Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
కిచెన్‌లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.?
ఆస్పత్రుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన కిచెన్‌లోనే ఎన్నో శక్తివంతమైన ఔషధ గుణాలున్న మసాలున్నాయి. కానీ వాటి ప్రయోజనాలు సరిగా చాలా మందికి తెలియదు. సరైన మోతాదులో తరచూ వాటిని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నల్ల మిరియాలు, లవంగాలు, జీలకర్ర, ఏలకులు, మెంతులు ఇలా ఎన్నో సహజసిద్ధమైన మెడిసిన్‌లా పనిచేస్తాయి. కానీ సోంపు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎప్పుడైనా విన్నారా.. బిర్యానీ లేదా ఏదైనా హెవీ ఫుడ్ తిన్న తర్వాత టైం పాస్‌కి తినే ఈ సోంపు ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

భోజనం తర్వాత నోటి దుర్వాసన రాకుండా చాలా మంది సోంపు తింటుంటారు. అయితే ఇది కేవలం సువాసన కోసం మాత్రమే కాదు.. జీర్ణ సమస్యలకి కూడా చికిత్సగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, వివిధ రకాల మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అనెథోల్ వంటి సమ్మేళనాలు.. జీర్ణక్రియ, వాపుతో పాటు కండరాల నొప్పుల విషయంలో ఉపశమనం కలిగిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.!
జీర్ణ సమస్యలకు చెక్
ఎక్కువగా జీర్ణ సమస్యలను నివారించేందుకు సోంపు ఉపయోగిస్తారు. ఇందులోని సహజసిద్ధమైన మొక్కల సమ్మేళనాలు జీర్ణవ్యవస్థలోని కండరాలపై ప్రభావం చూపిస్తాయి. కడుపు నొప్పిని తగ్గిస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, తేలికపాటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు అవసరమైనా కేవలం సోంపు తినడం వల్లే మలబద్ధకం, ఎసిడిటీ నయం కాదని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం, అసిడిటీ, కడుపు నొప్పి ఉన్నవారు దానికి సరైన కారణాన్ని తెలుసుకుని చికిత్స తీసుకోవాలి.
బరువు తగ్గేందుకు సోంపు గింజలు

సులభంగా జీర్ణమయ్యేందుకే కాదు.. బరువు తగ్గేందుకు కూడా సోంపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మెటబాలిజంను మెరుగుపరిచి బాడీలో అదనపు కొవ్వును కరిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులోని ఫైబర్.. కడుపు నిండుగా ఉండేలా చేయడంతో పాటు ఆకలిని నియంత్రిస్తుంది. కేలరీల వినియోగాన్ని నియంత్రిస్తుంది. దీనితో పాటు మీరు తీసుకునే ఫుడ్ క్వాలిటీ, శారీరక శ్రమ, నిద్ర వంటి అనేక అంశాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
డయాబెటిస్ నియంత్రణ
సోంపులో తక్కువ స్థాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి టైప్ 2 డయాబెటిస్ నియంత్రించేందుకు సహాయపడుతుంది. సోంపులోని విటమిన్ ఎ, యాంటీఆక్సిడంట్లు కంటిచూపుని సైతం మెరుగుపరుస్తాయి. శుక్లాలు, వయసు పెరిగేకొద్దీ వచ్చే కంటి సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
