Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
టైట్ బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? షాకింగ్ నిజం తెలుసుకోండి
పురుషులతో పోల్చితే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోనే అనేక అపోహలు, అనవసర భయాలు తెరమీదకు వస్తుంటాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే..రోజంతా బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనే భయం. చాలా టైట్ గా ఉండే బ్రా వేసుకుంటే బాడీలోని విషపదార్థాలు బయటకు వెళ్లకుండా నిలిచిపోయి..క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని నమ్ముతారు. అయితే ఇందులో నిజం ఎంత? ఈ ప్రచారానికి శాస్త్రీయ ఆధారం ఉందా? వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.
ఇందులో నిజమెంత
వాస్తవానికి బ్రా, క్యాన్సర్ కు ముడిపెడుతూ జరుగుతున్న ఈ ప్రచారం ఇప్పటిది కాదు. దీని మూలాలు 1995లో ప్రచురితమైన డ్రెస్డ్ టు కిల్ అనే బుక్ లో ఉన్నాయి. ఆ పుస్తక రచయితలు, బ్రాలు రొమ్ములలోని శోషరస ప్రవాహానికి (lymphatic flow) అడ్డుపడతాయని, దానివల్ల విషపదార్థాలు పేరుకుపోయి క్యాన్సర్ వస్తుందని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే దానికి ఎలాంటి శాస్త్రీయమైన, వైద్యపరమైన ఆధారాలనూ వారు చూపెట్టలేకపోయారు. ఇక కాలక్రమేణా ఈ తప్పుడు సమాచారమే నోటిమాటగా వ్యాపించి, ఒక పెద్ద అపోహగా స్థిరపడిపోయింది.

శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఈ అపోహను పటాపంచలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనది 2014లో అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ లో జరిగిన అధ్యయనం. దాదాపు 1500 మంది మహిళలపై జరిపిన పరిశోధనలో బిగుతుగా ఉండే బ్రా ధరించడానికి, రొమ్ము క్యాన్సర్‌కు మధ్య ఎలాంటి కనెక్షన్ లేదని శాస్త్రవేత్తలు నిస్సందేహంగా తేల్చిచెప్పారు. బ్రా సైజు, దాని రకం లేదా రోజులో ఎన్ని గంటలు ధరించారు అనే విషయాలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలతో ఎలాంటి సంబంధం లేదని ఆ అధ్యయం చేసినవాళ్లు స్పష్టం చేశారు.
మరి తప్పుడు సైజు బ్రా వల్ల కలిగే నష్టాలేంటి?
బ్రా వల్ల క్యాన్సర్ రాదు కదా అని తప్పుడు సైజు లేదా బిగుతైన బ్రా ధరించడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకపోయినా కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చూడండి.
రక్త ప్రసరణ సమస్యలు: బ్రా మరీ టైట్ గా ఉంటే అది చర్మాన్ని నొక్కిపెట్టి ఆ ప్రాంతంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగించవచ్చు.
రొమ్ము నొప్పి: సరైన సపోర్ట్ లేని లేదా బిగుతైన బ్రా వల్ల రొమ్ములలో నొప్పి రావచ్చు.
వెన్ను, భుజాల నొప్పి: ముఖ్యంగా బరువైన రొమ్ములు ఉన్న మహిళలు సరైన సపోర్ట్ ఇచ్చే బ్రా ధరించకపోతే వెన్ను, భుజాలు, మెడ నొప్పుల బారిన పడతారు.
ఇవి కేవలం అసౌకర్యాన్ని కలిగించేవే తప్ప క్యాన్సర్‌కు దారితీయవు.
రొమ్ము క్యాన్సర్‌కు అసలైన కారణాలు
మీఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉంటే మీకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. అలాగే, చిన్నవయస్సులోనే మెచ్యూర్ అవడం,లేట్ గా మెనోపాజ్ రావడం వంటివి కూడా హార్యోన్ల బ్యాలెన్స్ ప్రభావితం చేసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతారు. ఎక్కువగా మందు తాగడం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ వంటివి కూడా క్యాన్సర్ ప్రమాద కారకాలుగా చెబుతుంటారు నిపుణులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications