Latest Updates
-
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026 -
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి!
డ్రాగన్ ఫ్రూట్ గురించి సంచలన నిజాలు.. తినే ముందు తెలుసుకోండి..
డ్రాగన్ ఫ్రూట్. ఈ పండుకు ప్రస్తుతం మార్కెట్‌లో భలే డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ పండు గురించి తెలుసుకొని తినడం మొదలుపెట్టారు. సెంట్రల్ అమెరికాలో ఎక్కువగా లభించే ఈ పండును.. ఈ మధ్య కాలంలో మన భారత దేశంలో విరివిగా పండిస్తున్నారు. అందుకే మార్కెట్లో కూడా దీని సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. రెడ్, వైట్, పింక్, ఎల్లో కలర్స్‌లో లభించే పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే ఆ పండును తినే ముందు.. ఆ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, తినడం వల్ల ఏమైనా సమస్య వస్తుందా, ఎలా తినాలి, ఎంత మోతాదులో తినాలి అనేది ఈరోజు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియను వేగవంతం చేసి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఈ పండులో ఎక్కువ మొత్తంలో నీరు ఉండడం వల్ల.. ఇది వెంటనే అరిగిపోతుంది. ఇది వృద్ధాప్య లక్షణాల నుంచి రక్షించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ పండు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది.

బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది..
డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల.. ఈ పండు తినడం వల్ల ఆకలి తొందరగా వేయదు. దీంతో బరువు నియంత్రణలో ఉండడంతో పాటు బరువు తగ్గాలనుకునేవారు సులువుగా బరువు తగ్గొచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో బీటా-సానిన్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కావున ఈ పండు తినడం ద్వారా డయాబెటిక్ రోగుల్లో ఉండే పోషకాల లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ పండులో గ్లిసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ ఫ్రూట్ తింటే డయాబెటిక్ రోగుల్లో షుగర్‌ను నియత్రించొచ్చు. దీంతో పాటు ఇందులో పుష్కలంగా లభించే విటమిన్-సీ కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె ఆరోగ్యానికి..
గుండె జబ్బులకు ప్రధానమైన కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్. అయితే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల.. గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీంతో గుండె సమస్యలకు చెక్ పొట్టోచ్చు. గుండె సమస్యలు ఉన్న వారు.. డ్రాగన్ ఫ్రూట్‌ను రోజూ తినడం ద్వారా మంచి ఫలితాలను పొందొచ్చు.
ఎముకల బలపడడానికి..
ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు కొన్ని పోషకాలు కూడా అవసరం. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషక విలువలు చాలా ఉన్నాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. రోజూ తింటే కీళ్ల సమస్య కూడా దూరం అవుతుంది.
రక్తపోటు నియంత్రణకు...
ప్రస్తుతమున్న గజిబిజి కాలంలో రక్తపోటు అనేది ప్రధానమైన సమస్య. చాలా మంది అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వ్యక్తులు రోజూ ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల.. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ అనేది సాధారణంగా జరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకుంటే ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications