Latest Updates
-
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
Breast Cancer Vaccine: మహిళలకు భారీ శుభవార్త...బ్రెస్ట్ క్యాన్సర్ ను మొగ్గలోనే తుంచేసే వ్యాక్సిన్!
మనదేశంలో మహిళలను వేధించే అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. ప్రతి ఏటా లక్షలాది మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు..కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ భయంకరమైన వ్యాధిపై పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు అయినా దీనికి చెక్ పెట్టే వ్యాక్సిన్ ను కనిపెట్టలేకపోయారు. అయితే ఇప్పుడు వైద్య ప్రపంచంలో ఒక కొత్త ఆశాకిరణం ఉదయించింది. క్యాన్సర్ ట్రీట్మెంట్, నివారణే లక్ష్యంగా పనిచేస్తున్న 'అనిక్సా బయోసైన్సెస్' అనే సంస్థ రొమ్ము క్యాన్సర్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ కి చెక్ పెట్టే ఒక వ్యాక్సిన్ ను డెవలప్ చేసి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?
మహిళలు తమ బిడ్డకు పాలిచ్చే సమయంలో వారి రొమ్ములలో ఆల్ఫా-లాక్టాల్బుమిన్(a-lactalbumin) అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ. అయితే ఆశ్చర్యకరంగా అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలు కూడా ఇదే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి.

అనిక్సా బయోసైన్సెస్, క్లీవ్ ల్యాండ్ క్లినిక్ తో కలిసి డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు ఒక శిక్షకుడిలా పనిచేస్తుంది. ఇది మన శరీరంలోని సైటోటాక్సిక్ టి-కణాల (T-cells)కు ఈ ఆల్ఫా-లాక్టాల్బుమిన్ ప్రోటీన్ ను ఒక శత్రువుగా గుర్తించేలా శిక్షణ ఇస్తుంది. ఫలితంగా ఎప్పుడైనా శరీరంలో క్యాన్సర్ కణాలు ఈ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే మన రోగనిరోధక సైనికులైన టి-కణాలు వెంటనే వాటిపై దాడి చేసి మొగ్గలోనే తుంచివేస్తాయి. అంటే,క్యాన్సర్ కణితులుగా మారకముందే వాటిని నాశనం చేసి వ్యాధి రాకుండానే శరీరం ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.
విజయవంతమైన మొదటి అడుగు
ఇటీవల ఈ వ్యాక్సిన్ తన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ బారినపడి కోలుకున్న 35 మంది మహిళలపై ఈ ప్రయోగాలు నిర్వహించగా ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి. ఈ ప్రయోగంలో పాల్గొన్న 75శాతం కంటే ఎక్కువ మంది మహిళల్లో క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తివంతమైన రోగనిరోధక ప్రతిస్పందన కనిపించింది. దీనిని ఒక చారిత్రాత్మక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

భవిష్యత్తు ఆశలు
ఈ విజయంతో స్ఫూర్తి పొందిన అనిక్సా బయోసైన్సెస్.. క్లీవ్ ల్యాండ్ క్లినిక్ తో కలిసి అండాశయ క్యాన్సర్‌ను నివారించే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తోంది. రొమ్ము క్యాన్సర్ వ్యాక్సిన్ మొదటి దశ లైసెన్స్‌ను అనిక్సా సొంతం చేసుకుంది. రాబోయే దశల ప్రయోగాలు కూడా విజయవంతమైతే రొమ్ము క్యాన్సర్ కు పూర్తిగా చెక్ పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications