Latest Updates
-
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి
శీఘ్ర స్ఖలన సమస్య? నయం చేయటానికి 15 పవర్ ఫుడ్స్
చాలా మంది పురుషుల్లో,అకాల స్ఖలనం అనేది అరుదుగా సంభవిస్తుంది. సాధారణంగా ఇది ఆందోళనకు కారణం కాదు. అయితే,ఇది చాలా తరచుగా జరిగితే మాత్రం మీ శృంగార జీవితంనకు ముగింపు వచ్చే అవకాశం ఉంది. ఇది బాగా ఆందోళనకు ఒక కారణం కావచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం అకాల స్ఖలనంనకు వయస్సు తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉందని తెలిసింది.
పురుషులకు వయస్సు పెరిగే కొద్ది టెస్టోస్టెరాన్ స్థాయిలు వయస్సు తో పాటుగా తగ్గుతాయి.అప్పుడు అకాల స్ఖలనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాసంలో,మేము అకాల స్ఖలనంను నయం చేయటానికి కొన్ని ఆహారాల గురించి చెప్పుతున్నాం. ఈ ఆహారాలు అకాల స్ఖలనం కోసం సహజ నివారణలుగా మరియు పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఈ ఆహారాలు అకాల స్ఖలనం నయం చేయటానికి మరియు సెక్స్ డ్రైవ్ పెంచడానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను శరీరానికి సరఫరా చేస్తాయి.
వయస్సు పెరగటం మరియు టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గటమే కాకుండా అకాల స్ఖలనం కొరకు అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, పీనల్ నరాల ఉద్దీపన కారణంగా పురుషులలో అకాల స్ఖలన ప్రారంభానికి దారితీస్తుంది. ఈ వ్యాసంలో,మేము పురుషుల అకాల స్ఖలనం నయం చేసే ఆహారాల గురించి వివరించాము.
శీఘ్ర స్ఖలన చికిత్సకు సహజ మార్గాలు: క్లిక్ చేయండి
ఇప్పుడు అకాల స్ఖలనం కోసం ఈ 15 సహజ నివారణల గురించి చూద్దాం. ఇక్కడ పురుషుల్లో అకాల స్ఖలనం నయం చేయడానికి 15 ఆహారాలు ఉన్నాయి. వాటిని చదవండి ...

ఆస్పరాగస్
ఆస్పరాగస్ అనేది పురుషులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది.వాటిలో ప్రాథమికంగా పురుషుల్లో సెక్స్ డ్రైవ్ పెంచడంలో దానికి సానుకూల ప్రభావం ఉంటుంది. పురుషుల్లో హార్మోన్ పనితీరును పెంచడానికి ఉపయోగపడే విటమిన్ E తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు ఆస్పరాగస్ లో సమృద్ధిగా ఉంటాయి.

గుడ్లు
విటమిన్ D సెక్స్ డ్రైవ్ పెంచడానికి ముడిపడిన మరొక కీలకాంశం. ప్రతి రోజు పురుషులు రెండు గుడ్లు తీసుకుంటే టెస్టోస్టెరాన్ స్థాయి పెరగటానికి అద్భుతంగా పనిచేస్తుంది. గుడ్లు అనేవి పురుషుల్లో అకాల స్ఖలనం నయం చేసే అత్యంత సమర్థవంతమైన ఆహారాలుగా ఉన్నాయి.

డార్క్ చాక్లెట్లు
డార్క్ చాక్లెట్లు అకాల స్ఖలనం నయం చేసే ఆహారాలలో ఒకటిగా ఉంది. అవి మగ సెక్స్ ఆర్గాన్స్ లో రక్త ప్రవాహ ఉద్దీపనను కలిగిస్తాయి. డార్క్ చాక్లెట్లు L-అర్జినిన్ HCl కలిగి ఉంటాయి.ఈ ముఖ్యమైన అమైనో ఆమ్లం శరీరంలో హార్మోన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది.

క్యారెట్లు
క్యారట్లలో విటమిన్లు మరియు అవసరమైన అన్ని ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. క్యారట్లలో ఉండే విటమిన్లు పురుషాంగము కండరాలను బలోపేతం చేయుట మరియు మగ సెక్స్ ఆర్గాన్స్ లో రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరించటానికి సహాయం చేస్తాయి.

