Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.!
ఈ రోజుల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా అనీమియాతో బాధపడుతున్నారు. వైద్య గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 57శాతం మంది మహిళలు, కౌమార దశలోని బాలికలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్న కారణంగా అనీమియా సంభవిస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను తీసుకెళ్తున్న కారణంగా ఇది తగ్గితే తగినంత ఆక్సిజన్ సప్లై లేక అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మహిళలు ప్రతిరోజూ తప్పనిసరిగా వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..

రక్తహీనత సమస్య ఉన్నవారిలో ఎక్కువగా అలసట, నీరసం, చర్మం పాలిపోవడం కనిపిస్తాయి. ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచుగా కళ్లు తిరగడం వంటివాటిని ఎదుర్కొంటారు. అయితే రక్తహీనత ఉంటేనే ఈ సమస్య వస్తుందని చెప్పలేం. కానీ వైద్య పరీక్షల్లో ఈ సమస్య ఉందని తేలితే తప్పనిసరిగా అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే సాధారణంగా రక్తహీనత సమస్య ఉంది అంటే వారిని తప్పనిసరిగా బీట్‌రూట్, బెల్లం, నానబెట్టిన ఎండు ద్రాక్ష తినమని సలహా ఇస్తారు. బీట్‌రూట్, బెల్లం విషయాలను పక్కనపెడితే ఎండుద్రాక్ష తింటే రక్తహీనత సమస్య నిజంగానే తగ్గిపోతుందా? వాస్తవాలు తెలుసుకుందాం..
ఎండుద్రాక్షతో ప్రయోజనాలు..
ఎండుద్రాక్షలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ ఒక ఐదు లేదా పది నానబెట్టుకుని తినడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ తయారీకి దోహదపడుతుంది. వీటిశాతం పెరిగి అనీమియా శాతాన్ని నివారిస్తుంది. అందుకే ఎండుద్రాక్ష తినమని సలహా ఇస్తారు. ఈ క్రమంలో డైటీషియన్లు కూడా ఐరన్, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఎండుద్రాక్షను సిఫారసు చేస్తారు. అయితే హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉంటే లేదా శరీరం ఐరన్‌ను సరిగ్గా తీసుకునే సామర్థ్యం లేకపోయినా ఎండుద్రాక్ష తింటే ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

మీకు రక్తహీనత సమస్య ఉన్నట్లు తేలితే అందుకు సరైన కారణాలను ముందు తెలుసుకోవడం ముఖ్యం. అధిక రుతుస్రావం, భోజనంలో ఐరన్ లోపం, పేగులు ఐరన్‌ను సరిగ్గా గ్రహించలేకపోవడం ఇంకా ఇతర సమస్యల కారణంగా మహిళలను ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే డైలీ ఆహారంలో ఎండు ద్రాక్షను తీసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.
ఎలా తీసుకోవాలి..
నానబెట్టిన ఎండుద్రాక్షలు మెత్తగా ఉండి సులభంగా జీర్ణమవుతాయి. వీటితో పాటు పప్పు ధాన్యాలు ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, మాంసం, చేపలు వంటి ఐరన్ పుష్కలంగా ఉన్న వాటిని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. డైటీషియన్ల అభిప్రాయం మేరకు ఆకుకూరల కంటే మాంసాహార ఉత్పత్తుల ద్వారా ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఐరన్ ఫుడ్స్‌తో పాటు మీ ఆహారంలో విటమిన్ సి చేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు ఆహార పదార్థాలతో పాటు సప్లిమెంట్లను కూడా వాడటం ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
