Latest Updates
-
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!
థ్రోట్ పెయిన్ (గొంతునొప్పి)కి ఉపశమనం కలిగించే 8 సూపర్ ఫుడ్స్
సీజన్ తో సంబంధం లేకుండా కొంత మంది గొంతు నొప్పితో బాధపడుతుంటారు. సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష న్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి (త్రోట్ పెయిన్) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరి పడకపోవడం వల్ల, ఉపన్యాసాలు ఎక్కువగా ఇవ్వడం, విరామం లేకుండా పాటలు పాడటం వలన కొందరిలో గొంతునొప్పి వచ్చి వేధిస్తుంది. అయితే వీటిని నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. ఆహారంతో గొంతునొప్పి మాయం అవుతుందా అంటే అవుననే చెప్పచ్చొ. మీ గొంతు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు మీకు తెలియగానే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ప్రారంభించాలి. దాంతో గొంతు నొప్పి చెక్ పెట్టవచ్చు.
ముఖ్యంగా గొంతు నొప్పి బ్యాక్టిరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది కొన్ని సందర్భాల్లో కామన్ కోల్డ్ వల్ల వస్తుంది. డ్రైడ్ థ్రోట్ పెయిన్ కు యాంటీబయోటిక్స్ మరియు కొన్ని మెడిసిన్ నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే హిప్పోక్రిటిస్ ప్రకారం'ఆహారమే ఔషధము...ఔషదమే ఆహారం' అన్నారు. పిల్స్ తినడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించి, నేచురల్ రెమెడీస్ ను ట్రై చేయండి. గొంతు నొప్పిని నివారించుకోవడానికి 8ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్ ను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.
గొంతు నొప్పి నివారించడంలో వీటిని ప్రయోగాత్మకంగా ఉపయోగించి లిస్ట్ అవుట్ చేయబడినవి. ముఖ్యంగా ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ లో న్యూట్రీషియన్స్, విటమిన్స్, మినిరల్స్, పుష్కలంగా ఉండటం వల్ల గొంతు నొప్పి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. మరి గొంతు నొప్పి నివారించే ఆహారాలేంటో చూద్దాం...

వెల్లుల్లి:
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టిరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. డ్రగ్ స్టోర్స్ లోని యాంటీబయోటిక్స్ తీసుకోవడానికి బదులుగా ఈ నేచురల్ యాంటీబయోటిక్ తోనే గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు.

జింజర్ మరియు హనీ టీ:
ఈ ట్రెడిషినల్ టీ గొంతు నొప్పి నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టీలోని పవర్ ఫుల్ లక్షణాలు చాలా ఎఫెక్టివ్ గా ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది , ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు క్రమంగా నొప్పి తగ్గిపోతుంది.

చికెన్ సూప్:
గొంతు నొప్పి నివారించడంలో పురాత కాలం నుండి వాడుకలో ఉన్న హోం రెమెడీ. రుచికరంగా ఉండటం మాత్రమే కాదు, ఎఫెక్టివ్ గా గొంతు నొప్పిని మాయం చేస్తుంది. ఇందులో ఇన్ఫెక్షన్స్ ను నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పు చికెన్ సూప్ తాగడం వల్ల గొంతు నొప్పికి కారణమయ్యే రూట్స్ ను ఉపశమనం కలిగిస్తుంది.

ఆరెంజ్:
వైరల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఆరెంజ్ గ్రేట్ ఫుడ్ . ఇది గొంతు నొప్పిని చాలా బాధ్యతగా నివారిస్తుంది. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల వాపుతో పాటు నొప్పిని కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది

అరటిపండ్లు:
గొంతు నొప్పిని నివారించడంలో మరో ఎఫెక్టివ్ సూపర్ ఫుడ్ అరటిపండ్లు. అరటిపండ్లలో అనేక రకాలప్రయోజనాలున్నాయి . గొంతునొప్పిని నివారిస్తాయి . మరియు వాపును తగ్గిస్తాయి. విటమిన్స్ ను పుష్కలంగా అందిస్తాయి.

స్క్రాబుల్డ్ ఎగ్స్:
స్క్రాబుల్డ్ ఎగ్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి . గొంతు నొప్పి నివారించడంలో ఇది ఒక గ్రేట్ ఫుడ్ . అయితే వీటికి ఎక్కువ మసాలాలు జోడించకండా తయారుచేసుకొని తినాలి. ఎక్కువ మసాలాలు పడితే పరిస్థితి మరింత ఎక్కువైతుంది.

మష్రుమ్:
గొంతు నొప్పి, సహజంగా జలుబు మరియు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది . గొంతులోని ఇన్ఫెక్షన్ కు గురైన బాగాన్ని మష్రుమ్స్ గ్రేట్ గా నివారిస్తాయి . మష్రుమ్ లో గొంతు నొప్పిని నివారించే గుణాలు మెండుగా ఉన్నాయి.

సేజ్:
గొంతునొప్పిని నివారించే ఆహారాలో చివరిది సేజ్ లీవ్స్. ఇందులో హీలింగ్ ప్రొపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి . ఇన్ఫెక్షన్స్ తో పోరాడటంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. నొప్పిని నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
