Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
వేసవిలో కళ్లు పొడిబారిపోతున్నాయా, ఇతర సమస్యల నుండీ ఇలా దూరంగా ఉండండి
ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. తీవ్రమైన వేడిమికి తట్టుకోలేక నీడ పట్టునే ఉంటున్నారు. అయితే వేసవి కాలంలో కంటి సమస్యలు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.
సూర్యుని అతినీలలోహిత(యూవీ) కిరణాలు కంటి శుక్లం, మాక్యులర్ డీజనరేషన్, అంధత్వం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి. ఎండాకాలంలో కళ్లు పొడిబారి చికాకుగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. వేసవిలో తలెత్తే కంటి సమస్యలు, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటి శుక్లాలు:
కంటిలోని కటకం మేఘావృతమై కంటి చూపును కష్టతరంచేస్తుంది. కంటి శుక్లాలు వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వేసవిలో అతినీలలోహిత కిరణాలకు గురికావడం వల్ల సమస్య తలెత్తుతుంది.
మాక్యులర్ డీజెనరేషన్:
కాంతిని గ్రహించే కంటి భాగమైన రెటీనా దెబ్బతినడాన్ని మాక్యులర్ డీజెనరేషన్ అంటారు. ఈ సమస్యల వల్ల కంటి చూపు అస్పష్టంగా మారుతుంది. బ్లైండ్ స్పాట్స్ ఏర్పడతాయి. కొంత మందిలో పూర్తిగా కంటి చూపు పోతుంది.
కళ్లు పొడిబారడం:
వేసవికాలంలో ఎండ వేడిమికి కంటిలోని నీరు ఆవిరై పోతుంది. దీని వల్ల కళ్లు మంట పుడతాయి. ఎరుపు రంగులోకి మారతాయి. చికాకు పెడతాయి.
అలెర్జీ కండ్లకలక:
అలెర్జీ వల్ల కండ్లకలక వస్తుంది. వేసవికాలంలో వీచే పొడి గాలుల వల్ల గాలిలోని పుప్పొడి, దుమ్ము, పెంపుడు జంతువుల జుట్టు వంటివి కంటిలో పడినప్పుడు అలెర్జీ వచ్చి కండ్లకలక వస్తుంది.
ఈత- కంటి ఇన్ఫెక్షన్లు:
ఎండాకాలంలో ఈతకు వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. అయితే నీటిలో బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కంటి ఇన్ఫెక్షన్లు రావొచ్చు. వీటి వల్ల కళ్లు ఎర్రబడతాయి, దురదగా ఉంటాయి, నొప్పి వస్తుంది.

వేసవిలో కంటి సమస్యలను నివారించడం ఎలా?
సన్‌గ్లాసెస్ ధరించాలి:
వంద శాతం యూవీ కిరణాలను నిరోధించే సన్‌గ్లాసెస్ సూర్యుడి కిరణాల నుండి కళ్లను రక్షిస్తాయి. UV400 లేబుల్ ఉన్న సన్‌గ్లాసెస్ ఎంచుకోవడం మంచిది.
ఎండలో బయటకు వెళ్లొద్దు:
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పని ఏర్పడితే 20-30 నిమిషాలకొకసారి నీడలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. కళ్లు మూసుకోవడం, కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోవడం వంటివి చేయాలి.
హైడ్రేటెడ్‌గా ఉండాలి:
కాలంతో సంబంధం లేకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. వేసవిలో మరీ ముఖ్యంగా పుష్కలంగా నీరు తాగాలి. డీహైడ్రేషన్ కు గురైతే కళ్లు పొడిగా మారి చికాకు పెడతాయి. కళ్లు పొడిబారకుండా ఉండేందుకు ఎక్కువగా నీరు తాగాలి.
కాంటాకట్ లెన్స్‌తో ఈత వద్దు:
కాంటాక్ట్ లెన్సులు ధరించి ఈత కొట్టొద్దు. కాంటాక్ట్ లెన్సుల్లో బ్యాక్టీరియా, వైరస్ లు, ఇతర సూక్ష్మక్రిములు ఇరుక్కుపోయి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. అలాగే ఈత కొట్టేటప్పుడు గాగుల్స్ ధరించడం మంచిది.
టోపీ ధరించాలి:
ముఖంపై ఎండ పడకుండా టోపీ ధరించాలి. టోపీ ముందు భాగం ముందుకు వచ్చేలా ఉండే వాటినే ఎంచుకోవాలి. దీని వల్ల నేరుగా సూర్య కిరణాలు కంట్లో పడకుండా చూసుకోవచ్చు.
కాటన్ దుస్తులు ధరించాలి:
ఎక్కువగా ఎండలో తిరగాల్సిన పని అయితే మంచి దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు, లేత రంగులు ఎంచుకోవాలి. వీటి వల్ల సూర్య కిరణాల పరావర్తనం చెందకుండా ఉంటాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
