Latest Updates
-
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్‌లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.?
టీ, కాఫీలు తాగితే మద్యం మత్తు పోతుందా? ఎంతసేపటికి ఆల్కహాల్ ప్రభావం తొలగిపోతుంది?
మద్యం సేవించడం వల్ల మత్తు వస్తుంది. మాటలు తడబడతాయి, చూపు మసకబారుతుంది, పట్టు కోల్పోతారు, సరిగ్గా నడవలేరు, తూగుతారు ఇంకా చాలా రకాలుగా మత్తు శరీరంపై ప్రభావం చూపిస్తుంది.
మద్యం సేవించిన తర్వాత టీ, కాఫీలు తాగితే మత్తు దిగిపోతుందని చాలా మంది అనుకుంటారు. మరి నిజంగానే మత్తు వదిలించుకునేందుకు కాఫీ తాగితే ప్రయోజనం ఉంటుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

మత్తు ఎలా ఎక్కుతుంది:
మద్యం అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే డిప్రెసెంట్. మద్యం సేవించినప్పుడు అది కడుపు, చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోకి చేరుతుంది. కాలేయానికి చేరుకున్న ఆల్కహాల్ జీవక్రియ చేయబడుతుంది. లివర్ గంటకు నిర్దిష్ట మొత్తంలో ఆల్కహాల్‌ను మాత్రమే జీవక్రియ చేస్తుంది. మెటబాలిజం కానీ ఆల్కహాల్ రక్తంలో ఉంటుంది. ఆల్కహాల్ మత్తు లక్షణాలు.. ఎంత తాగుతున్నాం, శరీర బరువు, జీవక్రియ సామర్థ్యం, ఆల్కహాల్ టొలెరెన్స్ పై ఆధారపడి ఉంటుంది. బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్‌ట్రేషన్-BAC ద్వారా రక్తంలో ఆల్కహాల్ మొత్తాన్ని కొలుస్తారు.
అందరికీ ఒకేలా మత్తు ఎందుకు ఎక్కదు:
ఆల్కహాల్ ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. కొందరు ఎంత తాగినా స్టడీగా ఉంటారు. మరికొందరు కాస్త తాగగానే తూగుతుంటారు. శరీర బరువు, లివర్ కండిషన్, జీవక్రియల వేగం, ఆల్కహాల్ టొలెరెన్స్, మానసిక ఒత్తిడి వంటి పలు అంశాలపై మత్తు ప్రభావం ఆధారపడి ఉంటుంది.
మద్యం మత్తును కాఫీ ఎలా ప్రభావితం చేస్తుంది:
టీ, కాఫీలు ఆల్కహాల్ మెటబాలిజంను ప్రభావితం చేయవు. అంటే కాఫీ తాగడం వల్ల మత్తు పోవడం జరగదు. టీ, కాఫీలు తాగితే చురుకుగా అనిపిస్తుంది. అందులోని కెఫిన్ వల్ల అలా అనిపిస్తుంది. కానీ కెఫిన్ ఆల్కహాల్‌పై ఎలాంటి ప్రభావం చూపదు.
మత్తు త్వరగా దిగిపోవడానికి, ఆల్కహాల్ ప్రభావం తగ్గించడానికి ఎలాంటి మార్గాలు లేవు. టీ, కాఫీలు తాగడం, చల్లని నీటిని మీద కుమ్మరించడం, ఐస్ క్రీమ్ తినడం, పెరుగు తాగడం లాంటి వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదని వైద్యలు చెబుతున్నార. ఎంత సమయం పాటు రక్తంలో ఆల్కహాల్ ఉంటుందనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం లేదు.
నిద్రపోతే మత్తు దిగిపోతుందా?
రాత్రి తప్పతాగి రాత్రంతా నిద్రపోయి తెల్లారి లేచే సరికి మద్యం మత్తు మొత్తం దిగిపోతుందా అంటే కాదనే చెప్పాలి. నిద్రకు రక్తంలో కలిసిన ఆల్కహాల్ కు ఎటువంటి సంబంధం లేదు. నిద్రపోయి లేచినంత మాత్రాన శరీరంపై, మెదడు పనితీరుపై ఆల్కహాల్ ప్రభావం తగ్గిపోదు. శరీర బరువు, జీవక్రియ వేగం, ఆల్కహాల్ టొలెరెన్స్ వల్ల మాత్రమే మత్తు దిగుతుంది.
Disclaimer: Alcohol Drinking Is Injurious To Health.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications