Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.!
సంతానలేమి సమస్యలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. పిల్లలు కాకపోవడానికి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ల్యాబ్ టెస్టులు, అడ్వాన్స్‌డ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సంతానం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. తమ శరీరంలో ప్రతి నెలా జరిగే మార్పులను గమనించినట్లయితే ప్రాథమికంగా మీలో ఫెర్టిలిటీ సమస్య ఉందో లేదో టెస్టులు అవసరం లేకుండా తెలుసుకోవచ్చని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.

మహిళల్లో సంతానోత్పత్తికి గర్భాశయం, అండాశయాలు, ఫాలోపియన్ ట్యూబ్‌లు, థైరాయిడ్ గ్రంథి, ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్ల పాత్ర చాలా కీలకం. వీటి పనితీరు సక్రమంగా ఉంటేనే పునరుత్పత్తి వ్యవస్థకు దోహదపడుతుంది. రుతు చక్రం, అండం విడుదల వీటిపైనే ఆధారపడతాయి. మరి మహిళల్లో సంతాన సమస్య లేదని తెలిపే ఐదు సంకేతాలు ఏంటో చూద్దాం..
రెగ్యులర్ పీరియడ్స్
ఆరోగ్యకరమైన రుతుచక్రం ప్రతి నెలా ఊహించదగిన తేదీల్లో ఉంటూ ఆలస్యం కాకుండా వస్తుంది. సాధారణ రుతు చక్రం సుమారుగా 27- 32 రోజులకు వస్తుంది. మీ పీరియడ్స్ సైకిల్ ఈ వ్యవధిలో ఉన్నట్లయితే మెదడు, హార్మోన్లు, అండాశయాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని.. అండోత్పత్తి సవ్యంగా జరుగుతోందని అర్థం.
వైట్ డిశ్చార్జ్
పీరియడ్స్ ప్రారంభమైన పది రోజుల తర్వాత అండోత్పత్తి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో గుడ్డులోని తెల్లసొన లాంటి జిగుటు స్రావం విడుదల అవుతుంది. ఇది అండం విడుదల విజయవంతంగా జరుగుతుందని తెలిపే సంకేతం. అంతేకాకుండా ఇలా వైట్ డిశ్చార్జ్ అయినట్లయితే మీ శరీరం వీర్య కణాల కదలికకు చురుకుగా మద్దతు ఇస్తుంది. సంతానోత్పత్తికి సానుకూల సంకేతంగా పరిగణించాలి.
పొత్తి కడుపులో నొప్పి..
ప్రతి నెలా మహిళ అండాశయం నుంచి ఒక అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో పొత్తి కడుపుకి ఒక వైపు స్వల్ప స్థాయిలో నొప్పి లేదా బరువుగా అనిపించడం జరుగుతుంది. పీరియడ్స్ ప్రారంభమైన పది నుంచి 20 రోజుల మధ్య జరిగే ఈ ప్రక్రియలో మీరు ఈ నొప్పిని అనుభవించినట్లయితే ఆ సమయం సంతానోత్పత్తికి సరైన సమయంగా భావించాలి. ఈ తేదీల్లో భార్యాభర్తలు కలిసినట్లయితే గర్భం దాల్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

నెలసరి తీరు
నెలసరి సమయంలో రక్తస్రావం సరిగా ఉండాలి. అప్పుడే పునరుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందని అర్థం. ఆరోగ్యకరమైన నెలసరి సాధారణంగా 3 నుంచి 5 రోజులు ఉంటుంది. రక్త స్రావం మరీ తక్కువగా, మరీ ఎక్కువగా కాకుండా ఉన్నట్లయితే హార్మోన్లు సమతుల్యంగా ఉన్నాయని తెలిపే సంకేతం. కొందరిలో రక్తస్రావం చాలా తక్కువగా లేదంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యను సూచిస్తుంది.
మూడ్ స్వింగ్స్
అండోత్పత్తికి ముందు మహిళల్లో సాధారణంగా శారీరక, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి. అండం విడుదల సమయంలో శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. మానసికంగానూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అండోత్పత్తి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ క్రమంలో మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి.
రుతు చక్రం సమయంలో మీరు ఈ మార్పులు గమనించినట్లయితే మీ శరీరం సంతానోత్పత్తికి సిద్ధంగా ఉందని అర్థం. అయినా సంతానం కావడం లేదు అంటే మీలో ఏవైనా జన్యుపరమైన మార్పులు ఉండవచ్చు. లేదా మీ భాగస్వామి వీర్య కణాల పరంగా సమస్య ఉండొచ్చు. వివాహమై ఏడాది గడిచి మీలో ఏ సమస్య లేకపోయినా సంతానం కలగడం లేదంటే గైనకాలజిస్టును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
