Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అధిక రక్తపోటు - గుండెకు చేటు!
అధిక రక్తపోటు - గుండెకు చేటు!

బ్లడ్ ప్రెజర్ - సాధారణంగా మన శరీరంలోని రక్తం ధమనుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ధమనులలో ప్రవహించే ఈ రక్తం, ధమనుల లోపలి గోడల మీద కలిగించే ఒత్తిడినే బ్లడ్ ప్రెజర్ లేదా రక్తపోటు అంటారు. సాధారణంగా గుండె వ్యక్తులను బట్టి, వ్యక్తి యొక్క పరిస్ధితులను బట్టి నిమిషానికి 60 నుండి 90 సార్లు కొట్టుకొంటుంది. ఈ విధంగా గుండె కొట్టుకొన్నప్పుడు ఒక్క హృదయ స్పందనకు దాదాపు 70 సి.సి. రక్తం ప్రవహిస్తుంది. ఈ విధంగా రక్తం గుండె నుంచి శరీరంలోని మిగతా అవయవాలకు రక్తనాళాల ద్వారా ప్రవహిస్తుంది.
ఈ విధంగా గుండె నుండి రక్తం శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేయడానికి కొంత ఒత్తిడి కావలసి ఉంటుంది. దీనినే బ్లడ్ ప్రెజర్ అంటారు. అయితే ఈ బ్లడ్ ప్రెజర్ అనేది ఒకే విధంగా ఎప్పుడూ ఉండదు. గుండె సంకోచించినపుడు గుండె నుండి రక్తం ధమనుల్లోకి ప్రవహించినపుడు రక్తపోటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనినే సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. అయితే గుండె వ్యాకోచించినప్పుడు ఈ రక్తపోటు తక్కువగా ఉంటుంది. దీనిని డయాస్టాలిక్ ప్రెజర్ అంటారు.
సాధారణంగా డాక్టర్లు బి.పి. అంటే బ్లడ్ ప్రెజర్ ను స్పిగ్మోమేనోమీటర్ తో కొలుస్తారు. రక్తపోటును పరీక్షించడానికి ఇది అత్యుత్తమ సాధనం. సాధారణంగా ఒక వ్యక్తిలో రక్తపోటు 120 /80 వుంటుంది. దీనిని డాక్టర్లు 120 /80 మెర్క్యురీ మిల్లీ మీటర్లు అని వ్రాస్తారు. ఈ 120 /80లో పై అంకె 120 సిస్టోలిక్ ప్రెషర్ ను క్రింది అంకె 80 డయాస్టాలిక్ ప్రెషర్ ను సూచిస్తుంది. అయితే రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉండే అధిక రక్తపోటుగా, వృధ్ధులలో 160/90 దాటితో అధిక రక్తపోటుగా భావించవచ్చు. అయితే, ఈ రక్తపోటు చిన్న పిల్లలలో తక్కువగా ఉంటుంది. పెద్దలలో సైతం పరిస్ధితులను బట్టి మారుతుంది. నిద్రించే సమయంలో తక్కువగా ఆవేశం, భయాందోళనలలో ఉన్నపుడు శ్రమ అధికంగా పడుతున్నపుడు ఎక్కువగా ఉంటుంది.
ఈ రక్తపోటు సాధారణంగా ఉంటే రక్తనాళాలలో రక్తం సాధారణంగా ప్రవహిస్తుంది. అయితే ఇది ఎక్కువ కావడం లేదా తక్కువ అవడం జరిగితే రక్త ప్రవాహంలో మార్పులు వస్తాయి. దీంతో శరీరంలో సమస్యలు ఏర్పడతాయి. అధిక రక్తపోటు లక్షణాలు పరిశీలిస్తే, తలనొప్పి రావడం, ఛాతీ బరువెక్కినట్లు అనిపించడం, మూత్రం తరచుగా అవుతుండటం, తరచూ తలతిప్పడం, మానసిక ఆందోళన చెందడం, ఆయాసం, ఒళ్ళు తూలడం అధికంగా ఉండటంగా వుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications