షుగర్ పేషంట్స్ డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాల్సిన హెర్బ్స్..!

By Swathi

కొన్నేళ్లుగా.. షుగర్ వ్యాధితో బాధపడే పేషంట్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డయాబెటిస్ అనేది ప్రస్తుత రోజుల్లో కామన్ డిసీజ్ గా మారిపోయింది. కాస్త వయసు పెరుగుతోంది అంటే చాలు.. షుగర్ వ్యాధి బారినపడుతున్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. లైఫ్ లాంగ్ ఉండే వ్యాధి. బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరగడం వల్ల డయాబెటిస్ సమస్య మొదలవుతుంది.

వార్నింగ్: నిర్లక్ష్యం చేయకూడని డయాబెటిక్ లక్షణాలు

ప్రస్తుత రోజుల్లో అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లు, వారసత్వం, వయసు, ఒబేసిటీ, స్మోకింగ్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా డయాబెటిస్ రావడానికి కారణమవుతున్నాయి. డయాబెటిస్ కారణంగా మెటబాలిజంపై దుష్ర్పభావం చూపుతుంది. చాలా అరుదైన సందర్భల్లో ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణమవుతుంది.

షుగర్ తో పాటు, రకరకాల వ్యాధులు నయం చేసే సత్తా మామిడాకులదే..!!

చాలా ఎక్కువగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతే.. ప్రాణానికే ముప్పు. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ డైట్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. డయాబెటిస్ ఉందంటే.. తీసుకునే ప్రతి ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే డయాబెటిస్ పేషంట్స్ లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే న్యాచురల్ హోం రెమిడీస్ ఏంటో తెలుసుకుందాం..

మెంతులు

మెంతులు

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో మెంతులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పురాతన కాలం నుంచి మెంతులను డైట్ లో చేర్చుకుంటున్నారు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ రెగ్యులర్ డైట్ లో మెంతులు చేర్చుకోవాలి.

తులసి

తులసి

తులసి ఆకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని వేగంగా తగ్గిస్తుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. ఇందులో ఉండే మెడికల్ గుణాల కారణంగా తులసి ఆకును చాలా ముఖ్యమైన మూలికగా ఆయుర్వేదం చెబుతుంది. రెగ్యులర్ గా తులసి ఆకు తింటూ ఉండటం వల్ల డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

ఫైటో న్యూట్రియంట్స్ ఉండటం వల్ల దాల్చిన చెక్క డయాబెటిక్ పేషంట్స్ కి అద్భుతమైన ఔషధం. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో చెక్క ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని స్టడీస్ చెబుతున్నాయి.

సోంఫ్

సోంఫ్

సోంఫ్ లో డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

రకరకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు నివారించడానికి వెల్లుల్లిని పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నాం. డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా ముఖ్యమైనది. రెగ్యులర్ గా వెల్లుల్లిని తీసుకుంటూ ఉండటం వల్ల ఇన్సులిన్ పెరిగి.. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

అల్లం

అల్లం

చిన్న అల్లం ముక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందట. ఇందులో ఉండే ఎంజైమ్.. డయాబెటిస్ తో పోరాడే సత్తా కలిగి ఉంటుంది.

జీలకర్ర

జీలకర్ర

జీలకర్రలో ఉండే గుణాలు.. బ్లడ్ షుగర్ లెవెల్స్ తో పాటు, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి జీలకర్రను డైట్ లో చేర్చుకుంటే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

లవంగాలు

లవంగాలు

లవంగాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ తో పోరాడే.. అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో ఉంటాయని చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఎక్కువకాలం రెగ్యులర్ గా లవంగాలను డయాబెటిక్ పేషంట్స్ తీసుకుంటూ ఉంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

పసుపు

పసుపు

డయాబెటిస్ తో పోరాడే దినుసుల్లో పసుపు ఒకటి. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గునాలు డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తాయి.

Story first published: Friday, May 13, 2016, 19:00 [IST]
Desktop Bottom Promotion