Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
అమితాబ్ ఫ్యామిలీకి కరోనావైరస్ ఎలా సోకిందంటే...
అమితాబ్ బచ్చన్ మరియు అతని ఫ్యామిలీకి కరోనా వైరస్ ఎలా సోకిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా వైరస్ గురించి ఎవరైతే సెలబ్రెటీలు జాగ్రత్తలు చెబుతున్నారో.. వారినే అటాక్ చేసింది కరోనా వైరస్. కోవిద్-19 పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని భారతీయ సూపర్ స్టార్స్ అందరూ కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు.

నిత్యం చేతులను కడుక్కోండి. బయటికెళ్లే సమయంలో మాస్కులు వేసుకోండి.. ప్రభుత్వ సూచనలను పాటించండంటూ నిత్యం సోషల్ మీడియాలో చెబుతూ ఉండే అమితాబ్ బచ్చన్ కూడా కరోనా బారిన పడ్డాడు.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. తనతో పాటు తన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే తన భార్యకు మాత్రం నెగిటివ్ రావడం విశేషం.

అయితే అన్ని జాగ్రత్తలు చెప్పే అమితాబ్ ఫ్యామిలీకి కరోనా వైరస్ ఎలా సోకింది? అసలు ఆయన ఇంటినుండి కాలు బయటపెట్టకుండానే కరోనా వైరస్ ఎలా వచ్చిందని చాలా మంది అభిమానులు సందేహిస్తున్నారు. అయితే దీని వెనుక చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉందనే చెప్పొచ్చు. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

లాక్ డౌన్ తర్వాత..
ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఇల్లు వదిలి బయటికే రాలేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు.

కౌన్ బనేగా కరోడ్ పతి..
అయితే ఒక్కసారి మాత్రం కౌనే బనేగా కరోడ్ పతి షూటింగ్ ప్రారంభమయ్యాక, ముంబైలోని ఓ స్టూడియోలో జరిగిన కార్యక్రమానికి సైతం అన్ని జాగ్రత్తలు తీసుకునే అమితాబ్ హాజరయ్యాడు. ఎందుకంటే తనే ఈ సీజన్ కు హోస్ట్ కాబట్టి.

అప్పుడే వచ్చిందని..
అయితే అమితాబ్ ఎప్పుడైతే ఆ కార్యక్రమానికి హోస్ట్ గా వెళ్లాడో అప్పుడే తనకు కరోనా వచ్చి ఉంటుందని తన సన్నిహితులు అంచనా వేస్తున్నారు.

అమితాబ్ ద్వారానే..
ముందుగా అమితాబ్ బచ్చన్ కు సోకిన కరోనా వైరస్, తన ద్వారానే తన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

సెల్ఫ్ క్వారంటైనులో..
అయితే కరోనా వైరస్ కారణంగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన అమితాబ్ ఫ్యామిలీ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య మాత్రం ఇంట్లోనే ఉంటూ సెల్ఫ్ క్వారంటైన్ తీసుకుంటున్నారు.

వీడియో ద్వారా సందేశం..
ఇదిలా ఉండగా అమితాబ్ కరోనా వచ్చిన సందర్భంగా ఓ వీడియో ద్వారా సందేశం ఇస్తూ.. ‘కరోనా గురించి అందరిలోనూ తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఎవరూ భయపడొద్దని, నిరాశ అసలు చెందొద్దని, ఇలాంటి సమయంలో మనందరం కలిసి పోరాడాలని, అలా చేస్తేనే ఈ పరిస్థితి నుండి బయటపడగలమని, నాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలని, ఇలాగే మీరు సేవలు అందిస్తే, దేశమంతా వైద్యులను ఎంతో ప్రేమ, గౌరవాలతో చూస్తుంది. వైద్యులందరూ మానవత్వంతో పని చేస్తున్నారు. వారు ప్రస్తుతం ప్రాణదాతలుగా మారారు. వారికి చేతులెత్తి దండం పెడుతున్నానని, వారు లేకపోతే మనషులంతా ఏమైపోయేవారో. ప్రస్తుత పరిస్థితులు గడ్డుగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందరూ ధైర్యంగా పోరాడి ముందుకెళ్లాలని'చెప్పారు.

అమితాబ్ కోలుకోవాలని..
అయితే అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.



Click it and Unblock the Notifications
