Latest Updates
-
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం..
ఆవు పాలు మంచిదా? గేదె పాలు మంచిదా? ఎలా తెలుసుకోవాలంటే?
ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే అవసరమయ్యేది ఏదైనా ఉందంటే అది పాలు. కొందరు గేదె పాలను వినియోగిస్తే మరికొందరు ఆవు పాలను వినియోగిస్తుంటారు. ఏ పాలు అయినా అది ఏ విధంగా ఉన్నా వాటికి ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే కొందరు గేదె పాలు ఆరోగ్యానికి మంచిదని చెప్తే, మరికొందరు ఆవు పాలు మంచిందని చెప్తుంటారు. ఇంతకీ ఏ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది? ఏ పాలు మంచిది ఏ పాలు మేలు చేస్తది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆవు పాల వల్ల లాభాలు:
ఆవు పాలను తక్కువగా వినియోగించినప్పటికీ అందులో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆవు పాల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది కూడా. అయితే ఆవు పాలు తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పాలు శరీర నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలోని కణాల మరమ్మత్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ డి, బీ12, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. దీని కారణంగా ఎముకలకు కావాల్సిన బలం అందుతుంది.
దీంతో పాటు ఆవు పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే రక్తంలో ఉండే ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. దీంతో పాటు రక్తపోటును తగ్గించేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు ఇందులో ఉన్న పొటాషియం శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.
ఆవు పాల వల్ల నష్టాలు
ఆవు పాలలో ల్యాక్టోస్ అనే చెక్కెర మూలకం కొంచెం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిని జీర్ణించుకోవడం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఆవుపాలు తాగడం వల్ల సులభంగా బరువు పెరగడం, అజీర్తి, అతిసారం వంటి సమస్యల బారిన పడతారు. అలాగే ఆవు పాలలో కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. కొన్ని పాలలో గర్భధారణ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అలాగే కొంతమందికి పాల ప్రొటీన్ల సమస్య ఉంటుంది. ఇది కూడా ప్రమాదకరంగా మారొచ్చు.
గేదె పాలు పోషకాలతో నిండి ఉన్నాయి మరియు వేలాది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వినియోగించబడుతున్నాయి. అయితే, ఇతర పాల వలె, గేదె పాలకు కూడా కొన్ని లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి.
గేదె పాల లాభాలు:
కొన్ని వందల సంవత్సరాల నుంచి గేదె పాలు వినియోగంలో ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలోని చాలా మంది గేదె పాలనే వినియోగిస్తుంటారు. ఈ గేదె పాలలో క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యం కోసం, అలాగే కండరాల అభివృద్ధి కోసం సహాయపడతాయి. గేదె పాలలో ఉండే యాంటీ బోడీలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. గేదె పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. అలాగే గేదె పాలలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అలాగే ఆకలి ఎక్కువగా కాకుండా నియంత్రిస్తుంది. తద్వారా బరువు పెరిగే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
గేదె పాల వల్ల నష్టాలు:
గేదె పాల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హృదయ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అలాగే సులభంగా బరువు పెరిగిపోయేలా ఇది ప్రోత్సహిస్తుంది. ల్యాక్టోస్ అంటే చిరాకు ఉండే వారికి గేదె పాలు త్వరగా జీర్ణ కావు. దీని వల్ల ఉబ్బరం, అజీర్తి, అతిసారం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇందులో చెడు కొవ్వు శాతం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.
ముగింపు:
ఆవు పాలు మరియు గేదె పాలు రెండింటికీ తమదైన ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు ఉన్నాయి. మీకు ఏది బాగుంటుందో నిర్ణయించడానికి మీ వైద్యుడిని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications