Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గుండె జబ్బు పరీక్షలు....ఆహారాలు!

అధికంగా ఉప్పు తీసుకోవడం గుండెకు సంబంధించిన వ్యాధులకు ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌కు ముఖ్యకారణంగా భావిస్తారు.అధిక ఉప్పు శాతం ఉన్నందున కోడిగుడ్లు, రెడ్‌మీట్ వంటి మాంసాహారాన్ని పూర్తిగా మానివేయాలి. కెఫైన్ శాతం అధికంగా ఉంటుంది కనుక కాఫీని కూడా పూర్తిగా మానేయాలి. ఆహారంలో నూనె పరిమాణాన్నిబాగా తగ్గించాలి. ముఖ్యంగా హైడ్రోజనేటెడ్ నూనెలను మానేయాలి. పప్పు దినుసులను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి.
ఆప్రికాట్లు, టమాటా, సపోటా, పుచ్చకాయ, అరటిపండు, ఆకు కూరలు, కాకరకాయ, వంకాయ, ఆలుగడ్డ వంటివాటిని రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వీటన్నింటిలోనూ పొటాషియం అధికంగా ఉంటుంది. అయితే మూత్రపిండ సమస్యలున్న హైపర్‌టెన్షన్ రోగులు మాత్రం పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. ఇది మూత్రపిండాల మీద అధిక ఒత్తిడి పెడుతుంది.
పొటాషియం అధికంగా అరటిపండు, ఆకు కూరలలో వుంటుంది. వీటిలో ఉండే పదార్ధం ఉపశమనకారిగా పని చేసి, రక్తపోటును కూడా తగ్గించగలదు. పళ్ళు, కాయగూరలను తీసుకోవడం ద్వారా విటమిన్లను కూడా సమపాళ్ళలో వుండేలా చూసుకోవాలి.
గుండె జబ్బుల విషయంలో నొప్పి స్థాయి ప్రధానాంశం కాదు. నొప్పి కలుగుతున్న విధానమే ప్రధానం. నొప్పి తక్కువగానే ఉన్నప్పటికీ లోపల గుండె తీవ్రస్థాయిలోనే దెబ్బతిని ఉండవచ్చు. దీనినే సైలెంట్ హార్ట్ ఎటాక్‌గా వ్యవహరిస్తుంటారు. అందుకే గుండెనొప్పి లక్షణాలన్న అనుమానం కలిగిన వెంటనే కనీసం ఇ.సి.జి. అయినా తీయించడం మంచి పద్ధతి. ఇ.సి.జి. పరీక్షల తర్వాత అవసరం అనుకుంటే వైద్య సూచన మేరకు ట్రెడ్ మిల్, టి.డి. ఎకో వంటి పరీక్షలు చేయిస్తే, వాటిలో గుండె సంబంధిత వ్యాధులు ఖచ్చితంగా నిర్ధారించబడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications