Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
దగ్గు, జలుబు నివారించడానికి మీ ఇంట్లో ఉండే నేస్తాలు..
ఈ రోజుల్లో దగ్గు, జలుబు అనేది చాలా సాధారణ సమస్య. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, సహజ వ్యాధి నిరోధకత వంటివి కారణం అవుతాయి. సాధారణ జలుబు వల్ల ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, ముక్కు మూసుకుపోవడం జరుగుతుంది. సమస్య చిన్నదిగా కనిపించినా మన దినచర్యకు ఆటకం కలిగిస్తుంది. పనులు సజావుగా జరగనీయవు.
జలుబైనా, దగ్గు అయినా, ప్రారంభంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుని, నివారించుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల సమస్య మరింత తీవ్రం కాకుండా ఉంటుంది. అదే విధంగా ఈ సమస్య నివారణకు పిల్స్ వాడాల్సిన అవసరం లేదు. సిరప్ లు తాగాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వంటగదే మిని డ్రగ్ స్టోర్ వంటిది. ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను మన ఇంట్లోని డ్రగ్ స్టోర్ లోని పదార్థాలే గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి సాధారణంగా వచ్చే జలుబు, దగ్గును ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

అజ్వైన్:
అజ్వైన్ లేదా కారమ్ సీడ్స్ ఇది ఒక మెడిసినల్ స్పైసీ, ఇది పొడి దగ్గును నివారిస్తుంది. అజ్వైన్ ఒక పవర్ ఫుల్ రెస్పరేటరీ పదార్థం. ఇది శరీరంలోపల అసౌకర్యాన్ని తొలగిస్తుంది.

తులసి:
తులసి ఆకులు తినడం వల్ల సాధరణ జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసి ఆకులు వివిధ రకాల దగ్గు సిరఫ్ లలో వినియోగిస్తుంటారు. ఈ ఆకులు మ్యూకస్ బ్రొకైటిస్, ఆస్తమా నివారించడంలో సహాయపడుతుంది. బ్రొకనల్ ట్యూబ్ నుంచి కఫంను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తులసిని నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల గొంతునొప్పిని నివారిస్తుంది.

దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో మెడిసినల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కామన్ కోల్డ్ ను నివారిస్తుంది. అరచెంచా దాల్చిన చెక్కన పొడిని రెండు లేదా మూడు చెంచాల తేనెతో మిక్స్ చేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లి వ్యాధినిరోధకతను పెంచుతుంది, కామన్ కోల్డ్ అండ్ కఫ్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రోజు వారి వంటల్లో, సూప్స్ లో వెల్లుల్లి రెబ్బలను చేర్చితే కామన్ కోల్డ్ ను నివారించుకోవచ్చు.

అల్లం:
యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు నివారించడంలో అల్లం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అల్లం జ్యూస్ మ్యూకస్ (గల్ల) స్రవించడం నివారిస్తుంది. దగ్గు, గొంతు గరగర, గొంతనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లంముక్క నమలడం లేదా జింజర్ టీ తాగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

తేనె:
తేనెలో నయం చేసే గుణాలుండటం వల్ల సాధారణ దగ్గు, జలుబు నివారిస్తుంది. ఒక చెంచా తేనె తీసుకోవడం వల్ల అక్యూట్ కఫ్ ను నివారిస్తుంది. దీన్ని నిమ్మ జ్యూస్ లేదా జింజర్ జ్యూస్ తో కలిపి తీసుకోవచ్చు.

ఉల్లిపాయ:
ఉల్లిపాయ నేచురల్ డీ కంజెస్టెంట్, ఇది మూసుకుపోయిన ముక్కుకు ఉపశమనం కలిగించి నాజల్ ఫ్రీ చేస్తుంది. ఒక టీ స్పూన్ ఆనియన్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

పెప్పర్:
ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ కు ఒక టీస్పూన్ తేనె చేర్చి ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది

ఉప్పు:
ఉప్పు చాలా చౌకైనది, అంతే కాదు జలుబు దగ్గుకు ఒక మంచి హోం రెమెడీ . కొద్దిగా ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. గొంతులో అసౌకర్యం కలిగించే బ్యాక్టీరియా, ఫంగల్, ఇతర గొంతు అలర్జీలను నివారిస్తుంది.

పసుపు:
పసుపును వ్యాధులు నయం చేసే ఎల్లో గోల్డ్ గా చెబుతుంటారు. పసుపులో హీలింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉంటాయి. ఇది ఒక యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న పదార్థం. అక్యూట్ లేదా క్రోనిక్ కఫ్ నుంచి ఉపశమనం పొందడానికి ఒక గ్లాసు పాలలో కొద్దిగా పసుపు చేర్చి తీసుకోవాలి .



Click it and Unblock the Notifications











