Latest Updates
-
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మరణాల కలకలం.. ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ.!
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని జనాలు పూర్తిగా మరిచిపోకముందే మళ్లీ అలజడి సృష్టించడానికి సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి కొవిడ్ సంబంధిత మరణాలు నమోదైనట్లుగా వార్తలు వ్యాపిస్తున్నాయి. కడప జిల్లాలో ఇటీవల ఇద్దరు కరోనా బారిన పడి మరణించారని.. మరో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఆంధ్రప్రదేశ్ గవర్నెమెంట్ ఫ్యాక్ట్ చెక్(FactCheck.AP.Gov.in) స్పందించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కొవిడ్ కలకలం అంటూ ప్రభుత్వానికి ఇంత వరకు సమాచారం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. దురదృష్టకర సంఘటనలను తప్పుడు ప్రచారానికి వాడుకోవడం సమంజసం కాదని పేర్కొంది. ప్రజా భద్రతకు భంగం కలిగించాలని చూడటం చట్టరీత్యా నేరం అవుతుందని హెచ్చరించింది.
తాజాగా కడప జిల్లాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కేసుల సంఘటనలపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకుంటోందని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. సీనియర్ వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నారని పేర్కొంది. మరోవైపు వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలికంగా మద్యపానం తదితర కారణాలతో ఇటీవల సంభవించిన మరణాలపై ప్రభుత్వ వైద్య కళాశాల, కడప, సూక్ష్మజీవ శాస్త్ర విభాగం వైరల్ పరిశోధన మరియు నిర్ధారణ ప్రయోగశాల ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని.. దాని ఆధారంగా తదుపరి చర్యలను ప్రభుత్వం పటిష్ఠంగా చేపడుతోందని వివరించింది. ఈ మేరకు కడప జిల్లాలో నమోదైన అనుమానాస్పద కేసుల వివరాలను వెల్లడించింది.

1. ఎన్. సుబ్బరాయుడు(52) – మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో 2026 జూన్ 28న మరణించారు.
2. వీరారెడ్డి (66)– డయాబెటిస్, హైబీపీతో బాధపడుతూ తీవ్ర స్థితిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం కోలుకుని 2026 జులై 4న తిరుపతికి డిశ్చార్జ్ అయ్యారు.
3. జి. కొండయ్య(67) – డయాబెటిస్, క్షయవ్యాధితో బాధపడుతున్నారు. గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన చరిత్ర ఉంది. ప్రస్తుతం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
4. సయ్యద్ మబాషా (43) – దీర్ఘకాలిక మద్యపాన అలవాటు కారణంగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2026 జులై 7న మరణించారు.
5. అక్షత్(25) – ఇతర అనారోగ్య సమస్యలు నిర్ధారణ కాలేదు. స్వల్ప లక్షణాలతో ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారు.
కాగా, కొవిడ్ పాజిటివ్‌గా నమోదైన అన్ని కేసులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారని.. అయితే ఎవరికి కూడా ఇటీవల ప్రయాణ చరిత్ర లేనట్లు తేలిందని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఈ క్రమంలో జిల్లాలో స్థానిక స్థాయిలోనే వైరస్ వ్యాప్తి జరిగి ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా నమోదైన కేసుల్లో ఒకరు ప్రభుత్వ వైద్య కళాశాల కడపలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. అతను అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్ వైద్య విద్యార్థి అని.. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండి ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారని వివరించింది.
ఈ క్రమంలో ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వైరస్‌లో కొత్త రూపాంతరాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాధుల తీవ్రత, మరణాల నేపథ్యంలో సంబంధిత వ్యక్తుల నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పూర్తి జన్యు విశ్లేషణ కోసం పంపించింది. ఈ మేరకు రోగులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించి విస్తృత స్థాయిలో కాంటాక్ట్ ట్రేసింగ్ చేపడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.
కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఐసోలేషన్ కేంద్రాలతో పాటు ఇంటి వద్దే ఐసోలేషన్ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు ఆస్పత్రి ప్రాంగణాల్లో పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.



Click it and Unblock the Notifications
