Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గుండెపోటు వచ్చిన వెంటనే ....?

రోగి అంబులెన్సులో ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగానికి చేరగానే, అక్కడే వున్న నర్సు, డ్యూటీ డాక్టర్ మొదలైనవారు తక్షణమే హాజరవుతారు. వెంటనే వారు రోగిని ఇ.సి.జి లేదా ఎలక్ట్రో కార్డియోగ్రామ్ పై తక్షణమే పరిశీలిస్తారు. గుండెపోటు వచ్చిందని నిర్ధారించేందుకు ఇది ఒక మంచి పరీక్ష. కార్డియోగ్రాంలో కనుక గుండెపోటు వచ్చిందని నిర్ధారిస్తే, ఏం చేయాలి?
గుండె పోటులో రెండు రకాల గుండెపోట్లు వుంటాయి. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనబడే గ్రాఫ్ లో కొంత భాగం పైకి పోయి వుంటుంది. లేదా పూర్తిగా కిందకు వాలి అయినా వుంటుంది. అపుడు గుండెపోటు వచ్చిందని వారు గుర్తిస్తారు. గ్రాఫ్ కనుక పైకి పోతే, రక్తనాలం పూర్తిగా మూసుకుపోయిందని గుర్తిస్తారు. గుండెకు సాధారణంగా మూడు రక్తనాళాలుంటాయి. ఏదో ఒక దానిని తెరిచేందుకు వెంటనే వైద్యులు ప్రయత్నిస్తారు.
ఈ రక్త నాళాలు తెరవటానికి రెండు విధాలు వుంటాయి. ఒకటి మందుల ద్వారా తెరువచ్చు. అది రక్తనాళంలోని గడ్డను ఒక్కపెట్టున కరిగించేస్తుంది. రెండవ పద్ధతిగా ఆస్పత్రిలో కనుక కేధరైజేషన్ చేయదగిన అవకాశం వుంటే, దానిని చేస్తారు. ఈ పరీక్షలో కేధటర్ తో మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరుస్తారు. రక్తనాళంలోని మెత్తటి అడ్డును లేదా బ్లాకేజీని ముక్కలు చేస్తారు. అది పగిలి రక్తప్రవాహంలో కలుస్తుంది. గుండె పోటు రోగులకు పోటు వచ్చిన వెంటనే సమయం చాలా విలువైనది. అన్ని సౌకర్యాలు వున్న సమీప ఆప్సత్రి లేదా హెల్త్ కేర్ సెంటర్ వంటివి వారికి ఎంతో మేలు చేస్తాయి. ఆస్పత్రిఎమర్జెన్సీ విభాగాలలో సైతం వీరికి తక్షణ చికిత్స జరిగేలా చూడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications