Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
Compression Socks: పడుకుంటే కాళ్లలో అసౌకర్యం, తిమ్మిరి, మొద్దుబారినట్లు అనిపిస్తోందా.. అయితే ఇవి ధరించండి
కంప్రెషన్ సాక్స్ వినియోగం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల వల్ల వీటిని వాడుతున్నారు. కాళ్ల నొప్పులకు, తిమ్మిరికి, మొద్దుబారినట్లు అనిపిస్తే కంప్రెషన్ సాక్స్ లు చక్కగా పని చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కంప్రెషన్ సాక్స్ వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన రక్త ప్రసరణ:
కంప్రెషన్ సాక్స్ కాళ్లపై సున్నితంగా ఒత్తిడిని కలిగిస్తాయి. గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రవహించడంలో సహాయపడతాయి. గ్రాడ్యుయేట్ కంప్రెషన్ డిజైన్ కాలి చీలమండల వద్ద ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా పిక్కలకు వ్యాపిస్తుంది. దీని వల్ల సిరలు తిరిగి రావడాన్ని సులభతరం చేస్తుంది. లోవర్ ఎక్స్‌ట్రీమిటిస్ లో రక్తం చేరడాన్ని నివారిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల కాళ్లలో అసౌకర్యం తగ్గుతుంది. దీని వల్ల వాపు కూడా తగ్గుతుంది.

కాళ్లలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది:
రోజంతా నిల్చునే వ్యక్తులు రాత్రి వేళ, పడుకునే సమయంలో చాలా అసౌకర్యాన్ని ఫీలవుతారు. అలాంటి వారికి కంప్రెషన్ సాక్స్ చక్కగా పని చేస్తాయి. కంప్రెషన్ టెక్నలజీ కండరాల కంపనాలను, మైక్రో టియర్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. షిన్ స్ప్లింట్‌లను అభివృద్ధి చేస్తుంది. కాల్వ్స్ కండరాలకు మద్ధతునిస్తుంది. పోస్ట్ వర్కౌట్ రికవరీలో కంప్రెషన్ సాక్స్ చక్కని ఉపశమనాన్ని అందిస్తాయి.
వెరికోస్ వెయిన్స్‌కు చికిత్స:
వెయిన్ వాల్స్, వాల్వ్స్ బలహీనంగా మారడం వల్ల వెరికోస్ వెయిన్స్, ట్విస్టెడ్ వెయిన్స్ సమస్యలు వస్తాయి. కంప్రెషన్ సాక్సులు ధరించడం వల్ల స్థిరమైన ఒత్తిడిని వర్తింపజేసి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల వెరికోస్ వెయిన్స్, ట్విస్టెడ్ వెయిన్స్ లాంటి సమస్యలు రావు. కంప్రెషన్ సాక్సులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఇప్పటికే ఉన్న వెరికోస్ వెయిన్స్ సమస్య మరింత తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు.
డీప్ వెయిన్ థ్రాంబోసిస్(DVT) నివారణ:
కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల డీప్ వెయిన్ థ్రాంబోసిస్ సమస్య వస్తుంది. డీవీటీ ని నివారించడంలో కంప్రెషన్ సాక్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువసేపు ప్రయాణించడం, కూర్చోవడం వంటి కదలికలేని పరిస్థితిలో కంప్రెషన్ సాక్స్ లు చక్కగా పని చేస్తాయి. వీటిని ధరించడం వల్ల రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. స్తబ్దతను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
వాపు, ఎడెమా తగ్గుతుంది:
గర్భం, ఎక్కువ సేపు నిలబడే పని చేయడం వంటి వాటి వల్ల కాళ్లలో వాపు, ఎడెమా వస్తుంది. కంప్రెషన్ సాక్స్ లు ధరించడం వల్ల వాపు, ఎడెమా లాంటి సమస్యలు దరిచేరవు. కంప్రెషన్ సాక్స్‌లు వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. కాళ్ల వాపుతో ఇబ్బంది పడే వారు క్రమం తప్పకుండా కంప్రెషన్ సాక్స్ ధరిస్తే వాపు తగ్గుతుంది.
అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది:
కంప్రెషన్ సాక్స్ ధరించడం వల్ల కండరాలకు ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. దాని వల్ల ఎండ్యురెన్స్ మెరుగుపడుతుంది. కండరాల అలసట తగ్గుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications