Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నివారించే సింపుల్ హోం రెమిడీస్
మీరు రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్నారా ? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య వేధిస్తోందా ? అయితే డోంట్ వర్రీ. ఇది ప్రస్తుతం చాలా సాధారణంగా కనిపించే సమస్య. 35 ఏళ్లలోనే మీకు రుతుక్రమంలో సమస్యలు రావడం, లేటుగా నెలసరి రావడం, లేదా ఒక నెల రావడం మరో నెల రాకుండా ఉండటం వంటి లక్షణాలన్నింటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా చెప్పవచ్చు. ఈ సమస్యలకు కారణమేంటి ?
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు చాలా కారణాలున్నాయి. శారీరకంగా వీక్ గా ఉండటం, ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం, అన్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నివారించుకోవడానికి చాలా మంది గైనకాలజిస్ట్ లను కలుస్తూ ఉంటారు. వాళ్లిచ్చే మందుల కారణంగా.. రుతుక్రమం సరిగ్గానే ఉన్నప్పటికీ.. మందులు మానేసిన వెంటనే మళ్లీ సమస్య మామూలుగానే ఉంటుంది.
కాబట్టి గైనకాలజిస్ట్ ని సంప్రదించి మందులు తీసుకోవడం కంటే.. హోం రెమిడీస్ తో సమస్య నుంచి బయటపడటం మంచిది. ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుంటే.. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నివారించవచ్చు. ఎఫెక్టివ్ అండ్ పవర్ ఫుల్ హోం రెమిడీస్ ఇప్పుడు చూద్దాం..

దాల్చిన చెక్క
దాల్చిన చెక్క శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది రుతుక్రమం సజావుగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. ఒక కప్పుడు దాల్చిన చెక్క పొడి తీసుకుని.. వేడినీళ్లు కలపాలి. బాగా మిక్స్ చేసి, 10 నిమిషాల తర్వాత అందులో ఒక టీ బ్యాగ్ వేయాలి. రెండు మూడు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ పంచదార లేదా తేనె కలుపుకుని రోజూ తీసుకుంటే.. మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి.

బొప్పాయి
రుతుక్రమాన్ని రెగ్యులర్ చేయడంలో బొప్పాయి వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, కెరోటిన్, క్యాల్షియం, విటమిన్ ఏ, సి ఉంటాయి. గర్భాశయ గోడలకు చాలా మంచిది. మీకు పీరియడ్స్ రావాల్సిన కొన్ని రోజుల ముందు బొప్పాయి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఒక గిన్నె వేసి.. ఒక స్పూన్ పెరుగు కలపాలి. దీన్ని అల్పాహారంగా, లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో రోజూ తీసుకోవాలి. ఈ ఎఫెక్టివ్ రెమిడీ మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహాయపడుంది.

పసుపు
పసుపులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు.. మెనుస్ట్రియల్ పెయిన్ తగ్గించి.. సమయానికి రుతుక్రమం వచ్చేలా తోడ్పడుతుంది. పావు టీ స్పూన్ పసుపు తీసుకుని కప్పులో వేయాలి. అందులో కొద్దిగా బెల్లం, టీ స్పూన్ తేనె, గోరువెచ్చిన పాలు కలపాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి రోజూ తాగడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య నివారించవచ్చు.

అల్లం
మీకు పీరియడ్స్ చాలా లేటుగా రావడం, రక్తస్రావం తక్కువగా అవడం వంటి సమస్యలు ఉంటే.. అల్లం చక్కటి పరిష్కారం. అల్లం తురుములో కొంచెం నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టాలి. టీ స్పూన్ పంచదార వేసి బాగా మిక్స్ చేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే.. మీ సమస్య తగ్గిపోతుంది.

సోంఫ్
సోంఫ్ గింజల్లో మెడికల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి రుతుక్రమ సమస్యనైనా తగ్గిస్తాయి. ఒక గ్లాసు నీటిలో 2 టీ స్పూన్ల సోంఫ్ గింజలు కలపాలి. రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి.. తాగాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే.. సమస్య తగ్గిపోతుంది.

కాకరకాయ
చేదుగా ఉండే కాకరకాయ అంటే ఎవరూ ఇష్టపడరు. కానీ.. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. కాబట్టి కాకరయను ముక్కలుగా కట్ చేసి.. మిక్సీలో జ్యూస్ చేయాలి. ఒక టీ స్పూన్ పంచదార కలిపి వెంటనే తాగాలి. రెగ్యులర్ గా ఈ టిప్ ఫాలో అయితే.. మంచి ఫలితం ఉంటుంది.

నువ్వులు
నువ్వులు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇవి రుతుక్రమ సమస్యలను నివారిస్తాయి. ముందుగా నువ్వులను పౌడర్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ తేనెను ఈ నువ్వుల పొడికి చేర్చాలి. రెండింటిని బాగా మిక్స్ చేసి.. రోజూ తీసుకోవాలి.
చూశారుగా.. ఇంట్లో అందుబాటులో ఉండే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. మీకున్న రుతుక్రమ సమస్యలు నివారించవచ్చు. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications











