Latest Updates
-
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.!
గ్రీన్ టీ వర్సెస్ మాచా టీ.. బరువు తగ్గడం కోసం ఏది బెస్ట్.. ఎలా తీసుకోవాలి.?
ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్ కోసం, ఆరోగ్యవంతమైన జీవితం కోసం టీ, కాఫీ వంటి కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. బరువు తగ్గడం కోసం గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ టీకి ఎక్కువగా తాగుతుంటారు. జపనీస్ బ్రాండ్ మాచా టీని సైతం తమ డైట్‌లో చేర్చుకుంటారు. అయితే ఈ రెండు ఆరోగ్యానికి మేలు చేస్తున్నా.. అసలు ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి.. ఏ టీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.. వైద్య నిపుణుల సలహాలు చూద్దాం..

పోషక విలువలు
సాధారణంగా గ్రీన్ టీ తీసుకునేటప్పుడు వాటి ఆకులను నీళ్లలో మరిగించి తాగుతాం. కానీ మాచా గ్రీన్ టీలో ఆకులను మెత్తగా నోరి పొడి చేసిన తర్వాత నీటిలో మరిగించి తాగుతారు. ఈ క్రమంలో ఈ రెండింటిలో పోషక విలువల్లో తేడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గ్రీన్ టీ, మాచా టీ రెండూ ఒకే మొక్క నుంచి తయారైనా.. వాటి తయారీ, వినియోగం వేరుగా ఉంటుంది.
గ్రీన్ టీతో పోలిస్తే మాచా టీని నూరి పొడి చేసుకొని తాగడం ద్వారా ఇందులో యాంటీఆక్సిడెంట్లు, కాటెచిన్లు పుష్కలంగా ఉంటాయి. సమతుల్య ఆహారంతో మాచా టీని తీసుకోవడం ద్వారా వాటి ప్రయోజనాలు పుష్కలంగా అందుతాయి.

కెఫీన్ పరిమాణం
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సాధారణంగా కెఫీన్‌ను తక్కువగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తారు. అయితే గ్రీన్ టీతో పోలిస్తే మాచా టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు మాచా టీలో 70 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ ఉంటుంది. ఇక గ్రీన్ టీలో 45 గ్రాముల వరకు కెఫీన్ ఉంటుంది. ఈ క్రమంలో ఆందోళన, నిద్ర లేమి, గుండె దడ వంటి సమస్యలు ఉన్నవారు మాచా టీని తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రుచి, ఆకృతి
గ్రీన్ టీ ఆకృతి రుచిగా ఉంటుంది. తాగుతున్నంతసేపు ఉత్తేజకరమైన అనుభూతిని ఇస్తుంది. అయితే మాచా టీ మాత్రం గాఢంగా, క్రీమీగా, మట్టి వాసనతో ఉండటం వల్ల ఆకృతి భిన్నంగా ఉంటుంది. మాచా టీ పౌడర్ మొత్తం పొడిగా ఉండటం వల్ల దాని రుచి గ్రీన్ టీతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మీ అబిరుచి ఆధారంగా మాచా టీని తీసుకోవచ్చు.

ఆరోగ్యానికి గ్రీన్ టీ, మాచా టీ రెండూ మేలు చేస్తాయి. ఇందులోని సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. మెటబాలిజంకి దోహదపడుతుంది. అయితే బరువు తగ్గడం కోసం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం కేవలం గ్రీన్ టీ, మాచా టీ మాత్రమే తాగితే సరిపోదని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, తగినంత నిద్రతో పాటు రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు మీ అభిరుచికి అనుగుణంగా గ్రీన్ టీ లేదా మాచా టీని తీసుకోవడం ద్వారా బరువు సులభంగా తగ్గుతారు.
కెఫీన్ తక్కువ, ధర తక్కువ, తేలికపాటి రుచి కోరుకునేవారి గ్రీన్ టీ మంచి ఆప్షన్. ఇక కెఫీన్ ఉన్నా యాంటీఆక్సిడెంట్లు కావాలనుకునేవారికి మాచా టీని ఎంపిక చేసుకోవచ్చు. అయితే గ్రీన్ టీ లేదా మాచా టీని పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మందులు వాడుతున్న వారు.. వీటిని తీసుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications