Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
గుండె పోటు ఒకటే, మందులు ఎన్నో రకాలు?

కనీసం అయంటే అయిదు రకాల మాత్రలను గుండెపోటు రోగికి సూచిస్తారు. గుండెపోటుకి మందుల వాడకం ఎంతో ప్రధానమైంది. మరో మారు గుండె పోటు రాకుండా వుండాలన్నా, లేక రోగి త్వరగా కోలుకోవాలన్నా డాక్టర్లు సూచించిన విధంగా రోగి మందులు తప్పక వాడాలి. వీటిని ఎట్టి పరిస్ధితులలోను మరచిపోవటం జరుగరాదు. మర్చిపోవటం జరిగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించాలి.
వైద్యులు సూచించే మందులలో యాస్పిరిన్ తప్పక వుంటుంది. యాస్పిరిన్ రోగి రక్తాన్ని పలుచన చేసి రెండవమారు గుండెకు రక్త సరఫరా ఆటంకం కాకుండా చేస్తుంది. రోగి త్వరగా కోలుకొనేలా చేస్తుంది. గుండెపోటు రోగులు వాడే మందులను వారంత వారే కాక, కుటుంబంలోని సభ్యులు మరొకరు కూడా వాటి ఉపయోగాన్ని గమనిస్తూ వుండాలి. సరైన సమయంలో వాటిని వేయటం ప్రధానంగా గుర్తించాలి. సమయం మించిపోతే, కొన్ని మార్లు మారోమారు గుండెపోటు రోగి అనారోగ్యానికి గురికావలసి వస్తుంది.
గుండెపోటు రోగికి సూచించే మందులలో క్లిపిడోగ్రెల్ అనే మాత్ర మరొకటి. ఇది కూడా రోగి శరీరంలోని రక్తాన్ని బాగా పలుచబడేసి, రక్తనాళాలలో రక్తం తేలికగా ఎట్టి అడ్డంకులు లేకుండా ప్రవహించేలా చేస్తుంది. ఎన్నో సమయాలలో చివరి దశలో వున్న రోగులను సైతం ఈ మందు కాపాడిందని కూడా చెపుతారు. వీటి వాడకం వలన గుండె కొట్టుకునే తీరు మారుతుంది. హార్ట్ రేట్ తగ్గి గుండె స్ధిర పడుతుంది. రెండవ మారు గుండెపోటు కూడా రాకుండా వుంటుంది. రోగి బతికే అవకాశాలు అధికంగా వుంటాయి. రక్తనాళాల రోగ నిరోధకత పెరిగి గుండె మరింత సమర్ధవంతంగా రక్తాన్ని తీసుకోవడం, వదలడం వంటివి చేస్తుంది.
గుండెపోటు తర్వాత, గుండె ఈ రకంగా కొన్ని మందులతో స్ధిర పడిన తర్వాత, రోగి ఆరోగ్యం నిలకడగా వుందనుకుంటే, వైద్యలు తదుపరి చర్యగా రోగి రక్తంలోని కొలెస్టరాల్ తగ్గించే స్టాటిన్ మందులు వాడతారు. ఈ కొల్లెస్టరాల్ తగ్గించే మందులు కూడా ఎంతో ప్రధానమైనవి. ఈ మందులు రోగి క్రమం తప్పకుండా వాడితే, రెండవసారి గుండె పోటు రాకుండా వుంటుంది. గుండె రోగికి వాడే మందుల వ్యయం కూడా అధికంగానే వుంటుంది. మందులు కూడా వివిధ రకాలుగా వుంటూనే వుంటాయి. రోగికి అవి వేసుకోవడం కష్టతరమైనప్పటికి వాటి ప్రాధాన్యత కారణంగా అవి తప్పక రోగి వాడవలసి వుంటుంది.
గుండెపోటు రోగులు త్వరగా కోలుకోవాలంటే మందులు క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు ప్రతిరోజూ తగిన సమయాలలో వాడుతూండాలి. అంతేకాక, రోగులు, క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు తరచుగా వైద్య పరీక్షలు సైతం చేయించుకోవాలి. గుండెపోటు చికిత్స, పరీక్షలు వ్యయంతో కూడుకున్నవైనప్పటికి, రోగి ఆరోగ్యరీత్యా అవి ఎంతో ప్రధానమైనవిగా గుర్తించాలి. రెండవమారు గుండెపోటు రాకుండా ఆరోగ్య నియమాలు, అంటే తగిన ఆహారం, వ్యాయామాలవంటివి వైద్యుల సూచన మేరకు పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications