Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
ఫోన్‌లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.!
స్మార్ట్ ఫోన్ లేకుండా రోజు గడవడం చాలా కష్టం. ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఐదు నిమిషాలకోసారి ఫోన్ చెక్ చేసుకోవాల్సిందే.. ఒక చేత్తో పనిచేస్తూ ఇంకో చేత్తో రీల్స్, వీడియోలు చూడటం అలవాటుగా మారిపోయింది. ఇక పెద్దలతో పాటు పిల్లల్లో కూడా ఇదే ధోరణి అలవాటైంది. పాలిచ్చే తల్లులు కూడా ఓ వైపు ఫీడింగ్ ఇస్తూనే ఫోన్‌ను చూస్తున్నారు. అయితే బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఇలా ఫోన్ చూడటం మంచిదేనా.. నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రతి ఏటా ఆగష్టు 1 నుంచి 7వ తేదీ తల్లిపాల వారోత్సవాలు జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగా తల్లి పాల ప్రాముఖ్యత, తల్లీబిడ్డ ఆరోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులు వీటిపై ఈ వారమంతా అవగాహన కల్పిస్తారు. పిల్లలకు బలమైన రోగ నిరోధక వ్యవస్థతో పాటు కీలక పోషకాలను తల్లి పాలు అందిస్తాయి. అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగాక చాలా మంది తల్లులు పాలిచ్చే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారు.
శిశువు ఇచ్చే సంకేతాలు
బిడ్డకి పాలిచ్చేటప్పుడు తల్లి మొబైల్ ఫోన్ చూడటం ఇద్దరి ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. తల్లి దృష్టి మొత్తం స్క్రీన్‌పైన ఉండటంతో పాటు బిడ్డతో భావోద్వేగ బంధం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కంటి చూపు తగ్గుతుంది. పాలిచ్చే సమయంలో ఫోన్ చూస్తూ ఉండటం వల్ల శిశువు ఇచ్చే సంకేతాలను తల్లి గుర్తించలేదు. బిడ్డ ఆకలిగా ఉన్నా, కడుపు నిండినా, పాలు తాగాక త్రేనుపులు అవసరమైనా బిడ్డ ఇచ్చే సిగ్నల్స్‌ను తల్లి విస్మరించవచ్చు.

మానసిక ఒత్తిడి
ఫోన్ ధ్యాసలో ఉండటం వల్ల పాలిచ్చేటప్పుడు ఒడిలో తల్లి సరిగ్గా పట్టుకోకపోవచ్చు. సరైన భంగిమలో బిడ్డ ఒడిలో ఉండకపోతే తల్లికి చనుమొన నొప్పి, పాలు తక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పాలిచ్చేటప్పుడు ఇబ్బందులు కలగవచ్చు. ఫోన్ స్క్రీన్ కాంతి కారణంగా విశ్రాంతికి భంగం కలిగి మానసిక ఒత్తిడి పెరగవచ్చు.
తల్లి స్పర్శ
బిడ్డ చనుబాలు తాగేటప్పుడు తల్లి జోలపాడుతూ, ముచ్చట్లు చెబుతూ, తల నిమురుతూ ఉంటుంది. ఫోన్ చూడటం వల్ల ఆ ధ్యాసలో పడి తల్లి స్వరం, చిరునవ్వు, దృష్టి బిడ్డపైన పడవు. దీంతో ఇద్దరి మధ్యా భావోద్వేగ బంధంపైన ప్రభావం చూపిస్తుంది. సరైన సమయంలో తల్లి స్పర్శను ఆస్వాదించలేరు. శిశువు అసౌకర్యాన్ని గుర్తించలేరు.
పరధ్యానంలో శిశువు పాలు తక్కువగా లేదా ఎక్కువగా తాగే ప్రమాదం ఉంది. దీంతో బిడ్డ ఎదుగుదలపైన ప్రభావం పడుతుంది. ఏడాది లోపు పిల్లలకు తల్లి స్పర్శ, శిశువు ఇచ్చే సంకేతాలకు తల్లి స్పందించడం చాలా కీలకం. ఇది పిల్లల్లో మెదడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఏం చేయాలి..
పాలిచ్చేటప్పుడు తల్లులు మొబైల్ ఫోన్‌ను సైలెంట్‌లో ఉంచడం లేదా దూరంగా ఉంచడం చేయాలి. పిల్లల కళ్లలోకి చూస్తూ వారితో నవ్వుతూ సంభాషిస్తూ ఉండటం ద్వారా మెదడు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందుతుంది. పాలిచ్చే సమయంలో అత్యవసరమైన ఫోన్ కాల్స్ వస్తే తక్కువ సమయం మాట్లాడి కాల్ కట్ చేయండి. బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. రాత్రిపూట బెడ్ లైట్ వెలుతురు ఉంచండి. ఫోన్ తప్పనిసరిగా వాడాల్సి వస్తే బ్రైట్‌నెస్ తగ్గించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
