Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
నచ్చిన అమ్మాయికి తమ ప్రేమను వ్యక్తపరచడం చాలా కష్టం. వారి సమాధానం ఎలా ఉంటుందో.. ఎలా రియాక్ట్ అవుతారో అని అబ్బాయిలు హైరానా పడిపోతుంటారు. దీంతో ధైర్యంగా మన మనసులోని మాటను చెప్పడానికి భయపడుతుంటారు. అయితే మీ క్రష్‌కి మీరు ప్రేమను చెప్పినా చెప్పకపోయినా వారు మీతో లవ్‌లో పడిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలని అంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు..

కాలేజ్, ఆఫీస్ ఇలా ప్లేస్ ఏదైనా ప్రతి ఒక్కరి జీవితంలో క్రష్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందం, క్యారెక్టర్, నడవడిక ఇలా ఎదుటి వ్యక్తిలో నచ్చే ఏదో ఒక అంశం వారిని కట్టిపడేస్తుంది. దీంతో వారితో ప్రేమలో పడిపోతారు. అయితే తమ లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తే వారు యాక్సెప్ట్ చేస్తారా.. రిజెక్ట్ చేస్తారా అనే డైలామాలో ఉండిపోతారు. దీంతో కొందరు తమ ప్రేమను చెప్పకుండా లోపల దాచుకున్న వారు కొందరైతే.. మరికొందరు ధైర్యంగా చెప్పేసి వారి ఆన్సర్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మీరు నచ్చిన వ్యక్తి మీతో ప్రేమలో పడేలా చేయాలంటే 'NALA’ అనే ట్రిక్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
NALA అంటే
N- నో ఫ్రెండ్స్ జోన్
మీరు ప్రేమించిన వ్యక్తి మీకు అంతకుముందు పరిచయం లేకపోతే వారితో మాట్లాడేందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రెండ్ జోన్‌లో ఉండకూడదు. కొందరు ఫ్రెండ్‌లో లవర్‌ను చూడలేరు. అందుకే మీ క్రష్‌తో మీరు ఫ్రెండ్‌లా మూవ్ అవ్వకుండా మీ ఇష్టాన్ని వారికి తెలియజేసేందుకు ప్రయత్నించండి..
A- లెస్ అవైలబిలిటీ
నచ్చిన అమ్మాయి ఫోన్ చేసినా, కలవాలని చెప్పినా క్షణం ఆలస్యం చేయకుండా వారి కోసం పరుగులు తీస్తుంటారు. ఇది సరైంది కాదని నిపుణులు అంటున్నారు. వారు అడిగినప్పుడల్లా మీరు అందుబాటులో ఉంటే మీరూ పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్నారనే ఉద్దేశం వారిలో ఏర్పడుతుంది. అందుకే మీ ప్రేమ గెలవాలంటే మీ క్రష్‌కి మీరు ఎంత తక్కువగా అందుబాటులో ఉంటే అంత మంచిది.

L- లెవెల్ అప్
మీ మనసు దోచిన యువతి మీతో ప్రేమలో పడాలంటే.. ముందు మీరు గుణగణాల పరంగా ఉన్నత స్థాయిలో ఉంటాయి. కెరీర్ పరంగా మీకంటూ కొన్ని ఆలోచనలు ఉండాలి. వాటిని అమలు చేయగలగాలి. జీవితం పట్ల ఒక లక్ష్యం, అవగాహన ఉన్నవారికి అమ్మాయిలు ఇట్టే పడిపోతారు.
A- యాక్సెప్ట్
మీకు ఆ అమ్మాయి నచ్చినంత మాత్రాన.. మీరూ తనకి నచ్చాలని రూలేం లేదు. మీలో ఎన్ని సుగుణాలు ఉన్నా కొన్ని సందర్భాల్లో వారు ప్రేమను యాక్సెప్ట్ చేయలేరు. ఇలాంటి సందర్భం మీకు తలెత్తినప్పుడు మీరు దానిని పాజిటివ్‌గా, స్పోర్టివ్‌గా తీసుకోగలగాలి. అప్పుడే మీరు జీవితంలో ముందడుగు వేస్తూ డిప్రెషన్‌కి గురవకుండా ఉంటారు.
ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసిపోదు. మీ జీవితంలో మీకు నచ్చే సోల్‌మేట్ తప్పకుండా దొరుకుతుందని గుర్తుంచుకోవాలి. ఈ రూల్స్, ట్రిక్స్ అమ్మాయిలకూ వర్తిస్తాయని గమనించాలి. జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులు, గెలుపోటములను, కష్టసుఖాలను తట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి.



Click it and Unblock the Notifications
