Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
ఇడ్లీ, దోశ,పూరీ అక్కర్లేదు..ఉదయం గుప్పెడు శెనగలతో ఆరోగ్యానికి తిరుగులేని బలం!
ప్రస్తుతం దాదాపు అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచే ఆరోగ్యంపై అటెన్షన్ అందరిలో వచ్చిందనే చెప్పాలి. అయితే ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి. ఏది పడితే అది తిని ఇది కూడా ఆరోగ్యకరమైనదే అని చాలామంది అనుకుంటారు..అయితే అది భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య పరిణామాలకు కారణమవుతుంది. సాధారణంగా మన తెలుగు ప్రజులు పొద్దున్నే ఇడ్లీ,దోశ, పూరీ,వడ,బోండా వంటివి ఎక్కువగా తింటుంటారు. అయితే వీటిన్నింటిన్ని వదిలి పొద్దున్నే గుప్పెడు నానబెట్టిన శెనగలు తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు మేలు జరుగుతుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, విటమిన్లు,మనరల్స్ పుష్కలంగా ఉండే శెనగలు మీ శరీరాన్ని శక్తివంతం చేయడమే కాకుండా అనేక వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది.
బలమైన జీర్ణవ్యవస్థ
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జీర్ణ సంబంధిత సమస్యలు చాలా కామన్ అయిపోయింది. అయితే నానబెట్టిన శెనగలు దీనికి చక్కటి పరిష్కారం చూపుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. పేగు కదలికలను సులభతరం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం సక్రమంగా జీర్ణం కావడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి,ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ
మధుమేహం లేదా షుగర్ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని వేధిస్తున్న ఒక తీవ్రమైన సమస్య. నానబెట్టిన శనగపప్పు బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. దీనిలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. తద్వారా చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం.
బరువు తగ్గడంలో సాయం
నానబెట్టిన శనగలు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల మీరు తరచుగా తినాలనే కోరికను నియంత్రించవచ్చు, అదనపు కేలరీలు తీసుకోకుండా ఉండవచ్చు.
రోగనిరోధక శక్తి
బలమైన రోగనిరోధక శక్తి మనల్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. నానబెట్టిన శనగలలో ఐరన్, భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన మినరల్స్, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక కణాలను బలోపేతం చేస్తాయి. తద్వారా శరీరం ఇన్ఫెక్షన్లు,వ్యాధులతో సమర్థవంతంగా పోరాడగలదు.
గుండె ఆరోగ్యం
నానబెట్టిన శనగలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటం వల్ల గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
చర్మం,జుట్టుకు మెరుపు
ఆరోగ్యకరమైన చర్మం, మెరిసే జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. నానబెట్టిన శనగపప్పులో ఉండే ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. అంతేకాకుండా ఇది జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
నానబెట్టిన శనగపప్పును ఎలా తీసుకోవాలి?
రాత్రిపూట ఒక కప్పు శనగపప్పును శుభ్రమైన నీటిలో నానబెట్టండి.
ఉదయం లేచిన తర్వాత వాటిని బాగా కడిగి ఖాళీ కడుపుతో తినండి.
మీ రుచికి అనుగుణంగా కొద్దిగా ఉప్పు, అల్లం ముక్కలు లేదా కావాలనుకుంటే తేనెను కూడా కలుపుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
