Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్తుంది
మన శరీరంలోని వ్యర్ధ పదార్ధం మూత్రం, మలం ద్వారా విసర్జించబడుతుంది. మూత్రపిండాలలో రక్తం నుండి వ్యర్ధ పదార్ధాలు బైటికి పంపబడి మూత్రం గా ఏర్పడి, రక్తానికి ఉపయోగమైన, అవసరమైన వాటిని తిరిగి పొందుతుంది. ఈ పద్ధతిని పునశ్శోషణము అంటారు. కొన్నిసార్లు ప్రోటీన్లు, ఎర్ర రక్తకణాలు, వంటి ఇంకా అనేక ఉపయోగకర పదార్ధాలు మూత్రం ద్వారా బైటికి విసర్జించబడతాయి. ఇది సాధారణ పరిస్థితి కాదు. మూత్రం రంగు ముఖ్యంగా ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది మీ శరీరంలో వ్యాపించే మూత్రపిండ జబ్బులను లేదా ఇతర జబ్బుల పరిస్థితులను సూచిస్తుంది. అందువల్ల మూత్రం యొక్క రంగు, వాసన, క్రమబద్దత అనేవి మీ శరీరం లోపల వాటి గురించి తెలియచేస్తుంది. అనేక నిర్ధారణ పరీక్షలు మూత్ర పరీక్షలను నిర్వహిస్తాయి. అయితే మూత్ర రంగు మారే గుర్తు మీ ఆరోగ్యం గురించి తెలియచేస్తుందని మీకు తెలియాలి. మూత్రం పచ్చగా ఉంటే మూత్రం ఆరోగ్యకరమైనది అని. అంతేకాకుండా ఎ మూత్రం రంగైనా మీ క్షేమాన్ని గురించి తెలియచేస్తుంది.
చాలా తరచుగా మూత్రం రంగు మారడం అనేది మీరు ఎంత లేదా ఎంత తక్కువ నీటిని తాగుతున్నారు అనే దానిపై అపాది౦చబడుతుంది. మూత్రం రంగు మారడానికి మరో కారణం మీరుతీసుకునే ఆహరం, కొన్ని రకాల ఔషధాలు. ఒకసారి మీ మూత్రం రంగు సాధారణ స్థాయికి చేరుకుంటే మందులు మానేయ౦డి.
నేడు, మూత్ర రంగు మీ ఆరోగ్యాన్ని తెలియచేస్తుందనే విషయాన్నీ బోల్డ్ స్కై మీకు తెలియచేస్తుంది. కొన్ని రకాల రంగులలో మూత్రం ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి ఏమి జరుగుతుందో చూడండి. మీ మూత్రం రంగు మీ ఆరోగ్యానికి సూచిక అని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

1. పారదర్శకంగా
మూత్రం క్లియర్ గా ఉంటె ఆరోగ్యం బాగున్నట్లు. అయితే, కొన్నిసార్లు ఇది మీరు ఎక్కువ నీరు తాగుతున్నారని సూచిస్తుంది, ఇది ప్రమాదకర నీరుగా మారి దుష్ప్రభావం చూపుతుంది. ఆర్ద్రీకరణ ఎక్కువగా ఉండడం అంటే మీకు అవసరమైన దాని కంటే ఎక్కువ నీరు తాగడం, ఇది లవణాలను ఎక్కువగా పలుచన చేసి శరీరానికి ప్రమాదం ఔతుంది. దీనివల్ల సాధారణంగా ఎటువంటి ప్రమాదకర ఆరోగ్యకర సమస్యలూ రావు, కానీ మీరు అవసరమైన దానికంటే ఎక్కువగా బలవంతాన నీరు తాగొద్దు.

2. అసలు రంగే ఉండకపోవడం
మూత్రం ఎక్కువ పారదర్శకంగా ఉండడం అనేది మధుమేహాన్ని సూచిస్తుంది. మీ మూత్రం ఎటువంటి రంగు లేకపోతే, ఇది కూడా మధుమేహానికి చిహ్నమే. తరచుగా దాహం వేయడం, మూత్రానికి వెల్లడం అనేవి కూడా మరికొన్ని లక్షణాలు. ఎప్పుడూ మీకు నీరు త్రాగాలి అనిపిస్తే, మీరు తప్పనిసరిగా మధుమేహ పరీక్ష చేయించుకోండి. మీ మూత్రం ఎటువంటి రంగు లేకపోవడం కూడా ఒక ప్రధాన ఆరోగ్య సూచిక.

3. లేత అంబర్ లేదా తేనె రంగు కలిగి ఉండడం
మూత్రం పచ్చని రంగులో ఉండడం ఆరోగ్య సూచకం. ఒకవేళ ముదురు రంగులో ఉంటే, మీరు నీరసించి ఉన్నారని, నీరు త్రాగడం అవసరమని గుర్తు. మూత్రం ఎక్కువ చిక్కగా వచ్చినట్లయితే, సాధారణంగా దుర్వాసన ;కూడా వస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాల వల్ల మూత్రం ముదురు పచ్చగా వస్తుంది. ఉదాహరణకు బీట్ రూట్ వల్ల మూత్రం ముదురు రంగులో వస్తాయి.

