకు ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించేందుకు ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు.
మెగాస్టార్ కుటుంబంలో నాగబాబు తర్వాత ఆరడుగులకు పైగా ఎత్తు ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు వరుణ్ తేజ్. ఈ ఆరడుగుల అందగా ప్రస్తుత టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ పొడుగు కాళ్ల సుందరాంగుడు ఇటీవల కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవడంతో బాగా లావుగా అయ్యాడట.
అది కూడా 'మిస్టర్' సినిమా షూటింగ్ లో కాలికి గాయం కావడంతో ఇదంతా జరిగిందట. తను గాయం నుండి కోలుకున్నాక తన రాబోయే సినిమాల కోసం ఎన్నో కసరత్తులే చేశాడట.

ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తను ఫిట్ గా ఉండటానికి ఎలాంటి డైట్ పాటిస్తాడు.. ఏయే వర్కవుట్స్ వంటివి చేస్తాడో తెలుసుకుందాం...

ప్రతిసారీ ఫిట్ నెస్..
వరుణ్ తేజ్ తన తొలి చిత్రం నుండి ఇప్పటి గద్దల కొండ గణేష్ చిత్రం వరకు ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించేందుకు ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు.

కొత్తగా కనిపించేందుకు..
తన తర్వాతి సినిమాలో మరింత కొత్తగా కనిపించేందుకు ఏకంగా స్వదేశం వదిలి విదేశాల బాట పట్టాడట. ఇంతకీ అందులో ఏ రోల్ లో కనిపించబోతున్నాడంటే.. అందులో కూడా బాడీ ఫిట్ నెస్ కు సంబంధించిన రోల్స్ లోనే కనిపించి, అభిమానులను అలరించబోతున్నాడట.

బాక్సింగ్..
తన తర్వాతి చిత్రంలో బాక్సర్ కనిపించేందుకు సిద్ధమైన వరుణ్ తేజ్ బాక్సింగ్ కోసం అమెరికా వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇప్పటికే హైదరాబాదులో సైతం ఓ కోచ్ సారథ్యంలో కొన్ని మెళకువలను తీసుకున్నారట.
బొద్దుగా ఉండే సల్మాన్ ఖాన్ హీరోయిన్ సన్నగా మారడానికి ఏమి చేసిందో తెలుసా... PC : Insta

జిమ్ లో వర్కవుట్స్..
బాక్సింగ్ తో నే ఆగిపోకుండా నిత్యం జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నాడట. ఇంతకుముందు కూడా లాస్ ఏంజల్స్ లో కఠినమైన శిక్షణను, ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత టోనీ జెఫ్రీస్ సారథ్యంలో కోచింగ్ తీసుకున్నారట.

సోషల్ మీడియాలో..
రెండు నెలల కఠినమైన వర్కవుట్ల గురించి అతను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో కూడా షేర్ చేసుకున్నాడట. అలాగే తనకు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ కు కూడా ధన్యవాదాలు తెలిపాడు.

ఆహార నియమాలు..
ప్రతిరోజూ ఉదయం రెండు గుడ్లు, దాంతో పాటు ఓట్స్ ను కలిపి తినేవాడు. తర్వాత 11.30 గంటల సమయంలో కూరగాయల సూప్ తాగేవాడట. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ సగం ప్లేట్, కూరగాయల కర్రి, రెండు పీసులు చికెన్ ను మాత్రమే తీసుకునేవాడట. సాయంత్రం గ్రీన్ సలాడ్ తీసుకునేవాడట. అలాగే నట్స్ కూడా తినేవాడట.

తన శరీరం విషయంలో...
తన శరీరం కచ్చితమైన రూపం వచ్చేందుకు.. కఠినమైన వ్యాయామం చేస్తున్నాడట. ఇదంతా కేవలం తన తర్వాతి చిత్రం బాక్సర్ కోసమేనట. బిర్యానీ అయితే దాదాపుగా తగ్గించేశాడట.
ముందుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బోల్డ్ స్కై తెలుగు తరపున జన్మదిన శుభాకాంక్షలు..



Click it and Unblock the Notifications