ఓట్స్
ఓట్స్ లో సెరోటోనిన్ అనే ముఖ్యమైన రసాయనం ఉంటుంది. ఇది ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అకాల స్ఖలనం అనేది ప్రత్యక్షంగా ఆందోళన మరియు ఒత్తిడితో ముడిపడి ఉంటుంది. అంతేకాక,ఓట్స్ లో టెస్టోస్టెరాన్ పెంచటానికి సహాయపడే ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

అశ్వగంధ
భారతదేశం యొక్క పశ్చిమ భాగంలో కొన్ని శతాబ్దాలుగా ఈ మూలికను పురుషుల్లో లైంగిక సత్తువను మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు.ఇది పురుషుల్లో అకాల క్లైమాక్స్ నిరోధిస్తుంది. అలాగే ఆతురత మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.ఇది బహుశా అకాల స్ఖలనం నిరోధించడానికి ఉత్తమ మూలికగా ఉంది.

అవకాడొలు
దీనిని తరచుగా వండర్ పండు అని అంటారు. అవకాడొలో విటమిన్ B,C,K తో సహా అనేక విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ K శరీరం యొక్క ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరణలో సహాయపడుతుంది.అలాగే,అవకాడొలు సహజ సెక్స్ బూస్టర్ల వలే పని చేయటానికి ప్రోటీన్లు మరియు ఫైబర్స్ సమృద్దిగా ఉన్నాయి.

బ్లూ బెర్రీలు
అకాల స్ఖలనం నిరోధించే అనేక ఆహారాలలో బ్లూ బెర్రీలు ఖచ్చితంగా అగ్రభాగాన ఉంటాయి.బ్లూ బెర్రీలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో ఎంతో ప్రభావవంతముగా పనిచేస్తాయి. సాధారణంగా ఫ్రీ రాడికల్స్ అనేవి పురుషుల్లో వీర్యకణాల కౌంట్ లో జోక్యం చేసుకుంటాయి.

అరటిపండ్లు
అరటిపండ్లలో పురుషుల్లో సెక్స్ డ్రైవ్ పెంచటానికి చాలా ప్రభావవంతముగా పనిచేసే బ్రొమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచడానికి కూడా సహాయపడుతుంది.

వాల్నట్స్
వాల్నట్స్ అనేవి నపుంసకత్వం,అంగస్తంభన మరియు అకాల స్ఖలనంను నయం చేస్తాయి. వాల్నట్ అకాల స్ఖలనం నయం చేయడంలో ఒక వండర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దానిలో ప్రోటీన్లు మరియు కీలకమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

తృణధాన్యాలు
మీరు ఎక్కువ కాలం సమర్ధతతో ఉండటానికి తృణధాన్యాలు ఉపయోగపడతాయి. వాటిలో నియాసిన్ మరియు థియామిన్ సమృద్దిగా ఉంటాయి. నియాసిన్ కు బలమైన అంగస్తంభనలకు సంబంధం ఉంది. అలాగే మీకు భావప్రాప్తి కలగటానికి కూడా సహాయపడుతుంది.

ఆకుపచ్చని ఆకుకూరలు
దీనిలో అంద్రో స్టేనోన్ మరియు అద్రోస్తేనోల్ సమృద్దిగా ఉంటాయి. ఆకుపచ్చని ఆకుకూరలు అకాల స్ఖలనం నయం చేయటానికి అత్యంత ఆకర్షణీయమైన ఆహారాలలో ఒకటిగా ఉంది.

ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి
ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి రెండింటిలోను అల్లిసిన్ ఉంటుంది. ఇది పురుషుల్లో సెక్స్ డ్రైవ్ పెంచటానికి ఒక కీలకాంశంగా ఉంటుంది. అల్లిసిన్ అద్భుతంగా మగ సెక్స్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణను క్రమబద్దం చేస్తుంది.

బాదంపప్పులు
బాదంపప్పులలో జింక్ మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. జింక్ సమృద్ధిగా ఉన్నఆహారాలు అకాల స్ఖలనం కోసం సహజ నివారణలుగా ఉన్నాయి.

బీన్స్ మరియు పుట్టగొడుగులు
బీన్స్ మరియు పుట్టగొడుగులలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది. కిడ్నీ బీన్స్ వంటి బీన్స్ పురుషుల్లో సెక్స్ డ్రైవ్ ని సహజ సిద్ధముగా పెంచుతాయి.



Click it and Unblock the Notifications











