Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
వీటిలో ఏలక్షణం మీలో కనిపించినా?లివర్ డ్యామేజ్ అయినట్లే
మన శరీరంలో అతిపెద్ద అవయవం లివరే..!లివర్(కాలేయం) పెద్ద అవయవమే కాదు అతి ప్రత్యే కమైన అవయవం కూడా! శరీరంలో ఐదుకి పైగా పనుల్ని నిర్వర్తిస్తోంది. వెయ్యికి పైగా ఎంజైమ్స్‌ని లివర్ తయారు చేస్తుంటుంది. శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు రక్తం కొద్దిసేపు కారి, అక్కడ గడ్డకట్టి, రక్తం కారిపోతోందంటే అందుకు అవసరమైన ఎంజైమ్స్‌ని లివరే ఉత్పత్తిచేస్తుంది. అనారోగ్యాలు కలిగినప్పుడు, వాటినుంచి తట్టుకోవడానికి అవసరమైన ‘యాంటిబాడీస్‌ని లివరే ఉత్పత్తి చేస్తుంది. లివర్ కొంత మేరకు గాయపడ్డా తిరిగి తన పూర్వస్థితికి చేరుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మన శరీర అవయవాలన్నింటిలోనూ మూడింట రెండు వంతులు తొలగించినా... మళ్లీ మునపటిలా పెరగగల సామర్థ్యం కాలేయానికి ఉంది. అందుకే దాదాపు 90 శాతం కాలేయం దెబ్బతిన్నప్పటికీ ఒక పట్టాన లక్షణాలు బయటకు కనిపించవు. లివర్ (కాలేయం)... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.
కాలేయ సమస్యలకు ముఖ్య కారణాలు: ఇన్ఫెక్షన్స్ మత్తు పదార్థాలు సేవించడం, పొగతాగడం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం శరీరానికి వ్యాయామం ఇవ్వకపోవడం కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం రక్తమార్పిడి శరీరానికి హాని చేసే మందులను ఎక్కువ మోతాదులో వాడటం ఆటో ఇమ్యూన్ డిసీజెస్... అంటే మన రోగనిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేయడానికి అవకాశం ఉన్న వ్యాధులు రావడం, వీటితో పాటు వంశపారంపర్యంగాకూడా కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మద్యపానం ఒక్కటే లివర్ డ్యామేజ్ కు కారణం కాదు. మేము మద్యం త్రాగము కాబట్టి మాకు లివర్ డ్యామేజ్ సమస్యలు ఏం ఉండవనుకోవడం చాలా పొరపాటు. కొన్ని సార్లు మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల కాలేయం చుట్టూ అధికంగా క్రొవ్వు చేరుతుంది. దీన్ని ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అంటారు. అంతే కాదు దీన్ని లివర్ డ్యామేజ్ గా కూడా వర్గీకరిస్తారు. కాబట్టి ఎటువంటి సంకేతాలు లేకుండా లివర్ డ్యామేజ్ అవుతుంటాయి. సడన్ గా బయటపడుతుంటాయి. అందుకోసం లివర్ డ్యామేజ్ కలిగించే కొన్ని లక్షణాలు(సంకేతాలు)మీకోసం...
1. కళ్ళు పసుపు పచ్చగా ఉంటాయి: అలసిన కళ్ళు మరియు కళ్ళ చుట్టు నల్లటి వలయాలు: కాలేయం మోసపూరితంగా చర్మాన్ని నాశనం చేయడం మరియు అలసటకు గురిచేయడం వంటి లక్షణాలకు గురిచేస్తుంది. కళ్ళ క్రింది చర్మ చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అలసనట్లు కనబడ్డి అది మీ అనారోగ్యానికి చిహ్నంగా గుర్తించాలి. తెల్లగా ఉండే కళ్ళు పసుపు పచ్చగా మరియు గోళ్ళు పసుపుగా మారినప్పుడు కామెర్లు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి. అంటే కాలేయం దెబ్బతినింది దానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
2. వికారంగా ఉండడం అజీర్ణం, కాలేయం దెబ్బతినడంతో ఆమ్ల ప్రభావంతో తలతిరిగేటట్టు ఉండడం వంటి జీర్ణ సమస్యలు కూడా వాంతులకు దారితీస్తాయి.
3. ఉదరపు వాపు: కొన్ని సార్లు, కాలేయం ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఎన్ లార్డ్ కావడం వల్ల పొట్ట ఉదర భాగం ఉబ్బి ఉంటుంది. ఈ పరిస్థితిని వెంటనే గమనించకపోయినట్లైతే మీ బొడ్డు చుట్టూ పొట్ట మరింత విస్తరించే అవకాశం ఉంది. పొత్తికడుపు, ప్రత్యేకంగా పొత్తికడుపు పైన కుడివైపు మూలన లేదా పక్కటేముకకు కింద కుడి భాగంలో నొప్పి ఉంటే అది కాలేయం దెబ్బతిన్న లక్షణాన్ని సూచిస్తుంది.
4. నిద్రలేమి: దెబ్బతిన్న కాలేయం పూర్తిగా పాడైపోయినపుడు ప్రమాదకర ఫాటిగ్, కండరాల, మానసిక బలహీనత, మతిమరుపు, గందరగోళం, చివరికి కోమా సాధారణంగా వస్తాయి.
5. జీర్ణక్రియ మీద ప్రభావం: మీ కాలేయం దాని పై కొవ్వు పేరుకుపోయినా లేదా కాలేయం విస్తరించినా, నీరు కూడా జీర్ణం కాలేవు. అయితే చాలా కాలం నుండి చిన్న జీర్ణ సమస్యలు ఉన్నా, తగ్గకుండా తరచూ బాధిస్తుంటే లివర్ డ్యామేజ్ లక్షణంగా గుర్తించాలి.
6. మెనుష్ట్రువల్ డిసార్డర్: లివర్ క్రిటికల్ గా డ్యామేజ్ అయినప్పుడు, బ్రెయిన్ ఫంక్షన్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో మెదడు వెంటనే ప్రతిస్పందించవు. పేషంట్స్ ఎల్లప్పుడూ ఆందోళనలో ఉంటారు. ఇది కూడా లివర్ డ్యామేజ్ కు ఒక ప్రధాన లక్షణమే. పేషంట్స్ కు వెంటనే మెడికల్ అటెన్షన్ ఇవ్వకపోతే మెనుష్ట్రువల్ డిజార్డర్ మొదలవుతుంది.
7. కోమా: లివర్ డ్యామేజ్ చివరి లక్షణం మరియు వరెస్ట్ లివర్ డ్యామేజ్ లక్షణం, పేషంట్ వెంటనే కోమాలోకి వెళతాడు. అటువంటి పరిస్థితిలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications