Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
Anti Cancer Drinks: ఈ 3 డ్రింక్స్ తాగితే క్సాన్సర్ జన్మలో రాదట!..హార్వర్డ్ డాక్టర్ చెప్పిన కీలక విషయం
క్యాన్సర్..ఈ పేరు వింటే చాలామంది గుండెల్లో వణకుపుడుతుంది. ఒకప్పుడు క్యాన్సర్ ని ధనవంతుల రోగంగా పరిగణించేవాళ్లు.. అయితే ఇప్పుడు మారిన ప్రజల జీవనశైలి,ఆహార అలవాట్లు కారణంగా అందరినీ టెన్షన్ పెడుతుంది. క్యాన్సర్ లో రకరకాలు ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లు అయితే చివరి స్టేజ్ దాకా బయటపడవు. కనీసం దాని లక్షణాలు కూడా కనబడుతుంది. తీరా క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకునే సరికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ప్రస్తుతం మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అయితే మనం క్యాన్సర్ బారిన పడకూడదంటే వెంటనే మన జీవనశైలి,ఆహార అలవాట్లను మార్చుకోవడం తప్పనిసరి. రుచిగా ఉందని ఏది పడితే అది తినడం, ఏది పడితే అది తాగడం వంటి అలవాట్లను వెంటనే మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే భవిష్యత్తులో మీరు క్యాన్సర్ బారిన పడకూడదు అంటే మీ ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేయాల్సిందే. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే 3 రకాల డ్రింక్స్ గురించి హార్వర్డ్ ట్రైన్డ్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో ద్వారా సూచించారు. డాక్టర్ సేథీ చెప్పిన ఆ 3 యాంటీ క్యాన్సర్ డ్రింక్స్ ఏవో ఇక్కడ చూడండి.

యాంటీ క్యాన్సర్ డ్రింక్స్ ఇవే
గ్రీన్ టీ
డాక్టర్ సేథీ ప్రకారం.. గ్రీన్ టీ తరచుగా తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో క్యాన్సర్ తో పోరాడటానికి సాయపడే కాటెచిన్ మాచా అనే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి రోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదానికి చెక్ పెట్టవచ్చు.
గ్రీన్ స్మూతీ
భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఆకుపచ్చ కూరగాయలతో చేసిన స్మూతీలను తాగాలని డాక్టర్ సేథీ చెబుతున్నారు. ఇందుకోసం పాలకూర, దోసకాయ, కాలే ఆకుకూర,అల్లం,వాము అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఈ గ్రీన్ స్మూతీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. దీనిని రోజూ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని డాక్టర్ సేథీ చెప్పారు.
పసుపు పాలు
మన వంటగదుల్లో తప్పనిసరిగా ఉండే పదార్థాం పసుపు. ఈ పసుపు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది చాలావరకు తగ్గించగల పవర్ ఫుల్ పదార్థాం పసుపు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలున్నాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో సాయపడుతుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే సమ్మేళనం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. డాక్టర్ సేథీ సూచించిన ప్రకారం పసుపు పాలను ఎలా తయారుచేయాలంటే..ఒక గ్లాసు బాదంపాలలో పసుపు,నల్ల మిరియాల పొడిని కలిపి తాగవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications