Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
దీపావళి రాత్రి ఈ పని చేయకపోతే..శాశ్వతంగా చెవిటివారు అయిపోవడం ఖాయం!
దేశవ్యాప్తంగా ఇవాళ(అక్టోబర్ 20) దీపావలి సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే టపాసుల మోత మోగుతోంది. క్రాకర్స్ కోసం షాపులు,దుకాణాల దగ్గరకు జనం బారులు తీరారు. దీపావళి నాడు క్రాకర్స్ లేదా టపాసులు కాల్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే చెవిటివారు అయిపోవడం ఖాయం. చెవులు చిల్లులుపడేలా మోగే బాణసంచా శబ్దాలు ఒక నిశ్శబ్ద శత్రువులా మన ఆరోగ్యంపై, ముఖ్యంగా మన వినికిడి శక్తిపై తీవ్రమైన దాడి చేస్తాయి కాబట్టి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.
చెవి లోపల ఏం జరుగుతుంది?
మనశరీరంలో అత్యంత సున్నితమైన అవయువాలుగా చెవులు ఉంటాయి. లోపలి చెవిలో కోక్లియా అనే భాగంలో వేలాది సూక్ష్మమైన వెంట్రుకల వంటి కణాలు ఉంటాయి. ఇవి బయటి ప్రపంచంలోని ధ్వని తరంగాలను గ్రహించి, వాటిని విద్యుత్ సంకేతాలుగా మార్చి మన మెదడుకు పంపుతాయి. అప్పుడే మనం శబ్దాలను వినగలుగుతాం. దీపావళి రాత్రి పేల్చే కొన్ని పెద్ద పటాకుల శబ్దం 140 డెసిబుల్స్ దాటిపోతుంది. ఇది ఒక జెట్ విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు వచ్చే శబ్దంతో సమానంగా చెప్పవచ్చు. ఇంతటి తీవ్రమైన శబ్ద కంపనాలకు ఆ సున్నితమైన కణాలు దెబ్బతింటాయి లేదా శాశ్వతంగా నాశనమవుతాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే..ఒక్కసారి నశించిన ఈ కణాలు తిరిగి పుట్టవు. దీనినే శబ్ద ప్రేరిత వినికిడి నష్టం (NIHL) అంటారు. ఇది మనల్ని శాశ్వత చెవిటితనంలోకి నెట్టేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

టిన్నిటస్..మొదటి హెచ్చరిక గంట
బాణసంచా మోతలకు గురైన తర్వాత చాలామంది చెవుల్లో గింగురు మని లేదా ఏదో హోరులా శబ్దం రావడం గమనించి ఉంటారు. దీనినే టిన్నిటస్ అంటారు. ఇది మీ చెవిలోని సున్నితమైన కణాలు ప్రమాదంలో ఉన్నాయని శరీరం పంపే మొదటి హెచ్చరిక. మొదట్లో ఇది తాత్కాలికంగానే ఉన్నా, తరచూ ఇలాంటి పెద్ద శబ్దాలకు గురైతే ఈ సమస్య శాశ్వతంగా మారి మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది.
వీరిపైనే ప్రభావం ఎక్కువ
పెద్దలతో పోల్చితే ఎదుగుతున్న పిల్లల చెవి నిర్మాణాలు మరింత సున్నితంగా ఉంటాయి. అందువల్ల పెద్ద శబ్దాలు వారి వినికిడి శక్తిని సులభంగా దెబ్బతీస్తాయి. అలాగే వయసు పైబడిన వారిలో ఇప్పటికే వినికిడి సమస్యలు ఉండే అవకాశం ఉంటది. ఈ పటాకుల శబ్దం వారి సమస్యను మరింత జఠిలం చేస్తుంది.
ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
దీపావళి పండుగను ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవడానికి కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూడండి.
-బాణసంచా కాల్చే ప్రదేశంలో ఉన్నప్పుడు ఇయర్ ప్లగ్‌లు లేదా శబ్దాన్ని నిరోధించే హెడ్ ఫోన్స్ వాడండి.
- పటాకులు పేలుతున్న చోటికి వీలైనంత దూరంగా ఉండండి. దూరం పెరిగేకొద్దీ శబ్ద తీవ్రత తగ్గుతుంది.
- పిల్లలను నేరుగా పటాకుల శబ్దానికి దగ్గరగా ఉంచవద్దు. వారి చెవులను మీ చేతులతో లేదా దూదితో సున్నితంగా మూయండి.
-పటాకుల శబ్దం తర్వాత చెవి నొప్పి లేదా టిన్నిటస్ లక్షణాలు తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెవి, ముక్కు, గొంతు నిపుణులని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