4. సిరప్ లేదా గోధుమ రంగు
గోధుమ రంగు మూత్రం పరిస్థితి బాగోలేదని సూచిస్తుంది. లివర్ సమస్యతో బాధపడేవారికి గోధుమ రంగు మూత్రం వస్తుంది. మీ లివర్ సరిగా పనిచేయకపోతే, పిత్త లవణాలు మలంతో విసర్జి౦చబడి రక్తం గాఢ౦గా ఉంటుంది. హెపటైటిస్, లివర్ వాపు మొదలైనవి మూత్రం ముదురు రంగుకు లివర్ పరిస్థితిని తెలియచేసే కారణాలు. ఇది డి-హైడ్రేషన్ కి కూడా గుర్తు అందువల్ల మీరు వైద్యుడి ద్వారా పరీక్ష చేయించుకోవడం అవసరం.

5. లేత గులాబీ రంగు నుండి ఎరుపు రంగులోకి
మూత్రం లో రక్తం నుండి ఎరుపు రంగు వస్తుంది, ఈ పరిస్థితిని హేమటురియా అంటారు. ఎరుపు సాధారణంగా అత్యంత ఆందోళనకరమైన రంగు. మూత్రం ఎర్రగా రావడానికి కారణాలు మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్లు, బ్లాడర్ లేదా మూత్రపిండాలలో రాళ్ళు, కొన్ని మూత్రపిండా కాన్సర్లు, ప్రోస్టేట్ లేదా మూత్రాశయం ఇవ్వన్నీ రక్తస్రావం, మూత్రం ఎర్రగా రావడానికి కారణాలు కావచ్చు. ఇలాంటి సందర్భాలలో మూత్ర సమయంలో నెప్పి వస్తుంది, అలాంటపుడు మూత్రం చేయడం కష్టమౌతుంది. ఎరుపు లేదా లేత గులాబీరంగు మూత్రం మీరు లోపలి తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్ధాల వల్ల కావచ్చు, అందువల్ల మీరు వీటన్నిటినీ మానుకోండి. బీట్స్, బ్లాక్ బెర్రీస్, రుబ్బార్ వంటి పదార్ధాల వల్ల మూత్రం ఎర్రగా వస్తుంది. ఈ రంగు మారడం అనేది ఆహరం వల్ల కాకపోతే, ఒకసారికంటే ఎక్కువసార్లు జరిగితే, ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గుర్తు.

6. నీలం రంగు
పోర్ఫీరియా అనేది కూడా చాలా అరుదైన పరిస్థితి. ఇది ఒక వ్యక్తి మూత్రం నీలం లేదా ఊదా రంగులో వచ్చే అనువంశిక ఎంజైమ్. అయితే, మూత్రం నీలం టింజ్ ని చేరి ఉంటుంది. ఇది సాధారణంగా రంగులు గల ఔషధాలు, కొన్నిరకాల ఆహారపదార్ధాల వల్ల ఏర్పడుతుంది. కొన్ని మందులు త్రయంతరెంస్ (తేలికపాటి మూత్రవిసర్జన) లేదా వయాగ్రా వంటివి ఉపయోగించడం వల్ల మూత్రం నీలంగా వస్తుంది.

7. ఆకుపచ్చగా
మూత్రం లో చీము ఉంటె, మూత్రం ఆకుపచ్చగా కనిపిస్తుంది. దానికి అత్యంత సాధారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ కారణం. దీనికి ప్రధాన కారణం ఆకుపచ్చ రంగు ఆహార పదార్ధాలు దోషి కావచ్చు. మీరు దానిని తినేటపుడు ఒక ప్రత్యెక మైన వాసనను కూడా మీరు గమనించ వచ్చు. ఇది నల్లని లికోరైస్ తినడం వల్ల లేదా మీ జీర్ణాశయంలో అరగించుకోలేని గాఢత కలిగిన ఆహార పదార్ధాల వల్ల కూడా కావచ్చు. యాంటీ బయాటిక్స్ వంటి కొన్ని రకాల ఔషధాల వల్ల కూడా మూత్రం పచ్చగా వస్తుంది.

8. నురుగు లాంటి మూత్రం
ఇది ప్రోటీన్ల కారణంగా వస్తుంది, దీనికి మరింత పరిశోధన అవసరం, ఇది మూత్రపిడం లేదా పిత్తాశయ సమస్య కావచ్చు. మీకు ఎప్పుడూ నురగతో కూడిన మూత్రం వస్తుంటే, వెళ్లి వైద్యుడిని సంప్రదించండి.

9. తెల్లటి మూత్రం
పాలలాంటి తెల్లని మూత్రం రక్తం తక్కువ ఉన్నట్లు సూచిస్తుంది. దీనికి మూత్రాశయ ఇన్ఫెక్షన్, బ్లాడర్ ఇన్ఫెక్షన్ లేదా మూత్ర పిండాలలో రాళ్ళు కారణం కావచ్చు. గోనేరియా వంటి కొన్ని సుఖ వ్యాధుల వల్ల కూడా ఈ రకమైన మూత్రం రావచ్చు. యోని విడుదల చేసే మూత్రం కూడా తెల్లగా ఉండొచ్చు.

10. నలుపు
నలుపు రంగు రసాయనాలు, ఆరోగ్య సమస్యల వల్ల వస్తుంది. మీరు డాక్టర్ ని సంప్రదించి పరీక్ష చేయించుకోండి.



Click it and Unblock the Notifications











