For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొద్దుగా ఉండే సల్మాన్ ఖాన్ హీరోయిన్ సన్నగా మారడానికి ఏమి చేసిందో తెలుసా...

|

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పుణ్యమా అని వెండి తెరపై అడుగుపెట్టిన జరీన్ ఖాన్ ఒకప్పుడు తెగ లావుగా ఉండేది. అయితే కేవలం సినిమాల కోసం ఈ బాలీవుడ్ అందాల భామ దాదాపు సగరం బరువు తగ్గిపోయిందట. అయితే ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఆ ఫొటోలను షేర్ చేసుకుంటూ లావుగా.. బొద్దుగా ఉండే వారందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది.

చదువుకునే రోజుల్లో దాదాపు వంద కిలోల బరువు ఉన్న జరీన్ ఖాన్ సినిమాల్లోకి వచ్చేసరికి అందులో దాదాపు సగం బరువును తగ్గించేసుకుంది. అది ఎలా సాధ్యమైందో వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మీరు కూడా ఆమె డైట్ అండ్ వర్కవుట్స్ ను ఫాలో అవ్వండి. మీ బాడీని బ్యూటిఫుల్ అండ్ ఫిట్ గా తయారుచేసుకోండి...

వింతగా చూడటం..

వింతగా చూడటం..

మహిళల్లో అధిక బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఎవరైనా కాస్త బొద్దుగా కనబడితే చాలు అలాంటి వారందరినీ అందరూ వింతగా చూస్తుంటారు. కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైనట్లు ఈ అందాల భామ చెప్పుకొచ్చింది.

PC : FB

బరువును లైట్ గా...

బరువును లైట్ గా...

తాను స్కూల్, కాలేజీలో చదువుకునే సమయంలో బరువు గురించి పెద్దగా పట్టించుకునేది కాదట. అయితే తన కుటుంబ సభ్యులు ఈ విషయంపై తెగ ఆందోళన చెందేవారట.

PC : FB

నా ఆశ నెరవేరలేదు..

నా ఆశ నెరవేరలేదు..

అయినా కూడా తను అలాంటి విషయాలను పట్టించుకోలేదట. తను ఒక మంచి వైద్యురాలు అవుదామని కలలు కన్నదంట. అయితే తన ఆశ నెరవేరలేదు అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.

మోడలింగ్ కోసం..

మోడలింగ్ కోసం..

తను చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉండేదట. తన జీవితం తన ఇష్టం అన్న రీతిలో ఉండేదట. అయితే మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో బరువు తగ్గాల్సి వచ్చిందట. అప్పటివరకు తనకు బరువు తగ్గాలన్న ఆలోచనే అనేదే రాలేదట.

PC : FB

ఆహారంలో జాగ్రత్తలు..

ఆహారంలో జాగ్రత్తలు..

ముందుగా ఆహార నియమాలు పాటించిందట. ఆ తర్వాత అందుకు తగ్గ ఎక్సర్ సైజులు చేస్తూ ముందుకు వెళ్లిందట.

హృతిక్ రోషన్ బర్త్ డే స్పెషల్ : తనలాగా డైట్ అండ్ వర్కవుట్స్ చేస్తే మీకు సిక్స్ ప్యాక్ ఖాయం...

ఇవే నా అలవాట్లు..

ఇవే నా అలవాట్లు..

ప్రతిరోజూ నేను బ్రౌన్ రైస్, గ్రిల్డ్ చికెన్ తో పాటు లైట్ ఆయిల్ లో ఉడికించిన కూరగాయల మొక్కలను రెగ్యులర్ గా తీసుకునేదట. సాయంత్రం వేళల్లో కొబ్బరి బొండం నీళ్లు, మొక్కజొన్న, సూప్స్ వంటివి తీసుకునేదట.

ఉదయం లేవగానే..

ఉదయం లేవగానే..

ఆ ఆహారంతో పాటు తన బాడీ డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఎక్కువ మొత్తంలో వాటర్, ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకునేదట. అలాగే పరగడుపునే లీటర్ వాటర్ తాగడాన్ని అలవాటుగా చేసుకుందట.

అమ్మో! ఫిట్ నెస్ కోసం ఆలియా భట్ ఎలాంటి ఫీట్స్ చేస్తుందో మీరే చూడండి...

రోజూ అద్దంలో చూసుకుంటూ..

రోజూ అద్దంలో చూసుకుంటూ..

అయితే ప్రతిరోజూ తనను తాను అద్దంలో చూసుకుంటూ మురిసిపోయేదట. తన బరువు రోజు రోజుకు తగ్గుతూ ఉండటం చూసి తనకే ఆశ్చర్యమేసిందట. ఇలా ఏకంగా ఆమె దాదాపు 43 కిలోలు తగ్గిపోయిందట.

పీలాట్స్ వర్కవుట్స్ తో స్టార్ట్...

పీలాట్స్ వర్కవుట్స్ తో స్టార్ట్...

తన శరీరం నాజుగ్గా కనిపించేందుకు ప్రతిరోజూ పీలాట్స్ వర్కవుట్స్ చేసేదట. వారంలో కనీసం మూడు రోజులు బరువులు ఎత్తడం వంటి వర్కవుట్స్ చేసేదట.

PC :FB

జిమ్ కోచ్ సాయంతో..

జిమ్ కోచ్ సాయంతో..

తన జిమ్ కోచ్ యాస్మిన్ సాయంతో పిలాట్స్, వెయిట్ ట్రైనింగ్, కార్డియో వంటి కఠినమైన ఎక్స్ ర్ సైజుల్ని ఎంతో సులభంగా చేసేవారట. అలాగే యోగా కూడా తన జీవితంలో కొత్త ఉత్సాహం నింపినట్లు తెలిపింది.

మీరు కూడా ట్రై చేయండి..

మీరు కూడా ట్రై చేయండి..

చూశారు కదా జరీన్ ఖాన్ డైట్ అండ్ వర్కవుట్స్ ఎలా చేసిందో.. అందుకోసం ఎంత కష్టపడిందో తెలుసుకున్నారు కదా.. మీరు కూడా లావుగా ఉంటే ఇలాంటి వర్కవుట్స్ ను జిమ్ ట్రైనర్ సాయంతో చేయండి. మీరు అందమైన బాడీని సొంతం చేసుకోండి...

English summary

Actress Zareen Khan Diet and Workouts

Here we talking about zareen khan diet and workouts. Take a look
Story first published: Friday, January 17, 2020, 15:32 [IST]