Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
వంశానుగత హైపర్ కొలెస్టరోలేమియా!
చిన్న వయసులోనే గుండె పోట్లు వచ్చేస్తూంటాయి. ఈ వ్యాధిని హైర్ కొలెస్టరోలేమియా అని కూడా అంటారు. ఈ వ్యాధి వంశానుగతంగా వస్తుంది. దీనిలో ఎల్ డి ఎల్ కొల్లెస్టరాల్ అధిక స్ధాయిలో ఉండి గుండెపోటు కలిగిస్తుంది. మరి ఈ వ్యాధి కారణాలు, లక్షణాలు, చికిత్స ఎలా ఉంటాయి? అనేది పరిశీలించండి.

అసలు కొల్లెస్టరాల్ అంటే ఏమిటి?
ఇది శరీర కణాలలో ఉండే కొవ్వు లాంటి పదార్ధం. ఇది శరీర కణాలకు శక్తినిస్తుంది. అది మనం తినే ఆహారంనుండి ఏర్పడుతుంది. మన పొట్టలోని లివర్ రక్తాన్నుండి కొల్లెస్టరాల్ తీసుకుని ప్రొటీన్ గా తయారు చేసి టిష్యూలకు అందిస్తుంది. ఈ కారణంగా మన శరీరం పని చేస్తూ ఉంటుంది. కనుక ఇది ఎంతో ప్రధానమైన చర్య. హార్మోన్లు, విటమిన్ డి వంటివి కావాలంటే కొల్లెస్టరాల్ సహకరిస్తుంది. అంతేకాదు మనం తినే ఆహారం జీర్ణం కావాలన్నా కొల్లెస్టరాల్ కావలసిందే. అయితే, ఈ కొల్లెస్టరాల్ శరీరంలో అధికం అయితే అది రక్తనాళాల గోడలకు అంటుకుపోతూ ఉంటుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.
వంశానుగత హైపర్ కొలెస్టరోలేమియా కు కారణాలు - వంశంలో పెద్దల క్రోమోజోములలో కల చెడుప్రధానంగా చెప్పాలి. ఈ లోపం కలిగినపుడు అది రక్తం నుండి చెడు కొల్లెస్టరాల్ ను తగ్గించలేదు. కనుక ఆ రనవిధంగా రక్తంలో ఎల్ డిఎల్ అంటే చెడు కొల్లెస్టరాలు పెరిగిపోతూనే ఉంటుంది. ఈ పరిస్ధితి ఆటో మేటిక్ గా వంశంలో ఒకరినుండి మరి ఒకరికి వస్తూనే ఉంటుంది. ఇది తల్లి తండ్రులలో ఏ ఒక్కరినుండి వచ్చినా చాలు కీడు కలిగిస్తుంది.
లక్షణాలు ఎలా? శరీరంలో ఎల్ డిఎల్ కొల్లెస్టరాల్ స్ధాయి పెరగటం, చర్మం కింద లేదా కండరాలలో కొల్లెస్టరాల్ డిపాజిట్లు ఏర్పడటం, కంటి గుడ్డు భాగంలో కూడా కొల్లెస్టరాల్ నిల్వలు మరియు కను రెప్పలలో కూడా ఇది ఏర్పడుతుంది. ఇంతేకాక, మీకు కుటుంబంలో ఎవరికైనా యాంజినా అంటే ఛాతీ నొప్పి ఉంటే, ఈ ఎల్ డిఎల్ కొల్లెస్టరాల్ ఏర్పడినట్లే.
డయాగ్నసిస్ ఎలా? కుటుంబ చరిత్ర, గుండె తీరు పరీక్షించాలి. లేబరేటరీలలో ఇది సాధ్యమే. కొల్లెస్టరాల్ కనుక 300 పైచిలుకు ఉంటే, మీరు దీని బారిన పడినట్లు భావించవచ్చు.
దీనికి చికిత్స ఎలా? ఈ వ్యాధికి చికిత్సగా, మీరు జీవన విధానాలు సరి చేసుకోవాలి. అంటే బరువు తగ్గటం, ప్రధానంగా నడుము వద్ద కొవ్వు తగ్గించుకోవడం చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం, నడక, వెయిట్ లిఫ్టింగ్, అరబిక్స్ సైకిలింగ్ క్రీడలు చేయాలి. ఈ చర్యలు మంచి కొలెస్టరాల్ పెంచి చెడు కొల్లెస్టరాల్ను ట్రిగ్లీసెరైడ్స్ ను తగ్గిస్తాయి. ఆల్కహాల్ తాగరాదు. పొగతాగటం మానేయాలి. వైద్యులు సూచించిన మందులను తప్పక వాడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications