Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
అరటి తొక్కను పారేస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
పేదవాడి అమృతంగా అరటిపండును చెబుతారు. తక్కువ ధరలో అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండే అరటిపండు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సాఘధారణంగా మనం అరటికాయను తినేసి దాని తొక్కను పడేస్తుంటాం. దాదాపు అందరూ చేసే పనే ఇది. కానీ, మీరు పనికిరానిదిగా భావించి పారేస్తున్న ఆ తొక్కలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు, సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? ఆయుర్వేదం నుంచి ఆధునిక శాస్త్రవేత్తల వరకు అరటి తొక్కలోని ఔషధ గుణాలను గుర్తించారు.
పోషకాల గని అరటి తొక్క
అరటి తొక్క ఒక పోషకాల గని. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, మెగ్నీషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కలిసి మన శరీరాన్ని ఒక కవచంలా కాపాడతాయి. జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడం నుంచి రక్తపోటుని అదుపులో ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచడం దాకా అరటి తొక్క కీలక పాత్ర పోషిస్తుంది.

ఆరోగ్యానికి అండగా
గుండెకు రక్షణ: అరటి తొక్కలో ఉండే కరిగే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే అరటి తొక్కను మీ ఆహారంలో చేర్చుకోవడం గురించి ఆలోచించవచ్చు.
షుగర్ పేషెంట్లకు వరం: అరటి తొక్కలోని ఫైబర్, రక్తంలోకి చక్కెర శోషణ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ సడెన్ గా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది షుగర్ పేషెంట్లకు చాలా ప్రయోజనకరం.
బరువు తగ్గడంలో సహాయం: బరువు తగ్గాలనుకునే వారికి అరటి తొక్క మేలు చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను ఎక్కువసేపు కలిగిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది, జీవక్రియ (metabolism) రేటును పెంచి, శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
అందాన్ని ఇనుమడింపజేస్తుంది
కేవలం ఆరోగ్యానికే కాదు మీ అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా అరటి తొక్క ముందుంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మానికి, జుట్టుకు అద్భుతంగా పనిచేస్తాయి. అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖంపై సున్నితంగా రుద్దడం వల్ల మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. తొక్కను మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్య దూరమై, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఎలా తినాలి?
అయితే అరటి తొక్కను నేరుగా తినకూడదు. దానిపై పురుగుమందుల అవశేషాలు, మైనపు పూతలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపయోగించే ముందు తొక్కను గోరువెచ్చని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత కొన్ని నిమిషాల పాటు ఉడికించడం లేదా ఆవిరిపై ఉంచడం వల్ల అది మెత్తబడి, చేదుదనం తగ్గుతుంది. ఈ ఉడికించిన తొక్కను మీరు స్మూతీలలో, కూరలలో, చట్నీలలో లేదా టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
