Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
మగతనం పెరగాలంటే ఈ గింజలు తినాలంట.. ఎక్కడ దొరుకుతాయంటే?!
మనలో చాలా మంది గుమ్మడి కాయ తింటూ ఉంటారు. గుమ్మడి కాయ పులుసు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంతో ఇష్టం. అయితే గుమ్మడి కాయ తినేసి అందులోని గింజలను పడేస్తుంటారు. గుమ్మడి కాయ గింజలు తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు, గుమ్మడి గింజలను ఏ విధంగా తినాలి అనేది ఈ స్టోరీలో వివరించాము చూడండి.
గుమ్మడి కాయ ఆరోగ్య ప్రయోజనాలు..
గుమ్మడి కాయ గింజల వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మగవారిలో మగతనం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ గింజలు మగవారిలో వీర్యకణాల వృద్ధికి ఉపయోగపడతాయి. అలాగే వాటి చలనశీలత ఇంప్రూవ్ అయ్యేందుకు సహాయపడతాయి. తద్వారా సంతానలేమితో బాధపడే వారు సంతానం పొందడంతో పాటు, ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటారు.

గుండెకోసం..
గుమ్మడి కాయ గింజలు కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే కాదు. గుండె సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల శరీరంలో వాపు తగ్గుతుంది. దీని కారణంగా రక్తంలో ఉండే లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగు పరుస్తుంది. దీంతో గుండె సమస్యలు దూరమవుతాయి. గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాము.
ఇందులోని షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే అందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చెక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే రక్తపోటు వంటి సమస్యలు రాకుండా సహాయపడుతుంది. రక్తంలో తక్షణమే ఇంప్రూవ్ అయ్యే ఇన్సులిన్‌ని నియంత్రించి అది మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా శరీరంలోని ఫ్రీరాడికల్స్ నివారించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి మెరుగుపడి, రోగాల బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యం కోసం..
ఈ గుమ్మడి కాయ గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు ధృడంగా ఉండేందుకు సహాయపడతాయి. అలాగే ఎముకల ఆరోగ్యాయానికి ఒక మంచి ఔషధంలా పనిచేస్తాయి. అలాగే ఈ విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. దీని కారణంగా కండరాలకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది. అలాగే ఆకలికి నివారించి, అధిక బరువు నుంచి కాపాడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో ఈ గుమ్మడి గింజలను కూడా జత చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు. ఈ గింజల్లో శోథ నిరోధక సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి వాపును తగ్గించేందుకు సహాయపడతాయి. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ మలబద్దకం నుంచి దూరం చేస్తుంది. అజీర్ణం, అజీర్తి, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మొత్తానికి గుమ్మడి కాయ గింజలు సమతూల్యమైన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే రోగాల బారిన పడకుండా రక్షిస్తాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వివిధ అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications