Latest Updates
-
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.?
ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ పనిచేస్తున్నారా?.. ఈ రిస్క్ తప్పదు.!
వేసవికాలంలో శరీరం తరచూ డీహైడ్రేషన్‌కి గురవుతూ ఉంటుంది. శరీరానికి సరిపడా నీరు అందకపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే కొందరు ఎండలో బయటకు వెళ్లిన వచ్చిన వెంటనే దాహంతో చాలా చల్లటి నీరు బాటిల్ మొత్తం తాగేస్తుంటారు. అలా చేస్తే డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటాం అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు అని జాతీయ ఆరోగ్య మిషన్ హెచ్చరిస్తోంది. శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ఆ నీటిని తీసుకునే విధానం కూడా సరిగా ఉండాలని సూచిస్తుంది. అదెలా అంటే..

ఎండలో నుంచి బయటకు రాగానే ఫ్రిజ్‌లోని చాలా చల్లటి నీరు తాగితే వెంటనే ఉపశమనం పొందినట్లు అనిపిస్తుంటుంది. కానీ ఇది అప్పటికి రిలీఫ్ అనిపించినా ఆరోగ్యానికి మంచిది కాదని జాతీయ ఆరోగ్య మిషన్ చెబుతోంది. దీని వల్ల శరీరంపై ఒక్కసారిగా చెడు ప్రభావం చూపిస్తుందని.. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి సూచిస్తోంది.
ఎండలో తిరిగినప్పుడు శరీరం వేడి ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వెంటనే కూల్ వాటర్ తాగితే బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా మారిపోతుంది. దీంతో శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి పొత్తి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎండలో తిరిగిన వెంటనే ఐస్ నీరు తాగడం వల్ల మీ గొంతు మీద కూడా ప్రభావం చూపించవచ్చు. శరీర ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా హెచ్చుతగ్గుల వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో నీరసంగా అనిపించడం, తల తిరగడం వంటి సమస్యలు కూడా చోటుచేసుకుంటాయి.
ఏం చేయాలి
వేసవిలో బయట నుంచి ఇంటికి వచ్చాక వెంటనే నీరు తాగకూడదు. కనీసం 10 నుంచి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అప్పటిలోగా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుతుంది. చెమట తగ్గి, శ్వాస నార్మల్‌కి రాగానే నీరు తాగడం మంచిది. అయితే అప్పుడు కూడా ఒకేసారి నీరు తాగకుండా గుక్కెడు చొప్పున తాగుతూ మెల్లగా తీసుకోవాలి. అప్పుడే మెటబాలిజంపై ప్రభావం పడదు.

ఇంకా ముఖ్యంగా చల్లటి నీరు తాగకుండా గది ఉష్ణోగ్రతలోని నీరు తాగితే శ్రేయస్కరం. ఇది ఆరోగ్యానికి మంచిది. సాధారణ నీటిని శరీరం త్వరగా గ్రహించి రక్తనాళాలు కుచించుకుపోకుండా కాపాడుతుంది. లేదంటే ఒక్కసారిగా చల్లటి నీరు తాగడం ద్వారా రక్త ప్రసరణపై ప్రభావం చూపిస్తుంది.
ప్రధానంగా ఎండలో నుంచి ఇంటికి రాగానే వెంటనే ఫ్యాన్ లేదా ఏసీ గాలిని ఆస్వాదించకండి. శరీరంలోని చెమట పూర్తిగా ఆవిరైన తర్వాత గాలిని ఆస్వాదించాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వడదెబ్బ, డీహైడ్రేషన్, నీరసం వంటి సమస్యలను కాపాడుకోవచ్చు.
మండుతున్న ఎండల దృష్ట్యా వేసవిలో బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. దాహం వేసినా వేయకపోయినా తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇంకా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, తాజా పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేడెట్‌గా ఉంటుంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తరచుగా ఈ ద్రావణాలను తీసుకుంటూ ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
