Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే!
మానవ శరీర నిర్మాణానికి ప్రోటీన్ ఒక పునాదిరాయి లాంటిది. కండరాలను దృఢంగా మార్చడానికి, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి, దెబ్బతిన్న కణజాలాలను మరమ్మత్తు చేయడానికి, అలాగే వ్యాధులతో పోరాడే బలమైన రోగనిరోధక శక్తిని అందించడానికి ప్రోటీన్ అత్యంత అవసరం. సాధారణంగా ప్రోటీన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది గుడ్డు.

రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి చాలామంది గుడ్లను తింటుంటారు. కానీ మన దేశంలో కఠినమైన శాకాహారం పాటించే చాలామంది గుడ్లు తినరు. మరి వారు తమ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ను ఎలా పొందాలి? అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. శాకాహారుల కోసం ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయని, వాటిలో కొన్ని గుడ్ల కంటే కూడా ఎన్నో రెట్లు అధిక ప్రోటీన్‌ను అందిస్తాయని ప్రముఖ డాక్టర్ సలీమ్ జైదీ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు. గుడ్డు కంటే ఎక్కువ ప్రొటీన్ అందించే శాఖాహార ఫుడ్స్ ఏవో ఇక్క చూడండి.
పప్పులు, కాయధాన్యాలు
భారతీయుల రోజువారీ భోజనంలో పప్పులు లేని ఇల్లు ఉండదు. ఇవి ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. ఒక కోడిగుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటే, 100 గ్రాముల వండిన కాయధాన్యాల ద్వారా ఏకంగా 9 గ్రాముల ప్రోటీన్ మనకు లభిస్తుంది. మీరు పూర్తి స్థాయి శాకాహారి అయితే, మీ రోజువారీ ఆహారంలో పప్పులను తప్పకుండా చేర్చుకోండి. ఇవి ప్రోటీన్ ను మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన ఇతర పోషకాలను కూడా పుష్కలంగా అందిస్తాయి.
సోయాబీన్స్
శాకాహార ప్రోటీన్ వనరులలో సోయాబీన్స్ ను రారాజు అని చెప్పవచ్చు. ఒక గుడ్డు ద్వారా కేవలం 6 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తుండగా, ఆశ్చర్యకరంగా 100 గ్రాముల సోయాబీన్స్ ద్వారా ఏకంగా 52 గ్రాముల భారీ ప్రోటీన్ అందుతుంది. జిమ్ చేసేవారికి, కండరాలు పెంచాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
రాజ్మా
చూడటానికి కిడ్నీ ఆకారంలో ఉండి, ఎంతో రుచికరంగా ఉండే రాజ్మాలో కూడా ప్రోటీన్ మెండుగా ఉంటుంది. 100 గ్రాముల వండిన రాజ్మాలో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించడంలో రాజ్మాను మించినది లేదు.

కాబూలీ శనగలు
రుచికరమైన ఛోలే కూరను ఇష్టపడని వారు ఉండరు. ఈ శనగలు ప్రోటీన్ కు పవర్‌హౌస్ లాంటివి. 100 గ్రాముల శనగల్లో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా ఇందులో ఫైబర్ (పీచు పదార్థం), కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఒక దివ్యౌషధం లాంటివి.
క్వినోవా
ఇటీవలి కాలంలో ఆరోగ్య నిపుణులు ఎక్కువగా సిఫార్సు చేస్తున్న సూపర్ ఫుడ్ క్వినోవా. 100 గ్రాముల వండిన క్వినోవాలో సుమారు 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డుతో పోలిస్తే ఇందులో ప్రోటీన్ కొద్దిగా తక్కువే అయినప్పటికీ, ఇది ఒక కంప్లీట్ ప్రోటీన్(శరీరానికి కావాల్సిన అన్ని అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి). పైగా ఇందులో ఫైబర్,మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే శాకాహారులకు ఇది అద్భుతమైన ఎంపిక.
కాబట్టి గుడ్లు తినడం లేదని శాకాహారులు ఇకపై ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ ఆహారంలో పప్పులు, సోయా, రాజ్మా, శనగలు, మరియు క్వినోవా లాంటివి భాగం చేసుకుంటే, మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ మరియు పూర్తి ఆరోగ్యం మీ సొంతం అవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
