Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.?
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు మన జీవితంలో ఎక్కువ భాగం గడిపేది ఫోన్‌తోనే.. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా పుణ్యమా అని పనిలో ఉన్న ఖాళీగా ఉన్నా అదే పనిగా రీల్స్, వీడియోలు చూడటం అలవాటైపోయింది. ఈ సాధారణ అలవాటు కాస్త వ్యసనంగా మారింది. కానీ మీరు ఒక వారం పాటు ఇలా ఫోన్‌ను స్క్రోల్ చేయడం ఆపేస్తే శరీరంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని మీకు తెలుసా.?

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా షార్ట్ వీడియోలు ప్రతి 30 సెకన్లకి ఒక కొత్త కంటెంట్‌ని పరిచయం చేస్తాయి. కొన్ని కామెడీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి, ఇంకొన్ని కోపాన్ని తెప్పిస్తాయి. ఇలా ఈ వీడియోలు మెదడులో డోపమైన్‌ను విడుదల చేసి రివార్డ్ సిస్టమ్‌ను ఉత్తేజపరుస్తుంది. దీంతో అదేపనిగా రీల్స్ చూస్తూ అలవాటు కాస్త వ్యసనంగా మారుతుంది. అయితే ఇలా బానిస కావడం ఆరోగ్యానికి హాని అని తెలిసినా ఈ అలవాటు నుంచి బయటపడలేక పోతున్నారు. కానీ మీరు ఒక వారం పాటు ఈ వ్యసనం నుంచి బయటపడ్డారంటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం..
వారం పాటు రీల్స్, ఇతర సోషల్ మీడియా కంటెంట్‌కు విరామం ఇవ్వడం ద్వారా మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, డైలీ రొటీన్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని సైకాలజిస్ట్ నిపుణులు అంటున్నారు. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. కానీ మెదడు మాత్రం కాస్త రిలీఫ్ మాత్రం తప్పనిసరిగా పొందుతుంది.
మొదటి రెండు రోజులు..
ఫోన్ స్క్రోల్ చేయడం ఆపేసిన మొదటి రెండు రోజులు మీకు కష్టంగానే అనిపించవచ్చు. ఒక్కసారిగా ఆపేయడం వల్ల విసుగు, ఆందోళన ఏర్పడుతుంది. అయితే మీరు కంట్రోల్ చేసుకుంటూ ఇతర పనుల్లో మునిగినట్లయితే క్రమంగా మీరు ఆ వాతావరణానికి అలవాటు పడిపోతారు. మరో రెండు రోజులు గడవగానే ఏకాగ్రత పెరగడం గమనిస్తారు.
క్రమంగా మీరు ఈ అలవాటును కొనసాగించినట్లయితే రీల్స్, వీడియోలు చూడాలనే ఆసక్తి తగ్గి ఎక్కువసేపు పనిపై దృష్టి సారించగలరు. అంతేకాకుండా వర్తమానంపై దృష్టి సారిచడం సులభమవుతుంది.

నిద్రపై ప్రభావం
స్క్రీన్‌కి దూరంగా ఉండటం వల్ల నిద్రపై పాజిటివ్ రిజల్ట్ గమనిస్తారు. రాత్రి ఆలస్యంగా నిద్ర పోకుండా త్వరగా కునుకు తీస్తారు. త్వరగా నిద్రపోవడం వల్ల ఉదయాన్నే నిద్ర లేచి డైలీ రొటీన్‌ను మెరుగుపరుచుకుంటారు. ఈ క్రమంలో మీరు ఫోన్ ఎప్పుడు చూడాలి, ఎందుకు చూడాలనే దానిపై కూడా మీరు మెరుగైన కంట్రోల్ పొందవచ్చు.
అయితే ఏడు రోజుల పాటు మొత్తం ఫోన్‌కి దూరంగా ఉండాలని దీని అర్థం కాదు. అవసరమైన సందర్భాలు అంటే చదువు, ప్రాజెక్టు, ఇతర ముఖ్యమైన విషయాల్లో మీరు ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. రోజులో కొంత సమయం పోన్‌కి దూరంగా ఉండగలడం, నిద్రపోయే ముందు రీల్స్ చూడకుండా ఉండటం చేస్తూ దీనికి బదులుగా వ్యాయామం, చదువుకోవడం, కుటుంబీకులు, స్నేహితులతో సమయం గడపడం వంటి వాటి ద్వారా ఈ అలవాట్లను మీరు ఆరోగ్యకరంగా పెంపొందించుకోవచ్చు. దీంతో ఫోన్‌ను ఎప్పుడు వాడాలో అప్పుడే వాడేలా మీ మైండ్ మీకు అనుగుణంగా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
