Latest Updates
-
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
పెరిగిపోతున్న కుక్కకాట్లు.. హార్వర్ట్ స్టడీలో షాకింగ్ విషయం
ఈ మధ్య కాలంలో కుక్క కాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న వీధి కుక్కల బారిన పడి తీవ్రంగా గాయపడుతున్న ఘటనల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఘటనలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ కుక్కకాటు ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే ఇది కేవలం భారత్ లోనే కాకుండా చాలా దేశాల్లోనూ కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయ.
సాధు జంతువులైన కుక్కలు ఇలా విపరీతంగా ప్రవర్తించడంపై హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఓ పరిశోధన చేసింది. చాలా దేశాల్లో ఇలా కుక్కలు విపరీతంగా ప్రవర్తిస్తూ మనుషులపై దాడులు ఎందుకు చేస్తున్నాయని శాస్త్రవేత్తల బృంధం అధ్యయనం చేయగా.. షాకింగ్ విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు పర్యావరణ వేత్తలనూ కూడా ఆందోళ కలిగిస్తోంది.

ఆందోళన కలిగిస్తున్న వాతావరణ మార్పులు:
మానవ తప్పిదాలతో వాతావరణంలో కనిపిస్తున్న మార్పులు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే అతివృష్టి లేదా అనావృష్టి. అయితే వర్షాలు ఇబ్బంది పెడతాయి, లేదంటే ఎండలు దంచిపొట్టి భానుడు ప్రతాపం చూపిస్తుంటాడు. ఈ వాతావరణ మార్పులు ప్రభావం శునకాలపై కూడా పడుతోందని హార్వర్డ్ తాజాగా తేల్చింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన పరిశోధనలో వాతావరణంలో వేడి, అల్ట్రావైలెట్ (యూవీ) స్థాయి పెరిగినప్పుడు శునకాలు విపరీతంగా ప్రవర్తిస్తున్నాయని తేలింది.
ఈ సమయంలో కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీధి కుక్కలు మాత్రమే కాకుండా ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు కూడా ఇంట్లో వారిపై, బయటి వ్యక్తులపై దాడి చేసి గాయపరుస్తున్నట్లు అధ్యయనకర్తలు గుర్తించారు. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
70 వేలకు పైగా కుక్కకాట్లపై అధ్యయనం:
హార్వర్డ్ మెడికల్ స్కూల్ 70 వేలకు పైగా డాగ్ బైట్స్ కు సంబంధించిన ఘటనలపై అధ్యయనం చేసిన తర్వాత ఓ ఆందోళనకరమైన విషయాన్ని గుర్తించింది. వేడి వాతావరణంలో, కాలుష్య వాతావరణంలో ఉండే కుక్కలు అక్కడి మనుషులపై దాడులు చేస్తున్నట్లు పరిశోధనలో తేలింది. మానవుల తప్పిదాల వల్ల గ్లోబల్ వార్మింగ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ వాతావరణ మార్పుల ప్రభావం కుక్కలపైనా పుడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
నేచల్ జర్నల్ ఈ పరిశోధక నివేదికను జూన్ 15వ తేదీన ప్రచురించింది. అమెరికాలోని 8 ప్రముఖ నగరల్లో ఈ పరిశోధన 10 ఏళ్ల పాటు జరిగింది. వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లో, కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లో కుక్కలు విపరీతంగా ప్రవర్తించి మనుషులను గాయపరుస్తాయని తేలింది.
ఈ గ్రాఫ్ ను గమనించినట్లైతే.. వాతావరణంలో యూవీ లైట్ స్థాయి పెరుగుతున్న కొద్దీ కుక్కకాట్లు పెరిగిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. యూవీ లైట్ పెరిగితే డాగ్ బైట్స్ 11 శాతం పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న రోజుల్లో కుక్క కాట్లు 4 శాతం మేర పెరిగాయి. ఓజోన్ లెవెన్ అధికంగా ఉన్న రోజుల్లో డాగ్ బైట్స్ 3 శాతం పెరిగాయి. అలాగే భారీ వర్షాలు కురిసే సమయంలోనూ కుక్కకాట్లు పెరిగినట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనంలో తేలింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications